– ప్రతి విద్యార్థి గురువు ను జీవితాంతం గుర్తుచేసుకుంటారు
– డిఎస్సీ నియామక పత్రాల కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్
అమరావతి: సదాశివుడు దగ్గర నుంచి రుషుల పరంపర వరకు మన దేశంలో గురువు కు ఉన్నత స్థానం ఉంది. అంటూ మాధవ్ తన ప్రసంగంలో అనేక అంశాలు ప్రస్తావనకు తీసుకుని వచ్చారు.. మెగా డిఎస్సీ నియామక పత్రాలు అందించడంతో ఆగకుండా ప్రతి సంవత్సరం డిఎస్సీ ఉంటుందని ప్రభుత్వం చెప్పడం హర్షణీయం
డిఎస్సీ నియామక పత్రాలు ద్వారా నవరాత్రి శుభాకాంక్షలు తెలిపారు. భారతదేశం విశ్వ గురు స్థానాన్ని సాధిస్తుందని నమ్మకం కలుగుతోంది. వికసిత భారత్, వికసిత ఆంధ్రప్రదేశ్ గా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ముఖ్య మంత్రి చంద్రబాబు చేస్తున్న కృషి ని అభినందించాలి. ప్రభుత్వం చేసిన పని చెప్పుకోవాలి ఆదిశగా మీకు నేరుగా నియామక పత్రాలు అందుతున్నాయి.