– తెలంగాణ కిసాన్ కాంగ్రెస్ చైర్మన్ అన్వేష్ రెడ్డి సుంకేట
ప్రభుత్వం కొనుగోలు నిలిపివేయడం తో శనగ రైతులు 800 రూపాయలు నష్టపోతున్నారు. రాష్ట్రంలో 3 లక్షల 70 వేల ఎకరాల్లో శనగ పంట సాగు.ఒక్క ఉమ్మడి అదిలాబాద్ జిల్లాలోనే లక్ష 50 వేల ఎకరాల్లో శనగ పంట సాగు.ప్రభుత్వం కొనుగులు నిలిపివేయడంతో ఆదిలాబాద్ జిల్లాలో శనగ రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు.శనగ పంటను కొనుగోలు చేయమని రైతులతో కలిసి ఆందోళన చేసిన ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ నాయకుల మీద పోలీసులు చేసిన దాడిని కిసాన్ కాంగ్రెస్ తీవ్రంగా ఖండిస్తుంది.పోలీసులు మహిళ అని చూడకుండా ఏ ఐ సి సి సభ్యురాలు సుజాత మీద దాడి చేయడం తో ఆమె చేయికి గాయమైంది.అదే జిల్లాలో జోగు రామన్న గంటల తరబడి రోడ్డు మీద కూర్చుంటే స్పందించని పోలీసులు రైతాంగం పక్షాన ఆందోళన చేసిన కాంగ్రెస్ నాయకులను ఇబ్బందులకు గురి చేస్తున్నారు.ఆదిలాబాద్ జిల్లాలో ఇప్పటివరకు 30 శాతం మాత్రమే శనగ పంట కొనుగోలు చేసినారు. ప్రభుత్వం వెంటనే రైతుల వద్ద ఉన్న పూర్తి శనగ పంటను కొనుగులు చేయాలని డిమాండ్ చేస్తున్నాం.