Suryaa.co.in

Andhra Pradesh

రోశయ్య మృతితో రాష్ట్రం ఒక ఆర్ధిక నిపుణుడిని కోల్పోయింది

– కింజరాపు అచ్చెన్నాయుడు
మాజీ ముఖ్యమంత్రి, తమిళనాడు మాజీ గవర్నర్ కొణిజేటి రోశయ్య మృతి బాధాకరం. ‍ఆయన మృతితో రాష్ట్రం ఒక ఆర్దిక నిపుణుడిని కోల్పోయింది. రోశయ్య ఏ పదవి చేపట్టినా ప్రజాసేవే పరమావధిగా పనిచేశారు. ఉమ్మడి రాష్ట్రానికి ఆర్దికమంత్రిగా, ‎ముఖ్యమంత్రిగా రాష్ట్ర ప్రజలకు విశేష సేవలందించారు. రోశయ్య అన్ని పార్టీల నాయకులతోనూ ఎలాంటి విభేదాలకు తావులేకుండా స్నేహపూర్వకంగా మెలిగేవారు. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ కుటుంబ సభ్యులకు ప్రగాడ సానుభూతి.

LEAVE A RESPONSE