– కోమటిరెడ్డి బ్రదర్స్‌ను నమ్మేవాళ్లెవరూ లేరు
– రైతాంగానికి నీళ్ళిచ్చే తీరిక కూడా రేవంత్ కు లేదు
– సీఎం కు ఆ తీరిక, జ్ఞానం లేదు
– మూసి ఎడమ కాలువకు నీటిని విడుదల చేసిన మాజీమంత్రి, స్థానిక ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి
సూర్యాపేట జిల్లా: రైతాంగానికి నీళ్ళిచ్చే తీరిక కూడా రేవంత్ కు లేదు. చీటికీ మాటికీ ఢిల్లీకి వెళ్లడం తప్ప రైతుల కష్టాలు పట్టవు. కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంతో వ్యవసాయ రంగంపై విన్యాసాలు చేస్తుంది. వర్షాభావ పరిస్థితి వల్ల నారుమళ్ళు, విత్తనాలు ఎండిపోయే పరిస్థితి ఏర్పడింది. వ్యవసాయానికి ఈ ప్రభుత్వం ఏమాత్రం అనుకూలంగా లేదు.
ఇక్కడ చక్రం తిప్పితే మూసి కాలవ ద్వారా నీటిని కిందికి ఏ విధంగా విడుదలవుతున్నాయి. ఒక్క బటన్ నొక్కితే చాలు కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా చివరి భూముల వరకు నీళ్లు అందుతాయి. కన్నెపల్లి పంప్ హౌస్ ప్రారంభం చేస్తే ప్రతి ఎకరాకు నీటిని అందించే అవకాశముంది. SRSP నుంచి రావిచెరువు వరకు 40 లక్షల ఎకరాకు నీళ్లందుతాయి.
నిజామాబాద్, మెదక్, కరీంనగర్, వరంగల్, నల్లగొండ జిల్లాలను సస్యాశ్యామలం చేయవచ్చు. ఇటువంటి కరువు పరిస్థితుల కొరకే కేసీఆర్ కాళేశ్వరం నిర్మించారు. సీఎం కు ఆ తీరిక, జ్ఞానం లేదు. ఇరిగేషన్ మంత్రికి సరైన అవగాహన లేదు. బనకచర్లకు అనుమతుల కోసమే కాళేశ్వరాన్ని పక్కకు పెడుతున్నారు.
గొర్రెల మందపై తోడేలు పడ్డట్టుగా ఇసుక రాశులను దోపిడీ చేసి కోట్ల రూపాయల సంపాదన కోసం అలవాటు పడ్డారు.కేవలం డబ్బు సంపాదన.. తమ పదవులు నిలబెట్టుకోవడం కోసం తెలంగాణలో లక్షలాది మంది రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారు.
కాళేశ్వరం వచ్చిన తర్వాతనే సూర్యాపేటలో పంటలు బాగా పండాయి. కాళేశ్వరం నీళ్లు వస్తేమాత్రమే రైతులకు కరువు తీరుతుంది.కేసీఆర్ పాలనలో కాళేశ్వరం జలాలతో తెలంగాణ కోనసీమను మించిపోయింది. కాంగ్రెస్ రేవంత్ పాలనలో మళ్ళీ కరువు మొదలైంది. గుడిలో ఉన్నమన్న సోయి కూడా లేకుండా నీ గబ్బు వ్యాఖ్యలతో దిగజారుడు మాటలు.
బనకచర్ల గోదావరి విషయంలో రేవంత్ చెంపలు వేసుకొని తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలి. వెంటనే కన్నేపల్లి పంపు హౌస్ ప్రారంభించి గోదావరి జలాలని కాళేశ్వరం ద్వారా రైతులకు అందించాలని డిమాండ్ చేస్తున్నాం. కోమటిరెడ్డి బ్రదర్స్ మాటలు, చేష్టల్ని, కుప్పిగంతుల్ని ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. ఆ బ్రదర్స్ మాట మీద నిలబడలేని వ్యక్తులనే విషయం అందరికీ తెలిసిందే.
25 కోట్లకు సీఎం సీటు కొనుక్కుని ముఖ్యమంత్రి అయిండని అన్నవాళ్లే ఆయన చుట్టూ మంత్రి పదవి కోసం ప్రదక్షణాలు చేస్తున్నారు.మాటలు అనడం, దొంగచాటుగా కలవడం వాళ్లకు మొదటినుంచి అలవాటే. ఈ నాటకాలన్నీ అపి ప్రజలకు ఉపయోగపడేలా పాలన అందించడంపై దృష్టి పెట్టండి.