Suryaa.co.in

Andhra Pradesh

కుల గణన ప్రాధాన్యతను ప్రజలకు వివరించాలి

ఎంపీ విజయసాయిరెడ్డి

మార్కాపురం: కులగణనతో అణగారిన వర్గాల అభ్యున్నతికి మరింత సమర్ధవంతంగా సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు రూపొందించే వీలు కలుగుతుందని రాజ్యసభ సభ్యులు, వైకాపా జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. ప్రకాశం జిల్లా మార్కాపురంలో వివిధ రంగాలకు చెందిన ఇన్ ఫ్లుయెన్సియల్ (సమాజాన్ని ప్రభావితం చేయగల) వ్యక్తులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ సారథ్యంలోని మంత్రి మండలి రాష్ట్రంలో కులగణన చేపట్టాలని తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకమని అన్నారు.

కులాల వారీగా ఉన్న జనాభా తెలిసినప్పుడే సామాజిక న్యాయం మరింత సమర్ధవంతంగా అమలు చేయవచ్చని అన్నారు. స్వాతంత్ర్యానికి పూర్వం బ్రిటిష్ పాలనలో దేశంలో మొట్టమొదటి సారి కులగణన జరిగిందని అన్నారు. అనంతరం స్వాతంత్ర్యం వచ్చిన తరువాత 1950లో జవహర్ లాల్ నెహ్రూ హయాంలో దేశంలో బీసీ కులాల జనాభా, వారి ఆర్థిక, సామాజిక స్థితిగతులు తెలుసుకునేందుకు ఒక సబ్ కమిటీని నియమించారు. కొన్ని నెలల తరువాత ఆ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ వివిధ కారణాల వల్ల బయట పెట్టలేదు.

అనంతరం 1977లో జనతా ప్రభుత్వంలో అప్పటి ప్రధాని వీపీ సింగ్ మండల్ కమిషన్ ఏర్పాటు చేశారు. కమిషన్ 3 సంవత్సరాల పాటు అధ్యయనం చేసిన తరువాత 1980లో నివేదిక సమర్పించింది. కొంతమంది వ్యతిరేకించినప్పటికీ కమిటీ సిఫార్సులు అమలు చేయాలని పట్టపట్టి బీసీలకు 27 శాతం రిజర్వేషన్ అమలు చేశారు. అయితే బీసీల కోసం అమలు. చేసిన.27 శాతం రిజర్వేషన్ కు రాజ్యాంగ భద్రత లేదని విజయసాయిరెడ్డి వివరించారు. ఈ కారణంగానే జాతీయ స్థాయిలో కులగణన చేపట్టాలని వైఎస్సార్సీపీ డిమాండ్. చేస్తోందని అన్నారు. ఇటీవల బీహార్ రాష్ట్రంలో చేపట్టిన కులగణన లో రాష్ట్ర జనాభాలో బీసీలు 55% ఉండగా 80% భూములు అగ్రవర్ణాల చేతుల్లో ఉన్నట్లు తేలిందని అన్నారు.

జగన్ ప్రభుత్వంలో గడచిన నాలుగున్నర ఏళ్లలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాల అభ్యున్నతికి అనేక పథకాలు రూపొందించి ఆయా వర్గాల అభివృద్ధికి బాటలు. వేశారని అన్నారు. కులగణనతో సామాజిక న్యాయం మరింత సమర్థవంతంగా అమలు చేయవచ్చని భావించి ఇటీవల జరిగిన కేబినెట్ లో రాష్ట్రంలో కులగణనకు ఆమోదం తెలిపిందని అన్నారు.

మార్కాపురంలో డీబీటీ ద్వారా రూ.688 కోట్లు పంపిణీ
ప్రకాశం జిల్లా మార్కాపురం నియోజకవర్గంలో డీబీటీ ద్వారా 51455 మంది బీసీలకు రూ.418 కోట్లు, 29463 మంది ఎస్సీలకు రూ.229 కోట్లు, 2229 మంది ఎస్టీలకు రూ. 16 కోట్లు, 3036 మంది మైనార్టీలకు రూ. 24 కోట్లు వివిధ సంక్షేమ పథకాల కింద అందించారని అన్నారు. మొత్తంగా 86183 మంది లబ్ధిదారులకు రూ.688 కోట్లు పంపిణీ చేశారని అన్నారు. అలాగే నాన్ డీబీటీ కింద బీసీలకు రూ.172 కోట్లు, ఎస్సిలకు రూ. 87కోట్లు,.ఎస్టీలకు రూ. 10 కోట్లు, మైనారిటీలకు రూ..10 కోట్లు పంపిణీ చేశారని తెలిపారు నియోజకవర్గంలో. 90వేల కుటుంబాలకు సంబంధించి 2.10 లక్షల మంది ఓటర్లు ఉన్నారని అందులో 87%.మందికి ఏదో ఒక రూపంలో లబ్ధి చేకూరిందని అన్నారు. అనంతరం డాక్టర్లు, లాయర్లు, వ్యాపారవేత్తల ప్రతినిధులు మాట్లాడి వారు పొందుతున్న లబ్ది అలాగే వారు ఎదుర్కొంటున్న చిన్న చిన్న సమస్యలు సమావేశంలో వివరించారు.

సమస్యలపై స్పందించి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో మంత్రులు మెరుగు నాగార్జున, ఆదిమూలపు సురేష్, మాజీమంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి, మార్కాపురం ఎమ్మెల్యే నాగార్జున రెడ్డి, జడ్పీ చైర్ పర్సన్ వెంకాయమ్మ ఇతర ప్రముఖులు పాల్గొన్నారు. అనంతరం బహిరంగ సబ వద్దకు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, ఇతర పార్టీ ప్రముఖులతో కలిసి నిర్వహించిన పాదయాత్రతో పాల్గొన్నారు.

LEAVE A RESPONSE