– బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు
గూడూరు : జాతీయ విజ్ఞాన దినోత్సవం సందర్భంగా గూడూరు వి.ఎస్.ఆర్ పాఠశాల విద్యార్థులు ఏర్పాటు చేసిన వివిధ ప్రాజెక్టులను బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు సందర్శించారు. సైన్స్ ఆధారంగా దేశ ప్రగతిలో చోటు చేసుకుంటున్న మార్పులు, విద్యార్థి దశ నుండే సైన్స్ పట్ల మక్కువ పెంచుకోవలసిన ఆవశ్యకతను విద్యార్థులకు వివరించారు.
కేంద్ర ప్రభుత్వం విద్యార్థుల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని విద్యాలయాల్లో మౌలిక వసతులు కల్పించడం జరుగుతుందన్నారు. పరీక్షా పే ద్వారా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్వయంగా విద్యార్థులు కు మనోధైర్యాన్ని ఇస్తున్నాం విషయం ఈ సందర్భంగా బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు ప్రస్తావించారు. అనంతరం బిజెపి కార్యాలయంలో బిజెపి శ్రేణులు తో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా బిజెపి ఎమ్మెల్సీ అభ్యర్థి ని గెలిపించు కోవాలని పిలుపు ఇచ్చారు