– కేబినెట్ సమావేశం అనంతరం రాజీనామా లేఖలు ఇచ్చిన 24 మంది మంత్రులు
– మంత్రులతో సరదాగా మాట్లాడిన జగన్
– నేడు గవర్నర్ కు రాజీనామాలు అందించనున్న జగన్
– 11న కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆధ్యక్షతన సచివాలయంలో జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ముగిసింది. ఈ భేటీలో 36 అంశాలపై మంత్రివర్గం చర్చించింది. అనుకున్నట్లే జగన్ మంత్రివర్గ సహచరులంతా మూకుమ్మడిగా రాజీనామా సమర్పించారు.
జగన్ నేతృత్వంలో త్వరలో రెండో కేబినెట్ కొలువు దీరనుండటంతో మొదటి కేబినెట్ చిట్టచివరి సమావేశంలో మంత్రిమండలిలోని 24 మంది మంత్రులూ రాజీనామా చేశారు. తమ రాజీనామాలను సీఎం
జగన్‌కు సమర్పించారు. అనంతరం మంత్రులు తమ ప్రోటోకాల్ వాహనాలు వెనక్కి ఇచ్చారు. మంత్రుల రాజీనామా పత్రాలను సీఎం జగన్ శుక్రవారం గవర్నర్‌కు సమర్పించే అవకాశం ఉంది.
ఈనెల 11న కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అయితే 25 మందీ కొత్తవారే ఉంటారా? లేదా ప్రస్తుత మంత్రుల్లో కొంతమంది కూడా అందులో ఉంటారా? అనేది చర్చనీయాంశంగా మారింది. కుల సమీకరణాల రీత్యా ప్రస్తుత కేబినెట్లోని కొందరు మంత్రులు కొత్త కేబినెట్లోనూ కొనసాగే అవకాశాలున్నట్టు సమాచారం. ఈ మేరకు కొత్త కేబినెట్లో కుల సమీకరణలు, అనుభవాన్ని పరిగణలోకి తీసుకుంటామని సీఎం స్పష్టం చేశారు.
సీనియర్ మంత్రుల అనుభవం కేబినెట్‌కు అవసరమని ఆయన వ్యాఖ్యానించారు. రాజీనామాల విషయంలో బాధపడుతున్నట్లు జగన్ మంత్రులతో చెప్పగా.. మీ నిర్ణయానికి కట్టుబడి ఉంటామని జగన్ కు
మంత్రులు తెలిపారు. కాగా కొత్త మంత్రులు ఎవరన్న విషయాన్ని ఈ నెల 9 లేదా 10 ఉదయం వరకు గోప్యంగానే ఉంచే అవకాశం ఉంది.
కేబినెట్ భేటీలో మంత్రులతో సీఎం జగన్ సరదాగా మాట్లాడారు. వెయ్యి రోజులు తన కేబినెట్‌లో ఉన్నారని, ఇక పార్టీ కోసం మీ సేవలు వినియోగించుకుంటానని తెలిపారు. ఈ విషయాన్ని రాజీనామాల విషయంలో బాధపడుతున్నట్లు మంత్రులకు జగన్ తెలిపారు. సీఎం నిర్ణయానికి కట్టుబడి ఉంటామని సీఎంకు మంత్రులు చెప్పారు. కేబినెట్ భేటీ ముగిసిన తర్వాత మంత్రులు రాజీనామా చేశారు. రాజీనామా చేసిన మంత్రులు ప్రొటోకాల్ వాహనాలు వెనక్కి ఇచ్చారు.
సీఎంగా జగన్ ప్రమాణస్వీకారం చేసినప్పుడే ‘అందరినీ తీసేస్తాం. కొత్తవాళ్లను నియమిస్తాం’ అని తొలుత చెప్పినప్పటికీ… నలుగురికి మాత్రం ‘ఇంకోసారి’ చాన్స్ ఉంటుందని సమాచారం. ఆదిమూలపు సురేశ్, సీదిరి అప్పలరాజు, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, గుమ్మనూరు జయరాంలను మళ్లీ మంత్రులుగా తీసుకుంటారని వైసీపీ వర్గాలు చెబుతున్నా =యి. బుధవారం ఢిల్లీ నుంచి రాగానే సీఎం జగన్ రాజ్‌భవన్‌లో గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్‌తో సమావేశమయ్యారు. కేబినెట్ ప్రక్షాళనపై ఆయనకు వివరించారు. 11వ తేదీన కొత్త మంత్రులు ప్రమాణస్వీకారం చేస్తారు.
పైరవీలు జగన్ దగ్గర నడవవు : పైరవీలు సీఎం జగన్ దగ్గర నడవవని మంత్రి పేర్నినాని తేల్చిచెప్పారు. కొద్దిసేపటి క్రితం ఏపీ కేబినెట్ భేటీ ముగిసింది. కేబినెట్ నిర్ణయాలను పేర్ని నాని మీడియాకు వెల్లడించారు. డ్వాక్రా మహిళల రుణంపై వడ్డీని వెనక్కి చెల్లించే కార్యక్రమం తీసుకున్నామని తెలిపారు. సున్నావడ్డీ పథకం కొనసాగింపునకు నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. ఏప్రిల్ 22న సున్నా వడ్డీ పథకం నగదును విడుదల చేస్తామని ప్రకటించారు.
సీఎం జగన్ ఏ బాధ్యత ఇచ్చినా ఆనందంగా స్వీకరిస్తానని పేర్నినాని తెలిపారు. 11న కొత్త మంత్రివర్గం ప్రమాణస్వీకారం ఉంటుందని తెలిపారు. పార్టీని మళ్లీ అధికారంలోకి తీసుకొచ్చేందుకు పనిచేస్తామని పేర్నినాని పేర్కొన్నారు. అలాగే ఏపీ మిల్లెట్ మిషన్ 2022-23 నుంచి 2026-27 ప్రతిపాదనకు కేబినెట్ గ్రీన్ సిగ్నలిచ్చింది. విద్య, వైద్య, ప్రణాళిక శాఖల్లో నియామకాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది.
రాజీనామా చేయమన్నారు…చేశాం…: కొడాలి నాని
మంత్రి పదవి ఉన్నా లేకపోయినా తాను మాత్రం జగన్ కోసం పార్టీ కోసం పని చేస్తానని కొడాలి నాని అన్నారు. 11న కేబినెట్ విస్తరణ ఉంటుందని జగన్ చెప్పినట్లు నాని తెలిపారు. పార్టీని, ప్రభుత్వాన్ని సమర్థవంతంగా నడిపేవాళ్లకు అవకాశం ఇస్తామని జగన్ చెప్పారని కొడాలి పేర్కొన్నారు. ఐదారుగురు కేబినెట్‌లో కంటిన్యూ అవుతారని సీఎం తమకు చెప్పినట్లు చెప్పారు. జగన్ ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటామన్నారు. కుల సమీకరణలను పరిగణనలోకి తీసుకుని మంత్రి పదవులుంటాయని తెలిపారు. రాజీనామాల లేఖపై సంతకాలు చేయమని జగన్ చెప్పారని, తామందరం చేశామని నాని స్పష్టంచేశారు.