Suryaa.co.in

Andhra Pradesh

నాలుగేళ్ల పాలనలో రాష్ట్రం 40 ఏళ్లు వెనక్కి వెళ్లింది

-టీడీపీ మినిమ్యానిఫెస్టోను ప్రజలంతా స్వాగతిస్తున్నారు
-2024 తర్వాత రాష్ట్రంలో వైసీపీ జెండా దారం కూడా కనిపించదు
– ప్రజా చైతన్య యాత్రలో టీడీపీ నేతలు

వైసీపీ నాలుగేళ్ల పాలనలో రాష్ట్రం 40 ఏళ్లు వెనక్కి వెళ్లిందని, అన్ని వర్గాలు తీవ్రంగా నష్టపోయాయని టీడీపీ నేతలు అన్నారు. టీడీపీ మినిమ్యానిఫెస్టోను ప్రజలకు మేలు చేసేలా రూపొందించామని ప్రజలంతా దీన్ని స్వాగతిస్తున్నారని అన్నారు. ప్రజా చైతన్య యాత్ర రాష్ట్రంలోని పలు నియోజకవర్గాల్లో టీడీపీ నేతలు భవిష్యత్తుకు గ్యారంటీ బస్సు యాత్రను చేపట్టారు. ఇందులో భాగంగా టీడీపీ మహానాడు వేదికగా ప్రకటించిన మేనిఫెస్టోపై ప్రజలకు వివరించారు. మంగళవారం టీడీపీ నేతలు చేపట్టిన బస్సు యాత్ర వివరాలు ఈ విధంగా ఉన్నాయి.

జోన్ 1 పరిధిలో :
విశాఖపట్నం పార్లమెంట్ గాజువాకలో యాత్ర జరిగింది. ఉదయం 9:30 గం ములగాడ ఆంజనేయ స్వామి గుడి వద్ద పూజలు నిర్వహించి యాత్ర ప్రారంభించారు. అనంతంరం గాజువాక డిపో దగ్గర డాక్టర్ అంబేద్కర్ విగ్రహానికి నేతలు పూలమాలవేసి డిపో ఎదురుగా మూసేసిన అన్నా క్యాంటీన్ వద్ద సెల్ఫీ తీసుకున్నారు.

గంటలకు మరిడిమాంబ మండపం వద్ద గల వరద నీరు గడ్డ HPCL 40 కోట్ల నిధులతో ఆధునీకరణ చేసిన డ్రేన్ వద్ద సెల్ఫీ, మరియు 18 కోట్లతో హిందుస్థాన్ షిప్యాడ్ నుంచి జింక్ వరకు రోడ్డు విస్తరణ , డబల్ రోడ్డు, డివైడర్ మధ్యలో సుందరీకరణ చేసిన (గత ప్రభుత్వంలో) వద్ద సెల్ఫీ తీసుకుని జగన్ కి చాలెంజ్ విసిరారు. అనంతరం మల్కాపురం మెయిన్ రోడ్డు ఆంజనేయస్వామి గుడి నుంచి మెయిన్ రోడ్డు మల్కాపురం జంక్షన్ వరకు భవిష్యత్తు గ్యారెంటీ మేనిఫెస్టో కరపత్రా పై ప్రచారం నిర్వహించారు.

అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ….జగన్ ఒక్క చాన్స్ అంటే ప్రజలు నమ్మి మోసపోయారు. నాలుగేళ్ల జగన్ పాలనలో ప్రజలు నరకం చవి చూసారు. జగన్ కు ప్రజలు ఇచ్చిన ఒక్క చాన్స్ అయిపోయింది. అందుకే ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులను అఖండ మెజారిటీ తో గెలిపించారు. టీడీపీ మానిఫెస్టో తో వైసీపీ కి వణుకుపుడుతుంది. టీడీపీ మానిఫెస్టో ప్రజల గుండె చప్పుడు. స్టీల్ ప్లాంట్ ప్రయివేటికరణ కు వ్యతిరేకంగా పల్లా శ్రీనివాస్ ప్రాణ త్యాగానికి సిద్ధమయ్యారు. తొమ్మిది రోజుల పాటు పల్లా ఆమరణ నిరాహారదీక్ష చేసి చంద్రబాబు కోరికపై దీక్ష విరమించారు. గాజువాకలో పల్లా శ్రీనివాస్ ని ప్రజలు భారీ మెజారిటీతో గెలిపిస్తారని అన్నారు.

