Suryaa.co.in

Telangana

అదే జోరు.. అదే ఉత్సాహం.. భట్టి పాదయాత్రకు బ్రహ్మరథం

-96వ రోజు పాదయాత్రకు జననీరాజనం
-నకిరేకల్ నియోజకవర్గంలోకి అడుగుపెట్టిన పాదయాత్ర
-ఘనంగా స్వాగతం పలికిన నియోజకవర్గ కాంగ్రెస్ శ్రేణులు
-జనసంద్రంగా మారిన నకిరేకల్ నియోజకవర్గం

సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చేపట్టిన పీపుల్స్ మార్చ్ పాదయాత్ర 96వ రోజు నకిరేకల్ నియోజకవర్గం లో అడుగు పెట్టింది. మాజీ ఎమ్మెల్యే వేదాసు వెంకయ్య,, దైద రవీందర్, ఏసు పాదం, వేదాసు శ్రీధర్, వెంకట్ రెడ్డి తదితరుల ఆధ్వర్యంలో కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున నకిరేకల్ నియోజకవర్గం తాటికల్ గ్రామానికి వచ్చి భట్టి విక్రమార్క పాదయాత్రకు ఘనంగా స్వాగతం పలికారు.

సోమవారం పాదయాత్ర చిన్న సూరారం గ్రామం నుంచి ప్రారంభమై తాటికల్, హైవే బ్రిడ్జి నకిరేకల్ సెంటర్ నకిరేకల్ హైవే వరకు పాదయాత్ర కొనసాగింది దారి పొడవున ప్రజలను కలుస్తూ వారి సమస్యలు తెలుసుకుంటూ వారికి అభివాదం చేస్తూ పాదయాత్రను భట్టి విక్రమార్క ముందుకు కొనసాగించారు. ఈ సందర్భంగా వివిధ వర్గాల ప్రజలు భట్టి విక్రమార్కుని కలిసి వారి సమస్యలను ఏకరువు పెట్టుకున్నారు.

తాటికల్ గ్రామ శివారులో రోడ్డు పక్కన ఉపాధి హామీ కూలీలు. క‌ట్ట‌ చంద్ర‌క‌ళ‌, వ‌న‌మ్మ‌, సైద‌మ్మ‌, పూల‌మ్మ‌, క‌విత ఇత‌ర ఉపాధి కూలీలు క‌లిసి త‌మ క‌ష్టాల‌ను భట్టి కి చెప్పుకున్నారు. ఉపాధి పని ఫీల్డ్ అసిస్టెంట్ జాన‌య్య లేడ‌ని చెప్పారు. అంతేకాక ప‌ని చేసే ద‌గ్గ‌ర క‌నీసం టెంట్, మంచినీళ్లు కూడా లేవ‌ని చెప్పారు. డ‌బ్బులు కూడా వారం వారం ఇవ్వ‌డం లేద‌న్నారు. గీత కార్మికులు నార‌గోని సైదులు, నారోగోని స‌త్త‌య్య వ‌చ్చి క‌ష్టాలు చెప్పుకున్నారు. చెట్టు ఎక్కేందుకు మిష‌న్లు కావాల‌ని కోరారు.

అంతేకాక వ‌య‌సు పైబ‌డ్డ గీత కార్మికుల‌కు పింఛ‌న్లు ఇప్పించాల‌ని వేడుకున్నారు. ఆర్ల‌గ‌డ్డ గూడెంకు చెందిన నిరుద్యోగి ప‌దిరే ర‌వీంద‌ర్ రెడ్డి వ‌చ్చి ఎంటెక్ చ‌దివాను. గ్రూప్స్ సాధించాల‌న్న సంకల్పంతో ఎంతో క‌ష్ట‌ప‌డి ప్రిపేర్ అయ్యాను.. తీరా ప‌రీక్ష‌ రాసి ఫ‌లితాల కోసం ఎదురు చూస్తున్న త‌రుణంలో పేప‌ర్ లీక్ కావ‌డంతో.. ఏమీ చేయ‌లేక ఇంటికి వ‌చ్చి వ్య‌వ‌సాయం ప‌నులు చేసుకుంటున్నాను. ఇంటికి పెద్ద కొడుకును.. కావ‌డంతో కుటుంబ భారాన్ని త‌ప్ప‌క మోయాల్సిన ప‌రిస్థితులు ఏర్ప‌డ్డాయి. దీంతో మా పొలంలోనూ, బ‌య‌ట పొలంలోనూ మందులు పిచికారీ చేయ‌డం, ఇత‌ర ప‌నులకం వెళుతున్నాను అని చెప్పారు. అత‌ని ఆవేద‌న విన్న భ‌ట్టి విక్ర‌మార్క మాట్లాడుతూ.. వ‌చ్చే ఇందిర‌మ్మ రాజ్యంలో మీకు మేలు జ‌రుగుతుంద‌ని.. అధికారంలోకి వ‌చ్చిన వెంట‌నే జాబ్ క్యాలెండ‌ర్ ప్ర‌క‌టించి కొలువులు భ‌ర్తీ చేస్తామ‌ని హామీ ఇచ్చారు.

జ‌న‌సంద్రంగా మారిన న‌కిరేకల్ నియోజ‌క‌వ‌ర్గం
న‌ల్ల‌గొండ జిల్లా న‌కిరేక‌ల్ నియోజ‌క‌వ‌ర్గాన్ని భ‌ట్టి విక్ర‌మార్క పీపుల్స్ మార్చ్ జ‌న సునామీ తాకింది. కాంగ్రెస్ ప‌తాకాల రెప‌ రెప‌ల మ‌ధ్య‌ భ‌ట్టి విక్ర‌మార్క‌ పాదయాత్ర ముందుకు సాగింది. పీపుల్స్ మార్చ్ పాద‌యాత్ర‌లో ఆడ‌బిడ్డ‌లు, అక్క‌ చెల్లెమ్మ‌లు క‌లిసి న‌డుస్తూ… క‌దం తొక్కారు. పెద్ద ఎత్తున వచ్చిన ప్ర‌జాభిమానం మ‌ధ్య కాంగ్రెస్ జెండాను సీఎల్పీ నేత భట్టి మోస్తూ ముందుకు సాగారు. విక్ర‌మార్కుడి పాద‌యాత్ర‌లో స్వ‌చ్ఛందంగా ప్ర‌జ‌లు వేల సంఖ్యలో పాల్గొన్నారు. ప్ర‌భుత్వంపై వెల్లువెత్తుతున్న వ్య‌తిరేక‌త‌కు కదిలి వచ్చిన ఈ జనమే నిద‌ర్శనం. నాటి వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డిలా.. మా బతుకులు మారుస్తాడ‌నే నమ్మకం ఉందని అక్కడికి వచ్చిన జనాలు వెల్లడించారు

LEAVE A RESPONSE