Suryaa.co.in

Andhra Pradesh

జగన్ రెడ్డి పాలనలో మసకబారిన రాష్ట్ర ప్రతిష్ట

-ప్రజావ్యతిరేకతను ఓర్చుకోలేకే రాష్ట్రంలో వైసీపీ అరాచకాలు
-తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడుతోనే రాష్ట్రానికి భవిష్యత్ అనే నిర్ణయానికి వచ్చేసిన ప్రజానీకం
-రాష్ట్ర భవిష్యత్ కోసం చంద్రబాబు నాయుడును బలపరిచేందుకు ముందుకొస్తున్న ప్రతి ఒక్కరికీ ఆత్మీయ ఆహ్వానం పలుకుతున్నాం
-నెల్లూరులోని టీడీపీ జిల్లా కార్యాలయంలో మీడియాతో పొలిట్ బ్యూరో సభ్యులు, మాజీ మంత్రివర్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి
-కోట్టమిట్ట ప్రాంతానికి చెందిన మైనార్టీ సోదరులను అబ్దుల్ అజీజ్, కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డితో కలిసి టీడీపీలోకి ఆహ్వానించిన సోమిరెడ్డి

సోమిరెడ్డి ఏమన్నారంటే..
2019 ఎన్నికల్లో మెజార్టీ మైనార్టీ సోదరులు జగన్ రెడ్డికి మద్దతు పలికారు..చంద్రబాబు నాయుడు కంటే ఆయన ఎక్కువ మేలు చేస్తారని ఆశించారు. జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క మైనార్టీలనే కాదు అన్ని వర్గాల ప్రజలను నిండా ముంచేయడంతో పాటు రాష్ట్ర ప్రతిభను మసకబార్చారు.
ఆర్థికంగా, రాజకీయంగా రాష్ట్రం పతనమయ్యే పరిస్థితులు తెచ్చారు.గతంలో జగన్ రెడ్డి వైపు మొగ్గుచూపిన మైనార్టీ సోదరులు ఇప్పుడు పరిస్థితులను అర్థం చేసుకుని రాష్ట్ర భవిష్యత్తు కోసం తెలుగుదేశంతో కలిసి నడవాలనుకోవడం. శుభపరిణామం.ఈ రాష్ట్రాన్ని మళ్లీ గాడిలో పెట్టాలంటే చంద్రబాబు నాయుడుతోనే సాధ్యమవుతుందని అర్థం చేసుకున్నందుకు సంతోషంగా ఉంది.

నవరత్నాలు, బటన్ నొక్కడాలు తప్ప గతంలో అమలులో ఉన్న అనేక సంక్షేమ పథకాలకు జగన్ రెడ్డి చరమగీతం పాడేశారు.పండగ, పెళ్లి కానుకలు, బీమాలు, వివిధ కార్పొరేషన్ల రుణాలు వంటే ఎన్నో పథకాలే గాక కేంద్ర ప్రభుత్వ పథకాలు కూడా లేకుండా చేసేశారు.రైతులకు కోసం గతంలో అమలైన ఎన్నో పథకాలు ఈ రోజు కనిపించడం లేదు. ఇవన్నీ గమనిస్తున్న ప్రజలు ఏ రోజు ఎన్నికలు జరిగినా తెలుగుదేశం పార్టీకి పట్టంకట్టి చంద్రబాబు నాయుడిని సీఎం చేసుకోవడానికి సిద్ధమయ్యారు. ప్రజల నాడిని గమనించిన జగన్ రెడ్డి తట్టుకోలేని పరిస్థితుల్లో అరాచకాలు సృష్టిస్తున్నారు.అక్రమ కేసులు, దాడులు, హత్యలు, మానభంగాలకు పాల్పడుతున్నారు.ఏకంగా ఎమ్మెల్సీలే మనుషుల్ని చంపేస్తుండగా, మంత్రులు కొడుతున్నారు, కొట్టిస్తున్నారు. ప్రభుత్వ అరాచకాలను ఎదుర్కొని రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరూ చైతన్యవంతులు కావాలి.

LEAVE A RESPONSE