పులివెందులలో టీడీపీ కార్యకర్త హత్యను ఖండించిన చంద్రబాబు నాయుడు
నాగరాజు కుటుంబ సభ్యులను ఫోన్ లో పరామర్శించిన చంద్రబాబు నాయుడు
అమరావతి:- వైసీపీ పాలనలో హత్యా రాజకీయాలకు రాష్ట్రం కేరాఫ్ అడ్రస్ గా మారిందని నారా చంద్రబాబు నాయుడు అన్నారు. పులివెందుల నియోజకవర్గం అంబకపల్లెకి చెందిన టీడీపీ కార్యకర్త నాగరాజును పార్టీ మారలేదని హత్యచేయడాన్ని చంద్రబాబు నాయుడు ఖండించారు. పార్టీ మారకపోతే మనుషుల్ని చంపేస్తారా? ఇదేనా జగన్ రెడ్డి రాజకీయం అని ప్రశ్నించారు. నాగరాజును హత్య చేసిన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నాగరాజు కుటుంబానికి పార్టీ అన్ని విధాల అండగా ఉంటుందని చంద్రబాబు నాయుడు అన్నారు.