– టీడీపీ ఏటా 16 లక్షల మంది విద్యార్ధులకు ఫీజ్ రీయంబర్స్ మెంట్ అందిస్తే
జగన్ రెడ్డి కేవలం 10 లక్షల మందికి అదీ విడతల వారీగా అందిస్తుంది
– 2020-21లో 1 విడత, 2022-23లో 2 విడతలు, మొత్తం 3 విడతలు ఎగనామం
– 4 ఏళ్లల్లో విద్యా దీవెన, వసతి దీవెన ద్వారా రూ.4,500 కోట్లు విద్యార్ధులకు బకాయిలు
– కొండేపి శాసనసభ్యులు డోలా బాలవీరాంజనేయస్వామి
ఫీజు రీయింబర్స్మెంట్ మీద గొప్పలు చెప్పి తల్లిదండ్రులతో అప్పులు చేయిస్తూ విద్యార్థులను ముప్పు తిప్పలు పెట్టిస్తున్నారు. 4 ఏళ్లల్లో 3విడతల ఫీజ్ రీయంబర్స్ మెంట్, 4 విడతల వసతి దీవెన పెండింగ్ లో పెట్టడంతో చదువులు పూర్తి అయిన దాదాపు 2 లక్షల మందికి పైగా విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వడం లేదు. దీంతో ఉన్నత విద్యను అభ్యసించే అవకాశం లేక, ఉద్యోగావకాశాలు చేసుకునే వీలులేక విద్యార్థులు రోడ్డున పడుతున్నారు.
ఏడాదికి 4 విడతలుగా అమలు చేస్తున్న విద్యా దీవెన 2023-24వ ఏడాదికి మాత్రం 2 విడతలతోనే సరిపుచ్చారు. క్రమం తప్పకుండా ఏ త్రైమాసికం ఫీజు ఆ త్రైమాసికం అయిన వెంటనే చెల్లిస్తూన్నామంటూ తప్పుడు ప్రకటనలు, అబద్దపు ప్రచారం పత్రికాల ప్రకటనల ద్వారా చేస్తున్నారు. 2021-22లో 1 విడత, 2022-23లో 2 విడతలు అమలు చేయలేదు.
అంటే విద్యా దీవెన కింద 3 క్వార్టర్లకుగాను రూ.2,100 కోట్లు, వసతి దీవెన కింద 4 క్వార్టర్లకు గాను రూ.2,400 కోట్లు మొత్తం రూ.4,500 కోట్లు విద్యార్ధులకు బకాయిలు పెట్టారు. ఇప్పటి వరకు ప్రభుత్వ లెక్కల ప్రకారం విద్యా దీవెనకు రూ.10,636.37 కోట్లు ఖర్చు చేశామని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. బకాయిలు రూ.4,500 కోట్లు పోను వాస్తవ లెక్కల ప్రకారం రూ.6,136.37 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారు. సకాలంలో జగన్ రెడ్డి ఫీజులు కట్టకపోవడంతో విద్యార్ధులకు యాజమాన్యాలు నోటీసులు పంపిస్తున్నారు.
ప్రైవేట్, ఎయిడెడ్, అన్ఎయిడెడ్ కళాశాలల్లో చదివే పీజీ విద్యార్థులకు 2020-21 విద్యా సంవత్సరం నుంచి విద్యాదీవెన, వసతి దీవెనలు నిలిపివేస్తూ జీవో నెం. 77ను విడుదల చేశారు. దీనితో 1.7 లక్షల మంది చదివే పీజీ విద్యార్ధుల్లో 80 శాతం మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటి విద్యార్ధులకు ఉన్నత చదువులను దూరం చేశారు.
విద్యా వ్యవస్థలో ప్రథమ స్థాయిలో ఉండాల్సిన రాష్ట్రాన్ని అథమ స్థాయికి నెట్టేశారు. రాష్ట్రంలో నాణ్యమైన విద్య లోపించడంతో విద్యార్ధులు పక్క రాష్ట్రాలకు వెళ్లిపోతున్నారు. దాదాపు 70వేల మంది ఏపీ విద్యార్ధులు తెలంగాణలో ఎంసెట్ రాయడం జగన్ రెడ్డికి సిగ్గుచేటు. అంతేకాకుండా ఏపీలోనే అత్యల్పంగా పీజులు చదువుతున్నారని ఉన్నత విద్యపై కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ తెలియజేసింది. జగన్ రెడ్ది తన అనాలోచిత, అవగాహనా రాహిత్య నిర్ణయాలతో 4 ఏళ్ల పాలనలో విద్యారంగాన్ని భ్రష్టుపట్టించి విద్యార్దుల భవిష్యత్ ని నాశనం చేశారు.
కొత్త సీసాలో పాత సారాలా పాత పథకాలకు కొత్త పేర్లు పెట్టారు. ప్రతి విడతకు పత్రికా ప్రకటనలు ఇచ్చుకుంటూ సాక్షి పత్రికకు రూ.500 కోట్లు దోచిపెడుతున్నారు.