Suryaa.co.in

Andhra Pradesh

రివర్స్ పాలనలో పీఆర్సీ సైతం రివర్స్

•ఉద్యోగుల పీఆర్సీపై ప్రభుత్వ మనసులో ఉన్నదే..ప్రభుత్వప్రధాన కార్యదర్శి తన నివేదికలో పేర్కొన్నారు
•దేశంలో ఎక్కడా లేని విధంగా జగన్ ప్రభుత్వం ఉద్యోగుల కోసం రివర్స్ పీఆర్సీ తీసుకొచ్చింది
•ప్రభుత్వం తీసుకొచ్చిన వాలంటీర్, సచివాలయ వ్యవస్థ సహా, ఆర్టీసీని విలీనం చేయడంతో ప్రభుత్వంపై ఏటా రూ.6వేలకోట్లకు పైగా భారం పడుతోంది
• ఆర్థికపరిస్థితులు గమనించకుండా, ప్రభుత్వం చేసుకున్న స్వయంకృతాపరాధాలకు, ఉద్యోగుల భవిష్యత్ ను, వారి ప్రయోజనాలను ఎలా ముడిపెడతారు?
• ఉద్యోగ సంఘాల నేతలు ఇప్పటికైనా ముఖ్యమంత్రి చెప్పాలి..అప్పటివరకు వేచిచూస్తామనే అక్కాబావ ముచ్చట్లకు స్వస్తి పలకాలి
• తాడోపేడో తేల్చుకోవడానికి ఉద్యోగ సంఘాల నేతలు సిద్ధపడితే, వారికి అన్నిరాజకీయపక్షాల మద్ధతు ఉంటుంది.
•టీడీపీ ఎమ్మెల్సీ పరుచూరి అశోక్ బాబు
దేశంలో తొలిసారి ఈ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి రివర్స్ పీఆర్సీని చూస్తున్నామని, పీఆర్సీ నివేదికలో ఏముందో తెలియదుగానీ, సెక్రటరీలకు సంబంధించి ప్రభుత్వం 27 శాతం ఫిట్ మెంట్ ఇస్తే, కేవలం 14శాతం చాలని చీఫ్ సెక్రటరీ ఆధ్వర్యంలోని కమిటీ చెప్పడం చూస్తుంటే, ఇంతకంటే దౌర్భాగ్యమైన పరిస్థితి ఇకముందు ఉద్యోగులకు ఉండదనడంలో ఎ లాంటి సందేహంలేదని టీడీపీఎమ్మెల్సీ పరుచూరి అశోక్ బాబు స్పష్టంచేశారు. మంగళవారం ఆయన మంగళగిరిలోనిపార్టీ జాతీయ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు.ఆ వివరాలు ఆయన మాటల్లోనే క్లుప్తంగా మీకోసం…!
చీఫ్ సెక్రటరీ ఆధ్వర్యంలోని కమిటీనివేదికలోని అంశాలు, ముమ్మాటికీ ప్రభుత్వం చెప్పినవా టిగానే భావించాల్సి ఉంటుంది. ప్రభుత్వం అసలు పీఆర్సీ ఇవ్వడానికి సిద్ధంగాలేదని ప్రభుత్వ ప్రధానకార్యదర్శి నివేదికతో బట్టబయలైంది. నిజంగా ఉద్యోగుల పీఆర్సీ, ఇతరత్రా ప్రయోజనాలు ఈప్రభుత్వానికి ఆర్థికభారమే అయితే, తెలంగాణప్రభుత్వంఇచ్చినట్లుగా 30 శాతం ఫిట్ మెంట్ ఇవ్వలేమని, యథావిధిగా గతంలోఉన్న 27శాతాన్నే కొనసాగిస్తామని చెప్పాల్సింది. అదికూడా చేయకుండా ఉద్యోగుల మనోభావాలను దెబ్బతీసేలా ప్రభుత్వమే 14శాతం ఫిట్ మెంట్ సరిపోతుందని చీఫ్ సెక్రటరీ నివేదికద్వారా తనమనసులోని మాటను బయటపెట్టుకుంది. గతంలో తెలంగాణఉద్యోగులకు ఇచ్చినట్టు ఫిట్ మెంట్ ఇవ్వాల్సిందేనని చంద్రబాబునాయుడి గారినిఒప్పించి, 10నెలల ఎరియర్స్ సాధించుకున్నాము.
