• అమరావతిపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై వక్రభాష్యాలు చెప్పడం జగన్ రెడ్డి అండ్ కో కే చెల్లింది
• రాజధానిభూముల్ని ఇతరులకు ధారాదత్తం చేయడం, తనఖాపెట్టే అధికారం ప్రభుత్వానికి లేదని సుప్రీం తేల్చేసింది
• కోర్టుల్ని మేనేజ్ చేయగలమన్న వైసీపీనేతల ప్రయత్నాలకు సుప్రీంకోర్టు అడ్డుకట్ట వేసింది
• తనప్రభుత్వ విద్వేషాలకు ప్రజలు ఆహుతవుతుంటే, ఆమంటల్లో జగన్ రెడ్డి చలికాచుకుంటున్నాడు
• రాజధానిపై సుప్రీంకోర్టు స్పష్టమైన తీర్పుఇచ్చినా జగన్ రెడ్డి & కో రెండునాల్కల ధోరణి వీడటంలేదు.
• అమరావతి, పోలవరం నిర్మాణాలపై విషప్రచారంతో ప్రజలమధ్య ఆరనిజ్వాలలురేపి, పబ్బంగడుపుకోవాలన్నదే జగన్ రెడ్డి ప్రభుత్వ ధ్యేయం
– మాజీ శాసనసభ్యులు ధూళిపాళ్ల నరేంద్ర కుమార్
అమరావతికి భూములిచ్చిన రైతులపక్షానే న్యాయం, ధర్మంనిలిచాయని, అధికారమదంతో వారిని రోడ్డున పడేసి, చిత్రహింసలకుగురిచేస్తూ, పైశాచికానందం పొందుతున్న జగన్ రెడ్డి ప్రభుత్వాన్ని, రెండునాల్కలధోరణితో నీతిమాలిన రాజకీయాలుచేస్తున్న వైసీపీనేతల్ని సుప్రీంకోర్టు తీర్పు కట్టడిచేసిందని, టీడీపీ సీనియర్ నేత, మాజీశాసనసభ్యుల ధూళిపాళ్ల నరేంద్రకుమార్ స్పష్టంచేశారు. మంగళగిరిలోని పార్టీజాతీయ కార్యాలయంలో ఆయన మంగళవారం విలేకరులతో మాట్లాడా రు. ఆ వివరాలు ఆయనమాటల్లోనే …
సుప్రీంకోర్టు తీర్పు, జగన్ రెడ్డి వైసీపీనేతల ఆశలపై నీళ్లుచల్లింది…
“మూడున్నరేళ్లపాలనలో రాజధానినిర్మాణానికి జగన్ రెడ్డి చిల్లిగవ్వకూడా ఇవ్వలేదు. అ అధికారంలోకి వచ్చీరాగానే జగన్ రెడ్డి ప్రభుత్వం, రాష్ట్రాభివృద్ధికి అతికీలకమైన అమరావతి, పోలవరం నిర్మాణాలను వివాదాల్లోకి నెట్టింది. సాఫీగాసాగుతున్న అమరావతి నిర్మాణ పనుల్ని గందరగోళంలోకి నెట్టి, ప్రజలమధ్య విద్వేషాలురాజేసి, జగన్ రెడ్డి చలికాచు కుంటున్నాడు. దేశంలో రాజధాని లేని రాష్ట్రంగా ఏపీని నిలిపినఘనత జగన్ రెడ్డికే దక్కింది. రాజధాని మార్పుకు సంబంధించి ప్రభుత్వంచేసిన చట్టాన్ని హైకోర్టు కొట్టేస్తే, దానిపై చేయాల్సినంత కాలయాపనచేశాక తీరుబడిగా జగన్ సర్కారు హైకోర్టుని ఆశ్రయించింది.
అమరావతిపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై వక్రభాష్యాలు చెప్పడం జగన్ రెడ్డి అండ్ కో కే చెల్లింది. కోర్టుల్ని మేనేజ్ చేయగలమన్న వైసీపీనేతల ప్రయత్నాలకు సుప్రీంకోర్టు అడ్డుకట్ట వేసింది. 1వ తేదీన రాజధానిపై సుప్రీంకోర్టులో తమకు అనుకూలంగా తీర్పువస్తుందన్న అత్యుత్సాహంతో ముందేసంబరాలకు సిద్ధమైన వైసీపీనేతల ఆశలపై అత్యున్నత న్యాయస్థానం తీర్పు నీళ్లుచల్లింది. సుప్రీంతీర్పుతోనైనా అమరావతికి సంబంధించి మంత్రు లు, వైసీపీనేతలు వక్రభాష్యాలు చెప్పకుండా వాస్తవాలు మాట్లాడాలని సూచిస్తున్నాం.
రాజధాని భూముల్ని ధారాదత్తం చేయడం, తనఖాపెట్టే అధికారం జగన్ రెడ్డిప్రభుత్వానికి లేదని సుప్రీం స్పష్టం చేసింది
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాన్ని మార్చే అధికారం, హక్కు ఏపీ ప్రభుత్వానికి లేదన్న హైకోర్ట్ వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు స్టే విధించలేదని వైసీపీ నేతలు గ్రహించాలి. రాజధాని నిర్మాణానికి రైతులిచ్చిన భూముల్ని ఇతరులకు ధారాధత్తం చేసి, తనఖాపెట్టే అధికారం కూడా ఏపీ ప్రభుత్వానికి లేదని సుప్రీం తేల్చింది. ప్రజలకు తప్పుడు సంకేతాలు పంపేందుకు ప్రభుత్వం, వైసీపీ నేతలు ప్రయత్నిస్తున్నారు. రాజధానిపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై వైసీపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు అర్థరహితం, అసంబద్ధమైనవి. ప్రభుత్వం తీసేసిన తహసీల్దార్ సజ్జల టీడీపీకి మొట్టికాయని, అంబటి రాంబాబు వికేంద్రీకరణకు మద్ధతని, మూడురాజధానులపై ముందుకెళ్తామని బొత్స అనడం సిగ్గుచేటు.
సుప్రీం కోర్టులో వాదనలు పూర్తికాకుండానే వారికి అనుకూలంగా కావాలనే విషప్రచారానికి పాల్పడ్డా రు. ప్రభుత్వంలోని వారేసుప్రీంకోర్టు తీర్పుకి వక్రభాష్యాలుచెప్పడం ప్రజల్ని తప్పుదోవ పట్టించడమే. రాజధాని మార్పును సమర్థిస్తున్నట్లు సుప్రీంకోర్టు ఎక్కడా చెప్పలేదు. అమరావతిలోనే హైకోర్ట్ కొనసాగుతుందని ప్రభుత్వ న్యాయవాదులే స్పష్టంగా సుప్రీంకోర్టుకి చెప్పారు. అత్యున్నత న్యాయస్థానం న్యాయమూర్తులు, ఇరుపక్షాల న్యాయవాదుల్ని ప్రశ్నించిన విధానం, వారు చెప్పిన సమాధానాలపై ప్రభుత్వపెద్దలు ఆలోచించుకోవాలి. సహజన్యాయం, సామాజికధర్మం, రాజ్యాంగపరమైన హక్కులు భూములిచ్చిన రైతులకే ఉన్నాయని సుప్రీంచెప్పడం నిర్వివాదాంశం.
ముఖ్యమంత్రి ఎక్కడున్నా ప్రజలకు ఒరిగేదేంలేదు….
ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి విశాఖలో కూర్చున్నా, ఇడుపులపాయంలో కూర్చున్నా రాష్ట్రానికి, ప్రజలకు ఒరిగేదేంలేదు. ఇప్పుడు తాడేపల్లి ప్యాలెస్ లో ఉండి ఆయన చేస్తున్న పాలన ప్రజలకు ఎంతగా ఉపయోగపడుతోందే చూస్తున్నాం కదా! భూములిచ్చిన రైతుల త్యాగాలు, వారుపడుతున్నబాధలు వైసీపీప్రభుత్వాన్ని శిక్షించే తీరుతాయి. పోలీస్ బలంతో, అధికారమదంతో ప్రభుత్వం రాజధాని రైతులపై అరాచకానికి పాల్పడుతోంది. ప్రాంతాలకు అతీతంగా పరిపాలన చేయాల్సిన ప్రభుత్వమే ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టడం దురదృ ష్టకరమేకాదు, నీచాతినీచంకూడా.
