Suryaa.co.in

Andhra Pradesh

ఒక్క కాపు డీఎస్పీకీ పోస్టింగ్‌ ఇవ్వరా?

– జగన్ రెడ్డి అధికారం చేపట్టిన తర్వాత రాష్ట్రాన్ని రెడ్ల రాజ్యంగా మార్చారు
– అణగారిన కులాలను ఇంకా అణగదొక్కుతుంటే అణగారిపోవాలా?
– మాజీ ఎమ్మెల్యే కూన రవికుమార్

జగన్ రెడ్డి అధికారం చేపట్టిన తర్వాత రాష్ట్రాన్ని రెడ్ల రాజ్యంగా మార్చేశారని మాజీ ఎమ్మెల్యే కూన రవికుమార్ పేర్కొన్నారు. బుధవారం మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

‘‘జగన్ తన సొంత సామాజికవర్గాన్ని పెంచి పోషిస్తున్నారు. రెడ్డి సామాజిక వర్గంలో కూడా జగన్ రెడ్డి తన దోపిడీకి సహకరించే వారికి మాత్రమే పదవులు ఇచ్చి ప్రోత్సహిస్తున్నారు. బడుగు, బలహీన వర్గాలకు ఈ రాష్ట్రంలో స్థానం ఉందా? అనే అనుమానం కలుగుతోంది. క్రింది కులాలైన ఎస్సీ, ఎస్టీ, బీసీలు అధికారానికి అనర్హులా? అని అనిపిస్తోంది. 2017లో ఏసీబీకి అడ్డంగా దొరికిన వై.హరనాధ్ రెడ్డికి దళితులు, గిరిజనులు, బీసీలు అత్యధికంగా ఉన్న టెక్కలి ప్రాంతంలో పోస్టింగ్ ఇచ్చారు. గతంలో 53 మందికి డీఎస్పీ పోస్టింగ్ ఇస్తే అందులో 19 మంది రెడ్డి సామాజిక వర్గానికి చెందినవారే.

నేడు 29 సబ్ డివిజన్లలో డీఎస్సీలుగా పోస్టింగులు ఇస్తే అందులో కూడా 19 మంది రెడ్డి సామాజిక వర్గానికి చెందినవారే. ఇందులో కనీసం ఒక్క కాపు కులస్తుడికి కూడా పోస్టింగ్ ఇవ్వలేదు. అంతేకాకుండా ప్రముఖ పట్టణాలలోని డివిజన్లలో ఎస్సీ, ఎస్టీ, బీసీ సామాజిక వర్గాలకు చెందిన ఒక్కిరికి కూడా పోస్టింగ్ ఇవ్వలేదు. రాబోయే ఎన్నికల్లో జగన్ రెడ్డి తన అక్రమాలకు సహాయపడతారనే వీరికి డీఎస్పీలుగా పోస్టింగులు ఇచ్చారు. గతంలో 35 మందికి కమ్మ సామాజిక వర్గానికి చెందినవారికి డీఎస్పీ పదవులిచ్చారని జగన్ రెడ్డి విమర్శించారు.

దీన్ని బట్టే జగన్ రెడ్డికి పరిపాలనపై ఏమాత్రం అవగాహన లేదని అర్ధమైపోతోంది. ఇది రెడ్ల రాజ్యమో, ప్రజారాజ్యమో అర్థం కావడంలేదు. అణగారినవర్గాలు రాష్ట్రంలో మచ్చుకైనా ఉన్నాయా? అనే సందేహం కలుగుతోంది. తన రాజకీయ కక్షలు తీర్చుకోవడానికి సహకరించే వ్యక్తులకు జగన్ పట్టం కడుతున్నారు. అవినీతిపరుగులుగా ముద్రపడిన వ్యక్తులకు డీఎస్పీ పోస్టింగులు ఇచ్చారు. అవినీతి డిఎస్పీలు భవిష్యత్తులో సహకరించాలనేదే జగన్ ఉద్దేశం.

చంద్రబాబు డిఎస్పీల నియామకంలో అందరికి సమాన న్యాయం చేశారు. ఇది నిరూపితమైంది. దీనికి కులపిచ్చిగల జగన్ కు ముఖ్యమంత్రిగా కొనసాగే నైతిక అర్హత లేదు, నైతికబాధ్యత వహిస్తూ జగన్ రాజీనామా చేయాలి. జగన్ కుల దురహంకారాన్ని అణచాల్సిన అవసరముంది. అధిక శాతం రెడ్డి సమాజాకివర్గానికే పోస్టులు కట్టబెట్టడంలో అర్థమేమిటి? డీఎస్పీ బదిలీల్లో సొంత కులానికే ప్రాధాన్యతనిచ్చిన జగన్ రెడ్డి దీనిపై సమాధానం చెప్పాలి. బలిజ కులానికి చెందినవారు రాష్ట్రంలో లేరా? నీ ఒక్క కులానికి చెందినవారు మాత్రమే ఉన్నారా? ఎందుకింత కుల పిచ్చితో రగిలిపోతున్నారు?

