Suryaa.co.in

Andhra Pradesh

రాష్ట్రంలో ఆర్ధిక ఎమర్జెన్సీ ప్రకటించాలి

-రాజ్యాంగ నిబంధనలనూ పట్టించుకోరా
-రాష్ట్రంలో ఆర్ధిక..అరాచక పాలన
– ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ నర్రెడ్డి తులసిరెడ్డి

విజయవాడ : వైకాపా పాలనలో ఆర్థిక అరాచకత్వం, ఆర్థిక క్రమశిక్షణా రాహిత్యం పరాకాష్టకు చేరుకున్నాయని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ నర్రెడ్డి తులసిరెడ్డి ఆరోపించారు.

2020-21 లో రూ.1.10 లక్షల కోట్లు శాసన సభ ఆమోదం లేకుండా ఖర్చు చేసినట్లు కాగ్ పేర్కొందని, రూ. 48284 కోట్లు ప్రత్యేక బిల్లులు ద్వారా లావాదేవీలు నిర్వహించడం జరిగిందని, బడ్జెటేతర అప్పు రూ.86260 కోట్లు కాగా రాష్ట్ర స్థూల ఉత్పత్తి లో అప్పు 25 శాతం దాటకూడదని, కానీ రాష్ట్రంలో 36.4 శాతంగా ఉంది. దేశంలోనే ఇది అత్యధికం అని పేర్కొన్నారు.

సంవత్సరంలో 331 రోజులు రిజర్వ్ బ్యాంకు వద్దకు చిప్ప పట్టుకుని చేబదుళ్లకు పోయిందని, పరిస్థితి ఇలాగే కొనసాగితే త్వరలో రాష్ట్రం ఐపి పెట్టాల్సి వస్తుందని విమర్శించారు. 5 కోట్ల ఆంధ్ర ప్రజానీకాన్ని ఐపి బారి నుండి తప్పించేటందుకు రాజ్యాంగం లోని ఆర్టికల్ 360 ని ప్రయోగించి వెంటనే రాష్ట్రంలో ఆర్థిక ఎమర్జెన్సీని భారత రాష్ట్రపతి విధించాలని తులసి రెడ్డి డిమాండ్ చేశారు.

రాష్ట్రంలో ఆర్ధిక..అరాచక పాలన కొనసాగుతోందని, రాజ్యాంగ నిబంధనలనూ పట్టించుకోరా అని తులసిరెడ్డి ప్రశ్నించారు. రాష్ట్రం అప్పుల కుప్పగా మారిందని, దేశంలోనే అత్యధికంగా రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో అప్పు 25 శాతానికి మించకూడదని ఉన్నా ఆంధ్ర ప్రదేశ్ లో 36. 4 శాతానికి చేరుకోవడాన్ని చూస్తే ఆర్ధిక క్రమశిక్షణ పరాకాష్టకు చేరుకున్నట్లు అర్థమవుతోందని పేర్కొన్నారు.

వైకాపా పాలనలో శాసన సభకు, శాసన మండలికి బడ్జెట్ కు విలువ లేదని, ఆర్ధిక నిర్వహణలో అడుగడుగునా రాజ్యాంగ నిబంధనల ఉల్లంఘన జరుగుతోందని తులసి రెడ్డి విమర్శించారు.

LEAVE A RESPONSE