బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి
రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలకు విధానాల పట్ల రాష్ట్ర ప్రజలు నిరాశ నిస్పృహలకు లోను కాకూడదని ధైర్యంగా ఉండాలని భారతీయ జనతా పార్టీ తెలంగాణ ప్రజలను కోరుతున్నది. ఆత్మహత్యలు సమస్యకు పరిష్కారం కావని గుర్తించాలి. ఆత్మహత్యతో ఆ కుటుంబంలోని మిగతా సభ్యులందరూ జీవితకాలం బాధపడుతూ ఉంటారని విషయాన్ని గుర్తించుకోవాలి.
రంగు సోని కుటుంబ సభ్యులను వరంగల్ జిల్లా అధ్యక్షులు కొండేటి శ్రీధర్ బిజెపి బృందం పరామర్శించింది. ఫోన్లో బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ పరామర్శించారు. ధైర్యంగా ఉండాలని వారి కుటుంబ సభ్యులను కోరారు. భారతీయ జనతా పార్టీ రేపు సాయంత్రం అన్ని జిల్లా కేంద్రాలలో కొవ్వొత్తుల (క్యాండిల్ లైట్)ర్యాలీలను నిర్వహించాలని బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బిజెపి కార్యకర్తలు నాయకులు తో పాటు ప్రజలు కూడా పెద్ద ఎత్తున పాల్గొని నిరసన తెలియజేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం. రాబోయేది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం దీనికి తెలంగాణ ప్రజలు ఎవరు ఆత్మహత్య చేసుకోకూడదని విజ్ఞప్తి చేస్తున్నాం.
రంగు సోని ఆత్మహత్య తీవ్ర బాధాకరమైన విషయం అందరిని మనోవేదనకు గురిచేసిందని బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ పేర్కొన్నారు. కుటుంబ సభ్యులు ధైర్యంతో ఉండాలని భగవంతుడు వారికి శక్తి నివ్వాలని కోరుకుంటున్నాం . వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం సానుభూతి తెలియజేస్తూ ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తున్నాం.