మాజీ ఎమ్మెల్యే కూన రవికుమార్ మాట్లాడుతూ…ఏపీలో శాంతిభద్రతలు దిగజారిపోయాయి. ముఖ్యంగా విశాఖలో పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. వైసీపీ ప్రభుత్వంలో పోలీసు వ్యవస్థ ప్రమాణాలు దిగజారిపోయాయి. అందుకే అధికార పార్టీ ఎంపీ ఫామిలీ కిడ్నాప్ కు గురయ్యింది. చంద్రబాబు సంపద సృష్టిస్తే, జగన్ రాష్ట్రంలో సంపద అంతా దోచుకుంటున్నారు.

మంత్రి అమర్నాధ్ ను చూస్తుంటే జాలేస్తుంది. చంద్రబాబు, లోకేష్, టీడీపీ నేతలను తిట్టడానికి అమర్నాధ్ ను పరిమితం చేశారు. ఆయన శాఖలపై మంత్రి అమర్నాధ్ కు పట్టు లేదు. తప్పులు మీద తప్పులు చేస్తున్నారు కాబట్టే అధికారంలో ఉన్న వారు గన్ లు కావాలనుకుంటున్నారు. ప్రజల మద్దతున్న టీడీపీకి గన్ లు అవసరం లేదు. రాష్ట్రాన్ని కాపాడుకోవాలంటే జగన్ ని ఇంటికి పంపించాలి. ప్రజలకు భవిష్యత్ ఉండాలంటే చంద్రబాబు మళ్ళీ అధికారంలోకి రావాలని కూన రవికుమార్ అన్నారు.

మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తి మాట్లాడుతూ…
భూ కబ్జాలకు పాల్పడుతున్న వారికి, ఇసుక దోపిడీ దారులకు, గంజాయి స్మగ్లర్లకు, కిడ్నాప్ లు చేసే వారికి, బ్లాక్ టికెట్ అమ్మే వారికి, గంగవరం పోర్ట్ తక్కువ ధరకు కొట్టేసిన ఆధాని లాంటి వారికి జగనన్నే భవిష్యత్. అంతేగాని వైసీపీ పాలనలో ప్రజలకు భవిష్యత్ లేదు విశాఖ రాజధాని అని చెప్పిన జగన్ ఏం చేశాడు ? మేం కట్టిన ఫ్లయ్ ఓవర్ ను ప్రారంభించారు.

మేం శంఖుస్థాపన చేసిన భోగాపురం ఎయిర్పోర్టుకు మళ్ళీ శంఖుస్థాపన చేశారు. రాజధాని పేరుతో జగన్ విశాఖలో దశపల్లా, హాయగ్రీవ, ఎన్.సీసీ, కార్తీకవనం, బే పార్క్ భూములు రామానాయుడు భూములు కొట్టేశారు. టీడీపీ అధికారంలోకి వస్తేనే ప్రజలకు భవిష్యత్ అని బండారు సత్యనారాయణ మూర్తి అన్నారు.

తెలుగు మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత మాట్లాడుతూ…
విశాఖలో పరిస్థితులు మారిపోయాయి. శాంతిభద్రతలు లోపించడం వల్లే వైసీపీ నేతలు గన్ లైసెన్స్ కు అప్లయ్ చేసుకున్నారు. అధికార పార్టీలో ఫుల్ సెక్యూరిటీ ఉన్న మంత్రి అమర్నాధ్, ఎంపీ ఎంవీవీలకు గన్ లు ఎందుకు ? వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాస్తవానికి ప్రజలకు, ప్రతిపక్ష నేతలకు రక్షణ లేదు. వైసీపీ గూండాల నుంచి ముప్పు ఉన్న వారికివ్వాలని గన్ లైసెన్సులు ఇవ్వాని అనిత అన్నారు.

