75 ఏళ్ల స్వాతంత్ర్య భారతంలో గత పాలకులు కులవృత్తులు, చేతి వృత్తుల వారిని పూర్తిగా విస్మరించారు.
గ్రామాల్లో పెత్తందార్ల ఒత్తిళ్లు, కట్టుబాట్లకు లొంగి కేవలం కులవృత్తులకే అంకితమై.. వృత్తిపనులపై లీనమై జీవితం గడిపారు. దీంతో వ్యవసాయానికి దూరమై భూములు కోల్పోయారు.
పెట్టుబడిదారులు, పెత్తందార్లకే పెద్దపీట వేసేలా గత పాలకుల ఆలోచన విధానాలు ఉండేవి. గ్లోబలైజేషన్, లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, ఇండస్ట్రిలైజేషన్ పోటీతత్వానికి తట్టుకోలేక, వృత్తులను వదుకోలేక.. లక్షల కుటుంబాలు కేవలం వారి నైపుణ్యత ఆధారంగా బతుకులు వెల్లదీయాల్సిన దుస్థితి ఉండేది.
గ్లోబలైజేషన్, లిబరలైజేషన్ పేరిట పెట్టుబడిదారులు వృత్తులను హస్తగతం చేసుకున్నారు.
నరేంద్ర మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అభివృద్ధికి పెద్దపీట వేస్తూ పేదల సంక్షేమానికి పాటుపడుతుతోంది. ఇదే సందర్భంగా బడుగు, బలహీన వర్గాల ఆశాకిరణంగా కొత్త పథకానికి శ్రీకారం చుట్టింది.
కులవృత్తులవారి వృత్తి కౌశలాన్ని పెంపొందించేందుకు శిక్షణ, పరిశోధన, పరికరాల కల్పన, ఉత్పత్తుల నాణ్యత ప్రామాణికతకు మెరుగులు దిద్దడంతో పాటు ఆర్థిక సాయం అందించేలా నరేంద్ర మోదీ ప్రభుత్వం సంకల్పించింది.
సంప్రదాయ కళాకారులు, చేనేతకారులు, స్వర్ణకారులు, కమ్మరి, కుమ్మరి, వడ్రంగులు, రజకులు, క్షురకులు, తదితర వర్గాల ప్రజల కోసం ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన స్కీమ్ కు రూపకల్పన చేశారు.
సెప్టెంబరు 17వ తేదీన విశ్వకర్మ జయంతి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ గారు విశ్వకర్మ స్కీమ్ ను ప్రారంభించనున్నారు. రూ. 13 వేల కోట్లతో ప్రవేశపెట్టిన ఈ స్కీమ్ తో 30 లక్షల కుటుంబాలకు లబ్ధి జరగనుంది.
ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో నాలుగున్నర లక్షల మందికి ఈ స్కీమ్ తో ప్రయోజనం చేకూరుతుంది.
ఈ పథకంతో ఇంకా చర్మకారులు, మేస్త్రిలు, స్వర్ణకారులు, దర్జీలు, పనిముట్లు తయారుచేసే వారికి లబ్ధి జరగడంతో పాటు బలహీన వర్గాల కార్మికుల ఆర్థిక సాధికారతకు దోహదపడుతుంది.
కొయ్య పరికరాలు, మట్టిపాత్రలు, గృహోపకరణాలు వంటి మనిషి జీవనయానానికి తోడ్పడే వారికి ట్రైనింగ్ ఇచ్చి పీఎం విశ్వకర్మ సర్టిఫికెట్స్ జారీ చేసి గుర్తింపు కార్డులు ఇస్తారు.
ప్రధాని మోదీజీ పీఎం విశ్వకర్మ యోజన పథకాన్ని ఆవిష్కరించే కార్యక్రమాన్ని భారత ప్రభుత్వం, బిజెపి ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో అన్ని జిల్లాల్లో ప్రజలందరూ వీక్షించేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి.
శిల్పకళావేదికలో జరిగే కార్యక్రమంలో కేంద్రమంత్రి, బిజెపి రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారు, నేను పాల్గొంటాం. వరంగల్ లో కేంద్ర సహాయ మంత్రి రాజీవ్ రతన్ గారు పాల్గొటారు.
దేశ వ్యాప్తంగా భారత ప్రభుత్వం ఆధ్వర్యంలో 70 కేంద్రాల్లో … ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో 750 ప్రాంతాల్లో ‘ధన్యవాద్ మోదీజీ’ పేరుతో బైక్ ర్యాలీలు, పాలాభిషేకాలతో ధన్యవాదాలు తెలిపే కార్యక్రమాలు చేపడుతాం.
సెప్టెంబరు 17న సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో జరగబోయే వేడుకల్లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారు పాల్గొంటారు.
సెప్టెంబరు 16న అన్ని అసెంబ్లీ కేంద్రాల్లో మోదీజీకి ధన్యవాదాలు తెలిపేలా కార్యక్రమాలు చేపడుతాం. హైదరాబాద్ లోని బాగ్ లింగంపల్లి నుంచి రాష్ట్ర పార్టీ కార్యాలయం వరకు బైక్ ర్యాలీ నిర్వహిస్తాం.
రూ. 20 వేల కోట్లతో గతంలో ప్రధానమంత్రి మత్స్య సంపద యోజనను ప్రవేశపెట్టారు.
సబ్ కా సాత్, సబ్ కా వికాస్ లక్ష్యంతో అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమం జరిగేలా పాలన అందిస్తున్నారు.