– బిజెపి రాష్ట్ర కార్యదర్శి పాతూరి నాగభూషణం
విజయవాడ : ప్రధాని మోడీ 99 మన్ కీ బాత్ కార్యక్రమాలు నిర్వహించారు.ఈనెల 30న వందో మన్ కి బాత్ కార్యక్రమం లో మాట్లాడతారు.రాజకీయాలకు దూరంగా సమాజంలో విభిన్న వ్యక్తుల విశిష్టతను చెబుతున్నారు. కేంద్రం చేపట్టే కార్యక్రమాలు, మన సంస్కృతి, సంప్రదాయాలను ప్రస్తావించారు. ఏపీ కి చెందిన అశోక గజపతి రాజు, ప్రణీత, రాంభూపాల్ రెడ్డి, వంటి వ్యక్తులు చేసే గొప్ప కార్యక్రమాలు గురించి సమాజానికి వివరించారు.నూజివీడు చిన్న రసాలు, చిత్తూరు మామిడి గురించి కూడా మోడీ మాట్లాడారు.ఇలా దేశ వ్యాప్తంగా ఉన్న సామాన్యులు చేసే అసామాన్యమైన పనులను ప్రధాని ప్రస్తావించడం ఆయన ప్రత్యేకతకు నిదర్శనం.
విద్యాలయాల్లో విద్యార్దులు ప్రత్యేకంగా మన్ కీ బాత్ ను వీక్షించేలా ఏర్పాటు చేస్తున్నాం. మా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఇప్పటికే వారితో మాట్లాడి విద్యార్థులు ను భాగస్వామ్యం చేస్తున్నారు. మన్ కీ బాత్… అంటే ప్రధాని మోడీ మనసులో మాట. తన మనసు రాజకీయంగా కాకుండా ప్రజలు ను చైతన్య వంతులుగా చేసేలా ఆలోచన చేస్తుందని ఈ కార్యక్రమం ద్వారా మోడీ చాటి చెప్పారు. దేశ అభివృద్ధి, సేవా కార్యక్రమాలు, పదిమంది కి మంచి జరిగే అంశాలనే మోడీ వివరిస్తున్నారు. స్వచ్చ భారత్ విషయంలో రామోజీరావు చేసిన సేవలను కూడా మోడీ గతంలో ప్రస్తావించారు. మన్ కీ బాత్ వందో కార్యక్రమం ను ఎక్కువ మంది వీక్షించే లా అన్ని ప్రాంతాల్లో ఏర్పాట్లు చేస్తున్నారు.