విశాఖ జిల్లా పార్లమెంట్ అధ్యక్షఉలు పల్లా శ్రీనివాస్ మాట్లాడుతూ….
నేను ఎమ్మెల్యే గా వున్నప్పుడు ప్రజల కోసం టోల్ గేట్ తీయించాను. మామూళ్ల కోసం ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి మళ్ళీ టోల్ గేట్ పెట్టించారు. హౌస్ కమిటీకి సంబంధించి టీడీపీ హయాంలో బాధితులకు పట్టాలు ఇచ్చాం. వైసీపీ అధికారంలోకి వచ్చిన వాటిని ప్రక్కనబెట్టి నాలుగేళ్ళ తర్వాత వైసీపీ వాళ్ళు పట్టాలిచ్చారు. గంగవరం నిర్వాసితుల సమస్య పరిష్కరించకపోవడతో బాధితులు రోజూ ఆందోళన చేస్తున్నారని అన్నారు.

ఈ కార్యక్రమంలో అనకాపల్లి అధ్యక్షులు బుద్ధ నాగ జగదీశ్వరరావు,ఎమ్మెల్సీ దువ్వారపు రామారావు,ఎమ్మెల్సీ శ్రీ వేపాడ చిరంజీవి రావు, దక్షిణ నియోజవర్గం ఇంచార్జ్ గండి బాబ్జి, అనకాపల్లి నియోజవర్గం ఇంచార్జ్ పీల గోవింద సత్యనారాయణ,ఎస్ కోట నియోజవర్గం ఇంచార్జ్ కోళ్ల లలిత కుమారి, మాడుగుల నియోజవర్గం ఇంచార్జి పీ వీ జి కుమార్, యలమంచిలి నియోజవర్గం ఇంచార్జ్ ప్రగాఢ నాగేశ్వరావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎండీ నజీర్. జీవీఎంసీ ఫ్లోర్ లీడర్ పీల శ్రీనివాసరావు, రాష్ట్ర కమిటీ నాయకులు బొండా జగన్ ,కార్పొరేటర్ల గంధం శ్రీనివాసరావు, పళ్ళ శ్రీనివాస్, గొలిగని వీరరావ్ బుజ్జి,మొల్లి ముత్యాలు, రావు,ప్రసాదుల శ్రీనివాసరావు,రాజమండ్రి నారాయణ, సేనాపతి శంకర్రావు, పులి రమణారెడ్డి, మదం శెట్టి నీలా లబాబు, తోట రత్నం, తదితరులు పాల్గొన్నారు.

జోన్-2 పరిధిలో :
తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు పట్టణం నుండి పెరవలి మండలం ముక్కామల, ఖండవల్లి, అన్నవరప్పాడుల మీదుగా పెరవలి వరకూ యాత్ర సాగింది. ముక్కామల గ్రామంలో రచ్చబండ నిర్వహించి ప్రజా సమస్యలపై నేతలు చర్చించారు. ఈ సందర్భంగా నిడదవోలు నియోజకవర్గ టిడిపి ఇంఛార్జి బూరుగుపల్లి శేషారావు అధ్యక్షతన జరిగిన సభలో టిడిపి పొలిట్ బ్యూరో సభ్యులు, మాజీ మంత్రి పితాని సత్యనారాయణ మాట్లాడుతూ వైసీపీ పాలనలో వేధింపులే ఆయుధంగా అందరినీ వేధిస్తున్నారని అన్నారు. మీడియా స్వేచ్ఛకు సంకెళ్ళు వేస్తున్నారని, చివరికి ఈనాడు రామోజీరావుపై కూడా అక్రమ కేసులు పెట్టి జగన్ ప్రభుత్వం వేధిస్తుందన్నారు.

రాజధాని లేని రాష్ట్రం ఈ దేశంలో ఏదైనా ఉందంటే అది ఆంధ్రప్రదేశ్ అని చెప్పారు. 2014లో రాష్ట్ర విభజన జరిగినపుడు చంద్రబాబు వంటి అనుభవశాలి అవసరమని టిడిపికి ప్రజలు అధికారం ఇచ్చారని గుర్తు చేశారు. గత ఎన్నికలలో ఒక్క ఛాన్స్ అని ప్రజల్ని మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన జగన్ రెడ్డి ఈ నాలుగేళ్లలో ఏపీని సర్వనాశనం చేశాడని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

తిరిగి రాష్ట్రాన్ని బాగు చేసుకోవాలంటే చంద్రబాబు పాలన రావాలని ప్రజలు ఎదురు చూస్తున్నారని ఆయన అన్నారు. రాష్ట్రంలో ఇసుక, మద్యం మాఫియాలు రాజ్యమేలుతున్నాయని ఆయన ధ్వజమెత్తారు. ఇటువంటి తరుణంలో చంద్రబాబు ప్రవేశపెట్టిన మినీ మేనిఫెస్టోను ఇంటింటికీ తీసుకువెళ్ళి ప్రజలకు వివరించాలని పితాని పిలుపునిచ్చారు.

టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి, పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ పేదలకు, పెత్తందార్లకు మధ్య యుద్ధం జరుగుతుందని జగన్ చెప్పడాన్ని ఎద్దేవా చేశారు. దేశంలోనే అత్యంత ధనవంతుడైన ముఖ్యమంత్రి జగన్ రెడ్డి అని ఆయన ఆరోపించారు. ఇది చూస్తేనే పెత్తందారు ఎవరో స్పష్టమవుతుందన్నారు. తాడేపల్లి ప్యాలెస్, ఇడుపులపాయ ఎస్టేట్, హైదరాబాద్ లోటస్ పాండ్, బెంగళూరు ఎలహంక ప్యాలెస్ లున్న జగన్ పేదవాడా అని ఆయన ప్రశ్నించారు.

జగన్ దోచుకుని దాచుకున్న సొమ్మంతా ఇడుపులపాయ నేలమాళిగల్లో దాగి ఉందని ఆయన చెప్పారు. టిడిపి అధికారంలోకి వచ్చాక ఆ నేలమాళిగలు బద్దలు కొట్టి పేదలకు సంక్షేమం పంచుతామని చెప్పారు. టిడిపి సారధ్యంలోనే బాలయోగి లోకసభ స్పీకర్ అయ్యారని, ప్రతిభాభారతి శాసనసభ స్పీకర్ అయ్యారని గుర్తు చేశారు. దళితులను చంపి డోర్ డెలివరీ చేస్తున్న దండుకు నాయకత్వం వహిస్తున్న జగన్ రెడ్డికి దళితుల పేరెత్తే అర్హత లేదన్నారు.

దళిత ద్రోహి జగన్ రెడ్డి అని ఆయన మండిపడ్డారు. బిసిలకు స్థానిక సంస్థల ఎన్నికలలో టిడిపి 33 శాతం రిజర్వేషన్లు కల్పిస్తే జగన్ పాలనలో అది 24 శాతానికి వచ్చిందన్నారు. దీనివల్ల 16 వేల మంది బిసిలు స్థానిక సంస్థల పదవులు కోల్పోయారని మండిపడ్డారు. ఈ నాలుగేళ్లలో సంక్షేమ పథకాలకు 2 లక్షల కోట్ల రూపాయలు బటన్ నొక్కి పంచానని జగన్ చెబుతున్నారని, మరి కేంద్రం నుండి ఎస్సీ, బిసిల కోసం కేంద్రం నుండి 9 లక్షల కోట్లు వచ్చాయని, ఇందులో 7 లక్షల కోట్లు ఎక్కడికి పోయాయని నిలదీశారు.

రాజమండ్రి టిడిపి పార్లమెంట్ అధ్యక్షులు, మాజీ మంత్రి కెఎస్ జవహర్ మాట్లాడుతూ రాష్ట్రంలో జగన్ పాలనలో అరాచకాలను వివరించారు. దళితులు నా మేనమామలు అని చెప్పిన జగన్ ఆ దళితులనే దోచుకుంటున్నారని మండిపడ్డారు. ఐదుగురు దళితులకు జగన్ మంత్రి పదవులిచ్చారని అందరూ ఆనందపడితే ఒక్క మంత్రి కూడా దళితుల సంక్షేమం గురించి పట్టించుకోవడం లేదన్నారు. దళితులకు సంబంధించిన 27 పథకాలను జగన్ రద్దు చేస్తే ఒక్క దళిత మంత్రీ నోరు మెదపలేదని మండిపడ్డారు.

టిడిపి రాష్ట్ర ఉపాధ్యక్షులు, మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు మాట్లాడుతూ రాష్ట్రంలో జగనాసుర పాలనను అంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ రాక్షసుడి పాలనలో ప్రజల ప్రాణాలకు రక్షణ కరువైందన్నారు. వైసీపీ పాలనకు చరమగీతం పాడేందుకు చంద్రబాబు, లోకేష్ సాగిస్తున్న పోరాటానికి పసుపు సైన్యం అండగా నిలిచి పోరాడడం అభినందనీయమని అన్నారు.

ఏలూరు జిల్లా టిడిపి అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు మాట్లాడుతూ టిడిపి మినీ మేనిఫెస్టోతో వైసీపీ గుండెల్లో రైళ్ళు పరుగెడుతున్నాయన్నారు. ఈ మినీ మేనిఫెస్టోను ఇంటింటికీ తీసుకువెళ్ళి ప్రజలకు వివరించి చంద్రన్నను సిఎం చేసుకుందామని ఆయన పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో పశ్చిమ గోదావరి జిల్లా టిడిపి అధ్యక్షురాలు తోట సీతారామలక్ష్మి, మాజీ ఎమ్మెల్యేలు ఆరిమిల్లి రాధాకృష్ణ, పెందుర్తి వెంకటేష్, టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, గోపాలపురం ఇంఛార్జి మద్దిపాటి వెంకటరాజు, టిడిపి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శులు ఆదిరెడ్డి శ్రీనివాస్, శిష్ట్లా లోహిత్, బొడ్డు వెంకటరమణ చౌదరి, డొక్కా నాథ్ బాబు, డిసిఎంఎస్ మాజీ ఛైర్మన్ భూపతిరాజు రవివర్మ, టిడిపి జోన్-2 మీడియా కో ఆర్డినేటర్ బోళ్ళ సతీష్ బాబు, తెలుగురైతు పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షులు పాతూరి రామప్రసాద్ చౌదరి, నిడదవోలు నియోజకవర్గ టిడిపి నాయకులు జజ్జవరపు భాస్కరరావు, కొమ్మిన వెంకటేశ్వరరావు, వెలగల సూర్యారావు, బొడ్డు రాజు, బైపే రాజేశ్వరరావు, దుద్దుపూడి బ్రహ్మం, నల్లాకుల వెంకటేశ్వర రావు, తెలుగుమహిళ నాయకులు నల్లూరి పుష్పావతి, యాకా లక్ష్మి, ఫాతిమా, దేవి తదితరులు పాల్గొన్నారు.

జోన్ -3 పరిధిలో :
మాచర్ల నియోజకవర్గ ఇంచార్జి జూలకంటి బ్రహ్మానంద రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన బస్సు యాత్ర కు వేలాది మంది కార్యకర్తలు ఎదురెళ్లి ఘనంగా స్వాగతం పలికారు. కారంపూడి మండలం పేటసన్నేగండ్ల గ్రామం నుంచి బస్సుయాత్ర ఉదయం 11 గంటలకు 1500 మందితో ప్రారంభం అయిన కార్యక్రమం సాయంత్రం 8 గంటల వరకు దాదాపు 50 కిలో మీటర్లు భారీ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ ముగిసేసరికి దాదాపు ర్యాలీలో సుమారు 3000 మంది కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. అమ్మవారి దేవాలయంలో పూజలు నిర్వహించి యాత్ర ప్రారంభించారు.

అనంతరం అడిగొప్పల సమీపంలో ఉన్న గ్రామంలో వైసిపి నాయకులు చేస్తున్న అక్రమ మైనింగ్ ను సందర్శించారు. గత టిడిపి హయాంలో నిర్మించిన మార్కెట్ యార్డ్ ను సందర్శించారు. రాత్రి దుర్గి మండలం దుర్గి గ్రామంలో నిర్వహించిన రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు. బస్సు యాత్ర సందర్భంగా మాచర్ల నియోజకవర్గంలో టిడిపి నాయకులు, కార్యకర్తల కు నూతన ఉత్సాహం నెలకొల్పటం మరియు వారికి రాష్ట్ర నాయకులు ఇచ్చిన సందేశం తో కార్యకర్తలకు ఒక ధైర్యాన్ని ఇచ్చారు. అదేవిధంగా అధికార పార్టీ ఎమ్మెల్యే చేసే అరాచకాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లారు.

ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు జీవి ఆంజనేయులు, ప్రత్తిపాటి పుల్లారావు, కన్నా లక్ష్మీ నారాయణ, ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, యరపతినేని శ్రీనివాసరావు, కొమ్మాలపాటి శ్రీధర్, పోలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య, మొహమ్మద్ నజీర్, రాష్ట్ర నాయకులు గుంటుపల్లి నాగేశ్వరరావు, గోనుగుంట్ల కోటేశ్వరరావు, దారు నాయక్, నాల్లపాటి రాము, కనుమూరి బాజీ, మానుకోండ శివప్రసాద్ , తాల్ల వెంకటేష్ యాదవ్, గుంటూరు జిల్లా తెలుగు యువత అధ్యక్షులు రావిపాటి సాయికృష్ణ, నరసరావుపేట తెలుగు యువత అధ్యక్షులు కుమ్మేత కోటి రెడ్డి, టి.ఎన్.ఎస్.ఎఫ్ అధ్యక్షులు కూరపాటి హనుమంతరావు, ఎస్సీ సెల్ అధ్యక్షులు సాతులురి కుమార్, బిసి సెల్ అధ్యక్షులు మున్నా రాంబాబు, రాష్ట్ర తెలుగు యువత నాయకులు కుర్రి శివారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

జోన్ – 4 పరిధిలో

కావలి నియోజకవర్గ టీడీపీ ఇంచార్జ్ మాలేపాటి సుబ్బానాయుడు ఆధ్వర్యంలో యాత్ర నిర్వహించారు. ముందుగా కావలి పట్టణ ట్రంకు రోడ్డులోని స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి విగ్రహానికి గజమాలలు వేసి ఘనమైన నివాళి అర్పించారు. అనంతరం కావలి పట్టణ పెద్దపావని రోడ్డులోని రైల్వే ట్రాక్ పైన నిలిచిపోయిన బ్రిడ్జి నిర్మాణాన్ని పరిశీలించి నేతలు సెల్ఫీ దిగి జగన్ కి సవాల్ విసిరారు. మద్దూరుపాడు 1వ వార్డు నందు గత తెలుగుదేశం ప్రభుత్వంలో నిర్మించబడినటువంటి టిడ్కో గృహాల వద్ద టీడీపీ నేతలు సెల్ఫీ దిగారు. సాయంత్రానికి యాత్ర కావలి రూరల్ మండలం, అన్నగారిపాలెం పంచాయితీ, ఒట్టురు గ్రామం పొట్టమ్మ దేవస్థానం వద్దకు చేరుకుంది. ఈ సందర్భంగా దేవాలయంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

జోన్ 5 పరిధిలో:
అనంతపురం పార్లమెంట్ పరిధిలో మొదటి రోజు బస్సు యాత్ర నియోజకవర్గ ఇంచార్జీ ఆధ్వర్యంలో ఉదయం 11.30 గంటలకు శీగలపల్లి గ్రామం నుంచి ప్రారంభించారు. అనంతరం టీడీపీ నేతలు మధ్యాహ్నం మహిళలతో సమావేశం నిర్వహించారు. అనంతరం కండుర్పి పట్టణం నందు డా.బి.ఆర్.అంబెద్కర్ విగ్రహానికి పూలమాల వేసిన అనంతరం స్థానిక మహిళలు, రైతులతో సమావేశం నిర్వహించారు. అనంతరం చెరువుకట్టా దగ్గర బహిరంగ సభ 1500 మంది సభలో పాల్గొనడం జరిగింది.

ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఇంచార్జి ఎం.ఉమా మహేశ్వర నాయుడు, పార్లమెంట్ పార్టీ అధ్యక్షులు కాలవ శ్రీనివాసులు (అనంతపురం), బి.కె.పార్థసారథి (హిందూపురం) మాజి మంత్రులు పరిటాల సునీత, పల్లె రఘునాథ రెడ్డి, ఉరవకొండ ఎం.ఎల్.ఏ పయ్యావుల కేశవ్, ఎం.ఎల్.సి బి.టి.నాయుడు, ఆలం నరసా నాయుడు, ఎం.కేశవ రెడ్డి, మాజి గ్రంధాలయ చైర్మన్ జె.గౌస్ మోద్దిన్, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కె.రామ మోహన్, మాజి మేయర్ స్వరూప, కళ్యాణదుర్గం మాజి ఎం.ఎల్.ఏ వి.హనుమంతరాయ చౌదరి, రాష్త్ర కార్యదర్శి జి.వెంకట శివుదు యాదవ్ గార్లతో పాటు క్లస్టర్ ఇంచార్జీలు, యొనిట్ ఇంచార్జిలు, ముఖ్య నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

LEAVE A RESPONSE