Suryaa.co.in

Telangana

పిసిసి ప్రెసిడెంట్ పదవి కొనుక్కొచ్చుకున్నదే

-ఉద్యమంలో రేవంత్ ఆంధ్రోళ్ల చెంతనే
-చంపినోల్లే కర్మ, కాండ చేస్తామంటున్నారు
-కాంగ్రెస్, బిజెపి లుఫెయిల్యూర్ పార్టీలు
-కాంగ్రెస్ ఎప్పుడో ఫెయిల్ అయింది
-కర్ణాటకతో బిజెపి ఫెయిల్యూర్ మొదలైంది
-ఫెయిల్యూర్ లో నిజమే ఉంటే జాతీయ స్థాయిలో అన్ని అవార్డులు వచ్చేవా
-డబుల్ ఇంజిన్ సర్కార్ కు అవార్డులు ఎందుకు రాలేదు
-అపరిపక్వంతో కూడినప్రతిపక్షాలు
-పాలనపై వారికి అవగాహన లేదు
-అటువంటి వారికి దశాబ్ది ఉత్సవాల ప్రాశస్త్యం తెలువదు
-ముఖ్యమంత్రి కేసీఅర్ లేకుంటే రేవంత్, బండి లకు పదవులు ఎక్కడివి
-కాంగ్రెస్, బిజెపి లకు మంత్రి జగదీష్ రెడ్డి సూటి ప్రశ్న
-మునుగోడు నియోజకవర్గం నాంపల్లి మండల కేంద్రంలో స్ధానిక శాసనసభ్యులు కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి అధ్యక్షతన బి అర్ యస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనం
-ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి జగదీష్ రెడ్డి, పాల్గొన్న రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య -యాదవ్ తదితరులు

పిసిసి ప్రెసిడెంట్ పదవవే కొనుక్కుచ్చుకున్నప్పుడు పాలన పరమైన అవగాహన ఎందు కుంటుందని రేవంత్ రెడ్డి పై రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి మండిపడ్డారు.తెలంగాణా ఉద్యమంలో ఆంధ్రా పాలకుల మోచేతి కింద బతికినోల్లకు తెలంగాణా దశాబ్ది ఉత్సవాల ప్రాశస్త్యం ఏమి తెలుస్తుందని ఆయన నిలదీశారు. సోమవారం నాడు జరిగిన మునుగోడు నియోజకవర్గ నాంపల్లి మండల బి ఆర్ యస్ ఆత్మీయసమ్మేళనానికి మంత్రి జగదీష్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. స్ధానిక శాసనసభ్యులు కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా జరిగిన సభలో మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ తండ్రిని చంపి బిడ్డను బతి కించినట్లు అంటూ నిండు సభలో ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలను ఆయన ఉటంకిస్తూ అటువంటి బిడ్డను పురిటిలోనే గొంతు నులిమి చంపినోల్లే కర్మ కండా నిర్వహిస్తామన్న చందంగా బిజెపి ప్రవర్తిస్తుందనీ ఆయన ఎద్దేవా చేశారు. 500 మేఘావాట్ల సీలేరు విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని ఆంధ్రాలో కలపడమే ఇందుకు తార్కాణమని ఆయన తేల్చి చెప్పారు.

కొత్తగా ఏర్పడ్డ తెలంగాణా రాష్ట్రంలో పాలనా సౌలబ్యత కొరకు ఐ ఏ యస్ లు, ఐ పి యస్ లు కావాలంటూ కొత్తగా రాష్ట్రంలో కొలువు దీరిన ప్రభుత్వం పక్షనా ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్రానికి అర్జీ పెట్టుకుంటే సంవత్సరం వరకూ ఆ ఫైల్ మొహం చూడని బిజెపి సర్కార్ అధికారంలోకి వచ్చిందే తడవుగా సీలేరు విద్యుత్ ఉప కేంద్రాన్ని ఆంధ్రకు అప్పగించే కుట్రలో భాగంగా తెలంగాణా లోని ఏడు మండలాలను ఆంధ్రకు అప్పగించారని ఆయన దుయ్యబట్టారు.

అటువంటి కాంగ్రెస్, బిజెపి లు ఇప్పుడు రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల గురించి మాట్లాడడం హాస్య స్పదంగా ఉందని విమర్శించారు. ఫెయిల్యూర్ ల పై స్పందిస్తూ కాంగ్రెస్, బిజెపి లు ప్రజా క్షేత్రంలో ఎప్పుడో ఫెయిల్ అయ్యాయని ఆయన పేర్కొన్నారు . కాంగ్రెస్ పార్టీ ఎప్పుడో ఫెయిల్ అయిందనీ ఆ పార్టీ చుక్కాని లేని నావలా తయారైందని ఆయన దెప్పి పొడిచారు. అటువంటి పార్టీలో పదవుల పందేరం జరుగుతుంది అనడానికి పిసిసి పదవీ కొసం జరిగిన బెర సారలే అద్దం పడుతుందన్నారు.

ఇది నేను అన్నది కాదని స్వయంగా సొంత పార్టీ నేతలే బహిరంగంగా చేసిన వ్యాక్యాలు అని ఆయన ఉటంకించారు. బిజేపి విషయానికి వస్తె కర్నాటక తో ఆ పార్టీ ఫెయిల్యూర్ స్టోరీ మొదలైందన్నారు. ఫెయిల్యూర్ లో నిజమే ఉంటే జాతీయ స్థాయిలో తెలంగాణా ప్రభుత్వం అందులో గ్రామీణాభివృద్ధి లో అన్ని అవార్డులు ఎలా సాదించుకుంటుందని తెలంగాణా ప్రభుత్వము ఫెయిల్యూర్ అన్న వారిపై విరుచుకపడ్డారు.

కేంద్ర ప్రభుత్వం గ్రామీణాభివృద్ధిలో 10 అవార్డులు ప్రకటిస్తే మొదటి 7 తెలంగాణావే నని,20 ప్రకటిస్తే అందులో 19 తెలంగాణావేనని ప్రకటించింది కుడా మోడీ నేతృత్వంలోని బిజేపి సర్కార్ అని ఆయన స్పష్టం చేశారు. ఫెయిల్యూర్ లో నిజమే ఉంటే తెలంగాణా కు ఇన్ని అవార్డులు ఎందుకు వస్తాయి అంటూ కాంగ్రెస్, బిజెపి లను మంత్రి జగదీష్ రెడ్డి నిలదీశారు.

అంత ఇంత అని గొప్పలు చెప్పుకుంటున్న డబుల్ ఇంజిన్ సర్కార్ లో గుజరాత్ తో సహ బిజేపి పాలిత రాష్ట్రాలకు అవార్డులు ఎందుకు రాలేదనీ ఆయన ఎదురు ప్రశ్నించారు.తెలంగాణా లో నిర్మాణత్మకమైన ప్రతిపక్షం లేదన్నారు. పరిపక్వంతో కూడిన నాయకత్వం తో బిజెపి, కాంగ్రెస్ లు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారన్నారు. అటువంటి వారికి తెలంగాణా దశాబ్ది ఉత్సవాల ప్రాశస్త్యం గురించి ఎంత మాత్రం అవగాహన ఉండదని అటువంటి నేతల దుష్ప్రచారాన్ని క్షేత్ర స్థాయిలో తిప్పి కొట్టాలని మంత్రి జగదీష్ రెడ్డి బి ఆర్ యస్ శ్రేణులకు పిలుపునిచ్చారు.

LEAVE A RESPONSE