డీఎస్పీ ప్రమోషన్లలో 37మందిలో 35 మందికి ఒకే సామజిక వర్గానికి చంద్రబాబు ప్రమోషన్లు ఇచ్చారనడం అబద్ధం. చంద్రబాబుపై నాడు జగన్మోహన్‌ రెడ్డి చేసిన ఆరోపణలు పచ్చి అబద్ధమని తేటతెల్లమైంది. 36 మందికి డీఎస్పీలుగా ప్రమోషన్‌ లలో 17 మంది ఓసీ, 12 మంది బీసీ, ఆరుగురు ఎస్సీ, ఒక ఎస్టీలను చేర్చారు. ఆనాడు ప్రత్యేక హోదా వస్తే ప్రతి జిల్లా ఒక రాజధానిగా మారుతుందని చెప్పిన జగన్మోహన్ రెడ్డి.. జనం 32 మంది పార్లమెంటు సభ్యుల్ని అందించినా ప్రత్యేక హోదా తేలేకపోయారు. ప్రతి జిల్లాని ఒక రాజధానిగా మార్చలేకపోయారు.

నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించలేకపోయారు. రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురాలేకపోయారు. కులపిచ్చితో రెడ్లని రాష్ట్ర వ్యాప్తంగా విస్తరింపజేశారు. ఇది కుల పిచ్చికి పరాకాష్ట. వెనుకబడిన కులాలవారు జగన్ మోసపు మాటలు నమ్మొద్దు. రెడ్డి సమాజాకివర్గంవారు దోచుకోవడానికి, దాచుకోవడానికి స్థానం కల్పించారు. బీసీలను మాత్రం కులాలవారీగా, ప్రాంతాలవారిగా విడగొట్టారు. కులచిచ్చు పెట్టి సాధించిందేమిటో తెలపాలి. వెనుకబడిన వర్గాలకిచ్చిన కార్పొరేషన్లలో పనిచేయడానికి కార్యాలయాలు లేవు.

ఒకవేళ కార్యాలయాలున్నా వాటిలో కూర్చోవడానికి కుర్చీలు కూడా లేవు. అభివృద్ధి చేద్దామంటే ఒక పైసా నిధులు ఉండవు. దళితులకు ఎస్సీ కార్పొరేషన్ ను రద్దు చేశారు. దళితులను విడగొట్టి కార్పొరేషన్లు పెట్టారు. మాలలకుగానీ, మాదిగలకుగానీ, రెల్లీ కులానికి చెందిన ఒక్కరికి కూడా స్వయం ఉపాధి మార్గాలను అందించలేదు. మీరు అణగదొక్కుతుంటే మేం అణగారిపోవాలా? రాష్ట్రంలోని బీసీలు మేల్కోవాలి. దళితులు జాగృతం కావాలి. గిరిజనులు ఉద్యమంబాట చేపట్టాలి. మన పిల్లల్ని భవిష్యత్తు లేకుండా చేస్తున్నారు.

జగన్, తన జాతి అహంకారాన్ని, కుల పిచ్చిని అంతమొందించేవరకు రాష్ట్రంలోని బీసీలు, ఓసీలు రాజులు, కాపులు, బ్రాహ్మణులు అందరూ తిరగబడాలి. బీసీల్లో అర్హులు లేరా? బీసీల్లో సమర్థవంతంగా పనిచేసేవారున్నారు. 2017లో ఏసీబీకి అడ్డంగా దొరికిన వై.హరనాధ్ రెడ్డి, అవినీతిపరుడిగా ముద్ర పడిన వ్యక్తి. అవినీతిపరుడిగా ముద్ర పడిన వ్యక్తికి మీరు టెక్కలి డిఎస్పీగా ఎలా కేటాయిస్తారు? నిబంధనలను కాలరాస్తున్నారు. తన కులంవారైతే ఎక్కడున్నా పర్వాలేదనేదే ఉద్దేశం. తన కులంవారైతే తనపై ఉన్న ఏసీబీ కేసునైనా ఎత్తేస్తారు. తన కులంవాడైతే ఎంత దోచుకున్నా, దోపిడీ చేసినా పర్వాలేదు.

కేవలం రాజకీయ కక్ష కోసం ప్రతిపక్షాలపై తప్పుడు కేసులు పెడుతున్నారు. వేధింపులకు గురి చేస్తున్నారు. రెడ్డి సామాజికవర్గానికి చెందిన అనేకమంది డీఎస్పీలను ఫోకల్ పోస్టుల్లో వేశారంటే ఇదే నిదర్శనం. తూర్పు గోదావరి జిల్లాకు చెందిన రెడ్డి సామాజికవర్గానికిచెందిన ఒక డీఎస్పీ ఎక్కడో మూలన పార్కు చేసుకున్న అమరావతి రైతులు పాదయాత్ర సందర్భంగా ఏర్పాటు చేసుకున్న రథాన్ని, అందులోని హార్ట్ డిస్కులను పగులగొట్టి తీసుకెళ్లి అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు. ప్రజాసంఘాలు చేసే పోరుబాటను కూడా నిర్వీర్యం చేయాలని చూశారు.

తెలుగుదేశం నాయకులను, కార్యకర్తలను నిర్బంధిస్తున్నారు. వారిపై తప్పుడు కేసులు పెడుతున్నారు, వారిని హౌస్ అరెస్టులు, ముందస్తు అరెస్టులు చేస్తున్నారు. ఇలాచేసి ఎన్నికల్లో లబ్ది పొందాలనే ఆలోచన వైసీపీ నాయకుల్లో ఉంది. జగన్మోహన్ రెడ్డి.. అవినీతిపరులు, దోపిడీదారులకు డిఎస్పీ పోస్టులు ఇవ్వడాన్ని టీడీపీ తరపున తీవ్రంగా ఖండిస్తున్నా’’మని మాజీ ఎమ్మెల్యే కూన రవికుమార్ తెలిపారు.

LEAVE A RESPONSE