Suryaa.co.in

Andhra Pradesh

లోకేశ్ పాదయాత్రను అడ్డుకునేందుకు పోలీసులపై ఒత్తిళ్లు సిగ్గుచేటు

-ప్రభుత్వ ఒత్తిడి వల్లే కానిస్టేబుల్ రమేష్ గుండెపోటుతో చనిపోయాడు
-మృతుని కుటుంబానికి రూ. 1 కోటి ఎక్స్ గ్రేషియా ఇవ్వాలి
-టీడీపీ జాతీయ కార్యాలయంలో కానిస్టేబుల్ రమేష్ చిత్రపటానికి టీడీపీ నేతల నివాళి

లోకేశ్ పాదయాత్రను అడ్డుకోవాలని క్రింది స్ధాయి పోలీసు అధికారులపై ప్రభుత్వం ఒత్తిడి తెస్తోందని, ప్రభుత్వ ఒత్తిడి వల్లే గుండెపోటుతో కానిస్టేబుల్ రమేష్ చనిపోయాడని టీడీపీ నేతలు అన్నారు. నిన్న లోకేశ్ పాదయాత్ర విధి నిర్వహణలో గుండెపోటుతో చనిపోయిన చిత్తూరు జిల్లా హెడ్ కానిస్టేబుల్ రమేష్ చిత్రపటానికి టీడీపీ జాతీయ కార్యాలయంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు, పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, నక్కా ఆనంద్ బాబు, బోండా ఉమామహేశ్వరరావు, నిమ్మల రామానాయుడు, టీడీపీ జాతీయ అధికార ప్రతినిధులు గురజాల మాల్యాద్రి, నజీర్ అహ్మద్, తెలుగు రైతు రాష్ట్ర అధ్యక్షులు మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి పంచుమర్తి అనురాధ తదితర నేతలు నివాళి అర్పించారు. ఈ సంధర్బంగా పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య మాట్లాడుతూ….. లోకేశ్ పాదయాత్రను అడ్డుకోవాలని డీఐజీ కొల్లి రఘురామిరెడ్డి ఆధ్వర్యంలో తీసుకున్న నిర్ణయం ప్రకారం క్రింది స్ధాయి అధికారులపై ప్రభుత్వం ఒత్తిడి తెస్తోంది. ప్రభుత్వ ఒత్తిళ్ల వల్లే నిన్న లోకేశ్ పాదయాత్ర విధి నిర్వహణలో చిత్తూరు జిల్లా హెడ్ కానిస్టేబుల్ రమేష్ చనిపోయాడు. ఈ ఘటనకు ప్రభుత్వమే బాద్యత వహించి మృతుని కుటుంబానికి రూ. 1 కోటి ఎక్స్ గ్రేషియా ఇవ్వాలి.

ప్రభుత్వం క్రింది స్ధాయి పోలీసు అధికారుల ఆర్దిక ఇబ్బందులు పట్టించుకోవటం లేదు. సకాలంలో జీతాలివ్వకపోగా వారికి రావాల్సిన జీపీఎఫ్, పీఎఫ్ లు కూడా ఇవ్వటం లేదు. సరెండర్ లీవ్, అడిషనల్ సరెండర్ లీవ్ ఇవ్వకపోవటం ప్రభుత్వ దివాళు కోరుతనానికి నిదర్శనం. నిన్న కానిస్టేబుల్ రమేష్ మరణం, మొన్న నిరాశ, నిసృహ,ఆర్దిక ఇబ్బందులతో సీఎంపై అక్కసు వెల్లగక్కిన జగ్గయ్య పేట కానిస్టేబుల్ తన్నీరు వెంకటేశ్వరరావు ఉదంతాలను పోలీసులు తీవ్రంగా పరిగణించి క్రింది స్ధాయి అధికారులకు న్యాయం చేయాలి.

ఒక్క తన్నీరు వెంకటేశ్వరరావుని అరెస్టు చేసినంత మాత్రాన వైసీపీ ప్రభుత్వంపై పోలీసుల్లో ఉన్న ప్రెస్టేషన్ ని అణచివేయలేరు. వారికి రావాల్సిన ఆర్దిక రాయితీలు వెంటనే చెల్లించి ఆర్దిక ఇబ్బందుల నుంచి గట్టెక్కించాలి. డీజీపీ, సీనియర్ అధికారులు క్రింది స్ధాయి ఉద్యోగుల సమస్యలపై దృష్టి సారించాలి. విధి నిర్వహణలో ఒత్తిడి లేకుండా ప్రశాంత వాతావరణం కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని వర్ల రామయ్య అన్నారు.

LEAVE A RESPONSE