– అమరావతి కాపిటల్ సిటీ మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటుపై అమరావతి మహిళా జేఏసీ, మరియు కాంగ్రెస్ నేత సుంకర పద్మశ్రీ ఫైర్
విజయవాడ : బ్రిటిష్ పాలకులు అమలు చేసిన విభజించి పాలించు సూత్రాన్ని ముఖ్యమంత్రి జగన్ రాష్ట్రంలో అమలు చేస్తున్నారు.ముఖ్యమంత్రి జగన్, ప్రధాని మోదీ అమరావతి రాజధానిపై భారీ కుట్రకు తెర లేపారు. మూడు రాజధానుల పేరుతో ప్రజల మధ్య వైషమ్యాలు సృష్టించిన జగన్ ఇప్పుడు అమరావతి రైతుల మధ్యలో చిచ్చు పెట్టాలని చూస్తున్నారు.తుళ్లూరు మండలంలోని 16 గ్రామాలు, మంగళగిరి మండలంలోని 3 గ్రామాలను కలిపి అమరావతి కాపిటల్ సిటీ మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు వెనుక అంతర్యం ఏంటి ?
అమరావతిని ఒక నగరంగా చూపి అక్కడి భూములను అమ్ముకోవాలని ముఖ్యమంత్రి కుట్రలు పన్నుతున్నారు.రాజధానిలో దాదాపు 6 వేల ఎకరాలు ఆదానీ కంపెనీకి అప్పగించేలా ముఖ్యమంత్రి జగన్, ప్రధాని మోదీ, కేంద్రమంత్రి అమిత్ షా తో డీల్ మాట్లాడుకున్నారు. రాజధాని నిర్మాణం కోసం భూసమీకరణ ద్వారా రైతులు స్వచ్చందంగా భూములు ఇస్తే అప్పటి ప్రభుత్వం CRDA మాస్టర్ ప్లాన్ ప్రకారం అమరావతిని అభివృద్ధి చేస్తాం అన్నారు. రాజధాని పూర్తి స్థాయిలో అభివృద్ధి జరగాలంటే 29 గ్రామాలకు కలిపి సిఆర్డిఏ పరిధిలో ఉంచాలి.
అమరావతి రాజధాని అంశం న్యాయస్థానం పరిధిలో ఉండగా అమరావతి కాపిటల్ సిటీ మున్సిపల్ కార్పొరేషన్ ఎలా ఏర్పాటు చేస్తారు ? రాజధాని నిర్మాణానికి అప్పటి ప్రభుత్వం ప్రజాభిప్రాయ సేకరణ చేసి భూముల తీసుకున్నారు. అమరావతి కాపిటల్ సిటీ మున్సిపల్ కార్పొరేషన్ పెడుతున్నప్పుడు అమరావతి రైతుల అభిప్రాయం తీసుకున్నారా? వైసీపీ ప్రభుత్వానికి బ్యాంకులు కూడా అప్పులు ఇవ్వకపోవడంతో అమరావతి భూములను చూపించి అప్పులు తీసుకోవాలని చూస్తున్నారు. రాష్ట్రాన్ని, అమరావతి రాజధానిని నాశనం చేయాలని ముఖ్యమంత్రి జగన్ కంకణం కట్టుకున్నారు. అమరావతి కాపిటల్ సిటీ మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటును తీవ్రంగా వ్యతిరేకిస్తూన్నాం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని కుట్రలు చేసిన అమరావతి రాజధాని అజరామరం.