కానీ ఈ ప్రభుత్వం వచ్చాక ఉద్యోగులపరిస్థితి అధ్వాన్నంగా తయారైంది. సెంట్రల్ గవర్నెమెంట్ ఫిట్ మెంట్ రాష్ట్రప్రభుత్వ ఉద్యోగులకుఇవ్వమని చెప్పిన ఇలాంటి చీఫ్ సెక్రటరీ ఐఏఎస్ అధికారి ఎలాఅయ్యారో తెలియడంలేదు. కేంద్రప్రభుత్వఉద్యోగులకు, రాష్ట్రప్రభుత్వఉద్యోగులకు జీతభత్యాల్లోచాలా వ్యత్యాసం ఉంటుందనేదికూడా ఐఏఎస్ స్థాయిఅధికారికి తెలియదా? 60నెలల పీఆర్సీ ఉద్యోగులకు రావాల్సిఉంటే, కేవలం 9నెలల పీఆర్సీ మాత్రమే చెల్లించా లంటారా? ప్రభుత్వం చెప్పినట్టే చీఫ్ సెక్రటరీ నివేదిక ఉంది. ప్రభుత్వం తానుచెప్పాలను కున్నది ప్రభుత్వప్రధానకార్యదర్శితో చెప్పించింది. ఉద్యోగులకు పీఆర్సీ ఇవ్వకూడదు…ఒక వేళ ఇచ్చినా, ఇప్పుడున్నదానికంటేఎక్కువ ఇవ్వకూడదన్నదే ప్రభుత్వఉద్దేశంలా ఉంది.
ప్రభుత్వం ఇంతస్పష్టంగా మనసులోనిదాన్ని బయటపెడితే, ఉద్యోగసంఘంనేతల వైఖరి ఇప్పటికీ అక్కాబావమాటలను తలపిస్తోంది. నాయకులనిర్ణయాలపై కొన్నిలక్షలమంది ఉద్యోగులభవిష్యత్ ఆధారపడిఉంటుంది. అమరావతి జేఏసీ అయినా, ఎన్జీవో జేఏసీ అయినా, ఏజేఏసీ అయినా ఉద్యోగ సంఘాలనాయకులు ఇన్నోవాకార్లలో దర్జాగా తిరుగుతుంటే, కింది స్థాయి ఉద్యోగుల జీపీఎఫ్ అడ్వాన్స్ లు

కూడా పొందలేక, పెళ్లిళ్లు, ఇతరత్రా కార్యాలు కూడాచేసుకోలేక నానాఅవస్థలు పడుతున్నారు. ప్రభుత్వాన్ని కనికరించిన పాపానికి ఇప్పటికే రూ.1000కోట్ల జీఎఫ్ అడ్వాన్సులుఆగిపోయాయి. ప్రభుత్వఖర్చులో 36శాతం సొమ్ముని ఉద్యోగులకే చెల్లిస్తున్నామని మరోఅపవాదువేయడానికి ప్రయత్నిస్తున్నారు. అలా చెప్పడం శుద్ధఅబద్ధం. 2018-19 నుంచి 2020-21 మధ్యప్రభుత్వ ఆదాయం తగ్గింది. అందుకుకారణం రాష్ట్రానికి పరిశ్రమలురాకపోవడం, అభివృద్ధిలేకపోవడమే. ప్రభుత్వ అసమర్థతతో రాష్ట్రానికిఆదాయం తగ్గితే, ఉద్యోగుల జీతభత్యాలు పెరిగాయని చీఫ్ సెక్రటరీ కమిటీ దారుణంగా అబద్ధాలు చెప్పింది.
ఆర్టీసీని ప్రభుత్వంలో కలపడంవల్ల ఈప్రభుత్వానికి రూ.2,300కోట్ల అదనపుభారం. దానితోపాటు వాలంటీర్ వ్యవస్థ మరో పెద్దగుదిబండ. పంచాయతీ , వార్డ్ సెక్రటరీలుగా లక్షా28వేలమందిని నియమించినందున ఈ ప్రభుత్వానికి ఏటా రూ.1800కోట్ల అదనపుభారం. వాలంటీర్ వ్యవస్థలో రూ.2,300కోట్ల అదనపుభారం. అనేకభారాలను ఈప్రభుత్వం కేవలం దానివిధివిధానాలతోనే కొనితెచ్చుకుంది తప్ప, అప్పటకే పనిచేస్తున్న ఉద్యోగులవల్ల వచ్చిందికాదు. ఆర్టీసి, వార్డు, సచివాలయ సెక్రటరీలు, వాలంటర్లీ వ్యవస్థతో ఈ ప్రభుత్వంపై దాదాపు రూ.6,700కోట్లవరకు భారంపడుతోంది. అదిలేకపోతే, 2020-21లో ఉద్యోగులచెల్లింపులభారం చాలావవరకు తగ్గేది. రాష్ట్రఆర్థిక పరిస్థితి గమనించకుండా, ప్రభుత్వ ఆదాయంలో 111శాతం ఉద్యోగు లకు ఖర్చుపెడుతున్నామనిచెప్పడం, మా ఆదాయానికి, మీజీతాలకు సరిపోతుందని నిందలు వేయడం ముమ్మాటికీ ఉద్యోగులను మోసగించడంతో పాటు, వారిని సమాజంలో దోషులుగా నిలబెట్టడమే అవుతుంది.
