Suryaa.co.in

National Telangana

ఏప్రిల్ 1వ తేదీ నాడు బోర్డ్ విద్యార్ధులతో ముచ్చటించనున ప్రధానమంత్రి!

విద్యార్ధులలో బోర్డ్ పరీక్షల పట్ల మరియు ప్రవేశ పరీక్షల పట్ల  భయాన్ని ,ఒత్తిడిని తగ్గించడానికి2018 నుండి ప్రతి సంవత్సరము  మాననీయ ప్రధానమంత్రిగారు దేశవ్యాప్తంగా ఉన్న విద్యార్ధులతో, ఉపాధ్యాయులతో మరియు తల్లిదండ్రులతో  పరీక్ష పే  చర్చ లో భాగంగా ముచ్చటిస్తూ విద్యార్ధులకు విలువైన సూచనలను చిట్కాలను అందిస్తున్నారు.  ఈ చర్చలో పాల్గొనడానికివిద్యార్ధులకు  పోటీలు నిర్వహించబడుతాయి. ఈ పోటీలలో విజేతలకు ఈ  ఈవెంట్ లో పాల్గొనే అవకాశం లభిస్తుంది. కొందరు విజేతలకు  ప్రధానమంత్రితో ముఖాముఖిగా మాట్లాడే అవకాశం కూడా లభిస్తుంది.

చరిత్ర
మొదటిసారిగా ఈ  కార్యక్రమం 2018 లో నిర్వహించబడినది. ఆ పై 2019,29 జనవరి నాడు న్యూ ఢిల్లీలో నిర్వహించబడినది.2020,2021 లో  ఆన్ లైన్ మాధ్యమం ద్వారా నిర్వహించబడినది. ఈ సందర్భంగా ఏప్రిల్ 1 నాడు మరలా ఈ కార్యక్రమం నిర్వహించబడుతుంది.

ప్రతి సంవత్సరము ప్రధానమంత్రి నరేంద్ర మోడి బోర్డ్ పరీక్షలు రాయబోయే 10 మరియు 12 వ తరగతి విద్యార్ధులతో ముచ్చటిస్తూ పరీక్షల గురించి, కెరీర్ గురించి, తమ జీవితము గురించి  విద్యార్ధుల అడిగే సందేహాలకు సమాధానాలిస్తారు.

https://innovateindia.mygov.in/ppc-2022/ అను వెబ్ సైట్ ద్వారా విద్యార్ధులు 29,ఫిబ్రవరి ,2022 వరకు రిజిస్టర్ చేసుకున్నారు. జవహర్ నవోదయ రంగారెడ్డి విద్యార్ధులు సుమారు 200 మంది రిజిస్టర్ చేసుకోవడమే కాక సర్టిఫికెట్లు కూడా పొందారు.ఈ కార్యక్రమాన్ని https://youtube.co/c/Mygovindia ద్వారా , దూరదర్శన్ ఛానళ్ల ద్వారా వివిధ సామాజిక మాధ్యమాల ద్వారా అందరూ వీక్షించవచ్చు.

పరీక్ష పే చర్చకై జవహర్ నవోదయ విద్యాలయ రంగారెడ్డిలో భారీగా ఏర్పాట్లు!
ఈ కార్యక్రమ నిర్వహణకై రంగారెడ్డి నవోదయ నోడల్ కేంద్రముగా, ఈ విద్యాలయ ప్రాచార్యులు డేనియల్
Jnv-rangareddyరత్నకుమార్ నోడల్ అధికారిగా ఎంపిక అయ్యారు.ఏప్రిల్ 1 వ తేదీ నాడు ఈ కార్యమానికై క్రింది విధంగా ఏర్పాట్లు చేయడం జరిగింది.
*రంగారెడ్డి జిల్లాలో గల రాష్ట్ర ,కేంద్ర ప్రభుత్వ పాఠశాలలతో ,విద్యా సంస్థలతో సమన్వయం చేయడం.
*ఏప్రిల్ 1 నాడు 11 గంటలకు విద్యాలయ బాహుళార్ధభవనములో భారీ తెరలను,సీటింగ్ ఏర్పాట్లు చేయడం.
*చుట్టు పక్కల ఉన్న పాఠశాలలలో చదువుతున్న విద్యార్ధులను పిలిపించి,కార్యక్రమాన్ని వీక్షించేలా ఏర్పాట్లు చేయడం.
ఈ విధంగా చేస్తూ బోర్డ్ విద్యార్ధులకు పరీక్షలంటే ఒత్తిడిని,భయాన్ని తొలగించేలా ఏర్పాట్లు చేయడం.

LEAVE A RESPONSE