Suryaa.co.in

Andhra Pradesh

దళిత ఎస్.ఐ రవిబాబుపై రౌడీషీటర్ దాడి చేయడం దుర్మార్గపు చర్య

సూళ్లూరుపేట లో దళిత పోలీస్ అధికారి రవిబాబుపై దాడిని ఖండిస్తూ డీజీపీకి లేఖ రాసిన తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య

• రాష్ట్రంలో పోలీసుల ప్రతిష్ట రోజురోజుకు దిగజారిపోతోంది.
• దళిత పోలీసు అధికారి ఆనందరావు ఆత్మహత్య ఘటన మరువక ముందే నెల్లూరు జిల్లా, సూళ్లూరుపేట మరో ఘటన చోటుచేసుకోవడం బాధాకరం.
• సునీల్ రెడ్డి అనే రౌడీ షీటర్ విధినిర్వహణలో ఉన్న దళిత ఎస్.ఐ రవిబాబుపై దాడి చేయడం దుర్మార్గపు చర్య.
• జూలై 16 న కౌన్సిల్ ఇచ్చేందుకు రౌడీ షీటర్లు స్టేషన్ లో హాజరు కావాలని ఎస్.ఐ రవిబాబు సమన్లు జారీ చేశారు.
• వైసీపీకి చెందిన సూలూరుపేట మునిసిఫాలిటీలో కో-ఆప్టెడ్ సభ్యుడైన సునీల్ రెడ్డి అనే రౌడీ షీటర్ స్టేషన్ కు వచ్చాడు.
• స్టేషన్ కు వచ్చి రాగానే నాకు సమన్లు ఇస్తావా అంటూ ఆగ్రహంతో పోలీసు స్టాప్ ముందే ఎస్.ఐ రవిబాబుపై దాడి చేసి కొట్టాడు.
• ఆకస్మిక దాడితో విస్మయానికి గురైన ఎస్.ఐ ఎట్టకేలకు తన సహాయంతో రౌడీ షీటర్ సునీల్ రెడ్డిని అరెస్టు చేశారు.
• ఇంతలోనే వైసీపీ నాయకులైన మున్సిపల్ చైర్ పర్సన్ దబ్బాల శ్రీమంత్ రెడ్డి, ధియేటర్ అకాడమి డైరక్టర్ అయిన శేఖర్ రెడ్డి లు రౌడీషీటర్ సునీల్ రెడ్డిని విడుదల చేయాలని ఎస్.ఐపై ఒత్తిడి చేశారు.
• విషయం పోలీసు పెద్దల వరకు వెళ్లడంతో సునీల్ రెడ్డిని విడుదల చేయాలంటూ పై అధికారులు ఆదేశించారు.
• ఈ ఘటన రాష్ట్రంలో దిగజారిపోతున్న శాంతిభద్రతలను ప్రతిబింబిచడమే కాకుండా పోలీసుల అధికారుల ధీనస్థితికి అద్దంపడుతోంది.
• పోలీసులే తమను తాము రక్షించుకోలేకపోతే…సాధారణ ప్రజల పరిస్థితి ఏంటి?
• వైసీపీ గూండాల నుంచి విధి నిర్వహణలో ఉన్న పోలీసుల అధికారులకు…ప్రత్యేకించి దళిత పోలీసు అధికారులకు రక్షణ లేదు.
• విధినిర్వహణలో ఉన్న దళిత పోలీసు అధికారిపై దాడి చేసిన రౌడీ షీటర్ సునీల్ ను వెంటనే అరెస్టు చేయండి.
• వైసీపీ గూండాలకు బయపడి రౌడీ షీటర్ సునీల్ ను అరెస్టు చేయకపోతే పోలీసు అధికారులు తమ ఆత్మస్ధైర్యం కోల్పేయే ప్రమాదం ఉంది.

LEAVE A RESPONSE