కోవిడ్ లోసేవల కోసం 13వేల మంది వైద్యఆరోగ్యసిబ్బందిని నియమించుకున్నాము.. దానివల్ల రూ.900కోట్లు ఖర్చయిందని చెబుతున్నారు. కోవిడ్ గ్రాంట్ కింద, కేంద్రప్రభుత్వం నుంచి ఏపీకి రూ.1400కోట్లు వచ్చాయి. కోవిడ్ కోసం ఈ ప్రభుత్వం కొత్తగా పెట్టిన ఖర్చేంలేదు. వైద్యారోగ్యసేవలకు సంబంధించి చాలాపథకాల్లో కేంద్రప్రభుత్వ నిధులు, రాష్ట్రాలకువస్తాయి. ఇలాంటివన్నీ ఉద్యోగులకు ఎలా ఆపాదిస్తారని తాముప్రశ్నిస్తున్నాం. 2014లో రాష్ట్రవిబజన జరిగితే, విభజనచట్టంలోని 9వ, 10వ షెడ్యూల్ కి సంబంధించి రూ.70వేలకోట్ల ఆస్తులు రాష్ట్రానికి రాకపోవడానికి ఈ ప్రభుత్వం కారణం కాదా? దానికి ఉద్యోగులకు ఎలా ముడిపెడతారు? కేసీఆర్ తో కలిసి భోజనం చేయడం తెలుసుగానీ, ఆస్తులు తెచ్చుకోవడం చేతగాదా? అలానే విద్యుత్ బకాయిలు రావాలని, ఇతరత్రా ఏవేవో బకాయిలు తెలుగుదేశంహయాం లోనివి రావాలని చెప్పడంచూస్తుంటే, ఈప్రభుత్వం ఉద్యోగులకు పంగనామాలు పెట్టడానికి సిద్ధమైందనే అనుకోవాలి.
గతంలో చంద్రబాబునాయుడు ఉద్యో గులవిషయంలో చూపినశ్రద్ధ, ఇచ్చిన పీఆర్సీపై, ఫిట్ మెంట్ పై కేంద్రప్రభుత్వం కూడా ప్రశ్నించింది. ఎందుకంత ఫ్యాట్ పీఆర్సీ ఇచ్చారని కేంద్రంప్రశ్నిస్తే, తెలంగాణ ఉద్యోగులతో పాటు ఏపీ ఉద్యోగులకు సమానంగా ఇవ్వాలనే ఇచ్చామని రాష్ట్రప్రభు త్వం చాలాహుందాగా సమాధానంచెప్పింది. ప్రభుత్వప్రధాన కార్యదర్శి నివేదిక 14శాతం పీఆర్సీని సూచించడంతో ఉద్యోగసంఘాలనేతలు చచ్చినట్టు ఇప్పుడిస్తున్న 27శాతమే ఇవ్వాలని కోరేలా ఈ ప్రభుత్వం దుస్థితి కల్పించింది. ఎడంచేత్తో కుడి చేత్తో ఈ ప్రభుత్వానికి ఓట్లేశామని ఒక ఉద్యోగసంఘం నేతచెప్పారు. పీఆర్సీ సహా, ఉద్యోగుల ప్రయోజనాలను సాధించుకోవాలనుకుంటే, ఆచేతులతోనే కత్తులు పట్టుకోమని పోరాడాలని ఈప్రభుత్వం చెప్పకనే చెబుతోంది. ఇప్పటికీకూడా ఈప్ర భుత్వం పీఆర్సీ నివేదికను వెబ్ సైట్లో పెట్టలేదు. ఇంకా వేచిచూస్తామని, ముఖ్య మంత్రి నిర్ణయం తమకు ముఖ్యమని కొందరు ఉద్యోగసంఘాలనేతలు మాట్లాడుతున్నారు.
