-మాజీ ఎమ్మెల్యే జివి ఆంజనేయులు
జగన్మోహన్ రెడ్డి పాలన అరాచకాలకు నిలయంగా మారింది… టీడీపీ కార్యకర్తలపై, రైతులపై అక్రమ కేసులు పెట్టె పోలీసులకు ప్రమోషన్లు ఇస్తున్నాడు… రాష్ట్రంలో ఎస్సిరైతు లకు బేడీలువేయించిన ఘనుడు, త్వరలోనే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని బేడీలువేసి రోడ్డుపై నడిపంచుకొంటు వెళ్లే రోజులు వస్తాయి… వినుకొండ నియోజకవర్గ పరిధిలో రైతుపై ఎమ్మెల్యే చెప్పు తీసుకొని కొట్టిన ఘటనలో పోలీసులు అక్రమ కేసులు పెడితే ఆ పోలీసు అధికారిని సస్పెండ్ చేశామని చెప్పి ఇప్పుడు మరల ప్రమోషన్ తో విధులక్లోకి తీసుకోవాలని ప్రభుత్వం చూడటం దారుణం… ఆర్ బి ఇ కేంద్రాలు దోపిడీ కేంద్రాలుగా మారాయి, మిరప రైతులు తీవ్రంగా నష్టపోతే పట్టించుకున్న దాఖలాలు లేవని అన్నారు… రాష్ట్రంలో రైతాంగం వేలకోట్ల రూపాయలు నష్టపోతే ఎందుకు రైతులను ఆదుకోవడం లేదని ప్రశ్నించారు… రైతులకు వడ్డీలేని రుణాలు ఇస్తామనిచెప్పిన జగన్ చేతులెత్తేశారు…. వ్యవసాయ రంగం రాష్ట్రంలో తీవ్రంగా కుంటుపడే పరిస్థితికి ప్రభుత్వం తీసుకు వచ్చారు… చివరకు రాష్ట్రంలో రైతులకు కన్నీరు మిగిల్చారని ఆవేదన వ్యక్తంచేశారు… రాష్ట్రంలో వైసీపీ నాయకులు పెత్తందారీ వ్యవహారంతో ఐ పి ఎస్ అధికారుల వ్యవస్థ కుదేలయింది…రైతులే వైసీపీ ప్రభుత్వన్నీ పడేగట్టి స్మశానానికి తరలించే రోజులు వచ్చాయని జోస్యం చెప్పారు… రైతు నరేంద్ర పండుగ రోజు కూడా జైల్లో వున్నాడు, తప్పుడు కేసులు పెట్టిన సిఐ కి మరల అక్కడే ప్రమోషన్ ఇవ్వడం ఏమిటని ప్రశ్నించారు.
మాజీ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ కామెంట్స్
18వ తేదీన ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తామని, రక్త దానం కార్యక్రమం,సాంస్కృతిక కార్యక్రమాలు, అన్నదాన కార్యక్రమం చేపడుతున్నాం… రాష్ట్ర ప్రభుత్వం రైతాంగ వ్యతిరేక విధానాల వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయారని,ఇక్రాప్ పేరుతో రైతులను దగా చేస్తున్నారు… రైతులకు నకిలీ నాసిరకం విత్తనాలు ,ఎరువుల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి,ఎరువులు రైతులకు అందుబాటులో ఉండవు….కౌలు రైతులు మిర్చి పంటకు ఒక ఎకరాకు లక్షయాబైవెలరూపాయలు ఖర్చుపెట్టి తీవ్రంగా నష్టపోయారు…మరోపక్క పండిన పంటకు గిట్టుబాటు ధరలు లేక అల్లాడిపోతున్నారు… వ్యవసాయ రైతు కూలీలకు చేతిలో పనిలేక ఇబ్బందులు పడుతున్నారు… ఇప్పటికయినా వ్యవసాయ శాఖ మంత్రి, వ్యవసాయ శాఖ అధికారులు ముందస్తు చర్యలు తీసుకోక పోతే ఆత్మహత్యలే శరణమనే పరిస్థితి ఏర్పడింది… ప్రభుత్వాన్నీ రైతులకు పండిన పంట గిట్టుబాటు ధర లేదని అడిగితే ఎమ్మెల్యే చెప్పుతో కొట్టటానికి వస్తే దానిపై ముఖ్యమంత్రి ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు… ముఖ్యమంత్రి ఆర్భాటంగా వరికి గిట్టుబాటు ధర 14వందల రూపాలు అని ప్రకటించి11వందలకు అంక్షల పేరుతో రైతును ఇబ్బందులు పెడుతున్నారు… జగన్ మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత లక్షల కోట్ల రూపాయాలు అప్పులు చేసి కూర్చుందని ,మంత్రులు జూదగృహాలు నడుపుతుంటే ముఖ్యమంత్రి ఇంట్లో కూర్చొని చోద్యం చూస్తున్నారని అన్నారు…ప్రభుత్వం డబ్బులుకోసం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడంలో అంతర్యమేమిటని ప్రశ్నించారు..ప్రజలు ప్రతిఒక్క విషయాన్ని సునిశితంగా పరిశీలిస్తున్నారు త్వరలోనే తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు..