Suryaa.co.in

Telangana

పేదలకు ఉపకరించే పధకాలు తెలంగాణాలోనే

డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్

సికింద్రాబాద్ : పేద ప్రజలకు ఉపకరించే పధకాలను అమలు పరచడంలో తెలంగాణా రాష్ట్ర అగ్ర స్థానంలో నిలుస్తుందని ఉప సభాపతి తీగుల్ల పద్మారావు గౌడ్ అన్నారు. శనివారం మారేడుపల్లి మండలం పరిధిలోని అడ్డగుట్ట ప్రాంతానికి చెందిన ఇద్దరు లబ్దిదారులకు జీ ఓ నెంబరు 58 ద్వారా జారీ చేసిన ఇళ్ళ పట్టాల పత్రాలను డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ సితాఫలమండీ లోని తన క్యాంపు కార్యాలయంలో అందించారు. అదే విధంగా మనికేశ్వరి నగర్ ప్రాంతానికి చెందిన ఓ శోభకు కళ్యాణ లక్ష్మి చెక్కును అందించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వం ద్వారా లభించే అన్ని ప్రయోజనాలు సికింద్రాబాద్ పరిధిలో అత్యధిక లబ్దిదారులకు సమకురేలా కృషి చేస్తున్నామని తెలిపారు. ప్రజలు తమ అన్ని అవసరాలకు తమ కార్యాలయాన్ని సంప్రదించాలని పద్మారావు గౌడ్ సూచించారు. కార్పొరేటర్ సామల హేమ, నాయకులు, అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

LEAVE A RESPONSE