ప్రభుత్వం వద్దమెప్పు పొందడానికి ఇంకెందరు ఉద్యోగుల జీవితాలతో సంఘాలనేతలు ఆడుకుంటారని ప్రశ్నిస్తున్నాం. ఒక ఉద్యోగసంఘం నాయకుడి నిర్ణయంతో ఉద్యోగులు ఎంతలా నష్టపోతారనే దానికి, ఉద్యోగులకు సంబంధించిన రూ.1600కోట్ల సొమ్ము, ప్రభుత్వంవద్ద ఆగిపోవడమే నిదర్శనం. ఆసొమ్ము ఈ ప్రభుత్వం ఎప్పుడిస్తుందో కూడా తెలియనిదుస్థితి. రూ.1600కోట్లు ప్రభుత్వం ఆపి నప్పుడే ఉద్యోగసంఘాలనేతలు స్పందించిఉంటే, ఇప్పుడు పీఆర్సీకి దేబిరిం చాల్సిన దుస్థితి వచ్చేదికాదు. కోవిడ్ వల్ల ప్రభుత్వానికిఆదాయం తగ్గిపోయింది అనడం, రూ.20వేలకోట్ల నష్టం వచ్చిందని చెప్పడం శుద్ధ అబద్ధం. 2018-19లో రాష్ట్రప్రభుత్వానికి రూ.68వేలకోట్ల రెవెన్యూవస్తే, 2020-21లో రూ.60వేలకోట్లు వచ్చింది. ఈప్రభుత్వానికి ఆర్థికంగా ఇబ్బందులేమీ లేవు.. ఈ వాస్తవాన్ని ఉద్యోగ సంఘాలనేతలు ప్రజలకుచెప్పకపోతే ఎలా? చీఫ్ సెక్రటరీ నుంచి తాము అనుకు న్న విధంగానివేదిక తెప్పించుకున్న ప్రభుత్వం, కావాలనే ఉద్యోగులజీవితాలతో చెలగాటమాడుతోంది.
ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకోకముందే, ఉద్యోగసంఘాల నేతలు గట్టిగా స్పందించాలి. లేకపోతే ఈప్రభుత్వం కూడా కుడిచేత్తో, ఎడంచేత్తో ఉద్యోగులను ఇబ్బందిపెట్టేపరిస్థితి వస్తుంది. 14శాతం ఫిట్ మెంట్ ఇస్తే సరిపోతుం దని చీఫ్ సెక్రటరీ నివేదిక చెప్పాకకూడా ఉద్యోగసంఘాలనేతలు ఇంకా మౌనంగా ఉండటం సిగ్గుచేటు. చీఫ్ సెక్రటరీగా ఇప్పుడున్నవ్యక్తే, గతంలో ఆర్థికశాఖ కార్యదర్శిగా కూడా పనిచేశారు. అలాంటివ్యక్తికి కేంద్రప్రభుత్వం, కేంద్రప్రభుత్వఉద్యోగులకు ఇచ్చే ప్రయోజనాలు ఏంటో తెలియవా? ఉద్యోగసంఘం నేతలు ఇప్పటికైనా తలవంచకుండా , ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని కోరుతున్నాం. సంఘాలనేతల ఉదాసీనవైఖరి, మౌనం లక్షలాదిఉద్యోగులజీవితాలను బలితీసుకోనుంది.
ఉద్యోగ సంఘం నేతల పోరాటానికి, ఉద్యోగులపక్షాన నిలవడానికి అన్ని రాజకీయపార్టీలు సిద్ధంగానే ఉన్నాయి. ఎక్కడైనా డ్యామ్ కి లీక్ వస్తే, చిన్నచిన్న మరమ్మతులతో నివారించవచ్చు.. అలాకాకుండా డ్యామ్ కొట్టుకుపోతే ఎవరూ ఏమీచేయలేరు. ఉద్యోగసంఘాలనేతలమని చెప్పుకుంటున్నవారివెనక ఎంతమం ది ఉద్యోగులు ఉన్నారో తెలియాలి. ఉద్యోగులు ఆందోళనచేస్తున్నారంటే, ప్రభుత్వం పై యుద్ధంచేయడమే. ఆ యుద్ధంలోఉద్యోగసంఘంనేతల పాత్రే కీలకం. వారు వారి విధి, కర్తవ్యం మర్చిపోతే ఎలా? గతంలో పీఆర్సీ ఇచ్చినప్పుడు ప్రభుత్వం మంత్రు లతో కమిటీ వేసేది. కానీ ఈప్రభుత్వానికి పీఆర్సీఇవ్వడం ఇష్టంలేదు కాబట్టే, చీఫ్ సెక్రటరీతో మొక్కుబడి నివేదిక తయారుచేయించింది.

LEAVE A RESPONSE