కర్నూల్లో చంద్రబాబుని అడ్డుకుంది ప్రభుత్వప్రేరేపిత ఉగ్రవాదమే…
మేథావుల ముసుగులో కొందరుఅల్లరిమూకలు కర్నూల్లో చంద్రబాబుని అడ్డుకోవడం ప్రభుత్వప్రేరేపిత ఉగ్రవాదమే. ఊసరవెల్లికంటే దారుణంగా రంగులుమారుస్తూ, ప్రజల్ని రెచ్చగొట్టేలా నీతిమాలిన చర్యలకు పాల్పడుతున్న జగన్ రెడ్డి, అండ్ కో తక్షణమే రాష్ట్రప్రజానీకానికి క్షమాపణచెప్పాలని డిమాండ్ చేస్తున్నాం. న్యాయస్థానాల్లో ప్రభుత్వ న్యాయవాదులవ్యాఖ్యలకు, ప్రజలమధ్య ప్రభుత్వంచేస్తున్న వ్యాఖ్యలకు ఏమాత్రం పొంతన ఉండటంలేదు. న్యాయమూర్తులముందు ఒకటిచెప్పడం, బయటకు వచ్చాక మరోటి మాట్లా డటం, వారేమిచెప్పారనే ఇంగితంలేకుండా ప్రభుత్వం వ్యవహరించడం చూస్తున్నాం. రాయలసీమ ప్రాంతంలో ప్రభుత్వంతరుపున వకాల్తా పుచ్చుకొని హైకోర్టు ఏర్పాటుపేరుతో రాజకీయాలు చేసిన మేథావులు సుప్రీంకోర్టు తీర్పుపై ఏమని సమాధానంచెబుతారు?
జగన్ రెడ్డి తండ్రిబాటలో నడుస్తూ, పదవికోసం ప్రజలమధ్య విద్వేషాలు రేపుతున్నాడు
ఉమ్మడి రాష్ట్రంలో గతంలో కొందరు నేతలు పదవులకోసం చేయకూడని దుర్మార్గాలు చేశారు. మర్రి చెన్నారెడ్డి హయాంలో హైదరాబాద్ లో మతకల్లోలాలు రేపడం, టీడీపీ ప్రభుత్వంలో రాయలసీమ ఉద్యమాలు చేయడాన్ని చూశాం. రాజశేఖర్ రెడ్డి ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి తెరలేపింది తన స్వార్థం కోసం కాదా? ఆయన వారసుడైన జగన్ రెడ్డి , గతంలో జరిగిన వాటిని మించి, ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతూ…. ఆ చలిమంటల్లో చలికాచుకుంటున్నాడు. జగన్ రెడ్డి సాగిస్తున్న దుర్మార్గ, దురాగత రాజకీయాల్ని ప్రజలు అంతంచేసే రోజు దగ్గర్లోనే ఉంది.
రాజధాని ప్రాంతంలోని బడుగు, బలహీనవర్గాలకు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వని ప్రభుత్వం, కోర్టుల్లో కేసులవాదనలకు మాత్రం న్యాయవాదులకు లక్షలకోట్లు దుర్వినియోగం చేస్తోంది. వైసీపీప్రభుత్వం అధికారంలోకి వచ్చిందిమొదలు అమరావతిపై విషం చిమ్ముతూనేఉంది. కులాలు, మతాలు, ప్రాంతాలమధ్య చిచ్చుపెట్టడానికి చేయని ప్రయత్నంలేదు. ప్రతిపక్షనేతగా ఉండి రాజధానిపై జగన్ రెడ్డి చేసిన ఆరోపణలను, ఆయన ముఖ్యమంత్రి అయ్యాక నిరూపించలేక భంగపడ్డాడు. అమరావతికి భూములిచ్చిన రైతుల్ని వారు నమ్ముకున్న న్యాయం,ధర్మమే కాపాడుతుంది” అని నరేంద్రకుమార్ తెలిపారు.