– పవన్ గారే మాకు దిక్కు
– మెడకు ఉరితాడు బిగించుకుని గిరిజనుల విషాద నిరసన
బొబ్బిలి: తమ గ్రామాలను నిర్లక్ష్యం చేస్తున్న పాలకుల నిర్లక్ష్యంపై గిరిజనులు వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. బొబ్బిలి (ఎం) గోపాలనాయుడుపేట పంచాయితీ పరిథిలోని ఐదు పంచాయితీ గ్రామాలకు.. కొన్ని దశాబ్దాల నుంచి కనీస సదుపాయాలు లేక గిరిజనులు అల్లాడిపోతున్నారు. జిల్లా కలెక్టర్, ఆర్డీఓ, ఎమ్మార్వో, ఎమ్మెల్యే, ఎంపీలకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ఫలితం సున్నా. దానితో వారు కర్రలతో పందిరళ్లను ఏర్పాటుచేసుకుని.. వాటికి అమర్చిన ఉరితాళ్లను మెడకు బిగించుకుని నిరసన వ్యక్తం చేశారు. ‘‘మమ్మల్ని ఎవరూ పట్టించుకోవడం లేదు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అయినా మా సమస్యలు తీర్చాలి. ఇప్పుడిక ఆయనే మాకు గతి. ఇది చివరి ప్రయత్నంగా చేస్తున్న నిరసన. అయినా ప్రభుత్వం దిగిరాకపోతే మాకు నిజంగా ఉరే గతి’’ అని గిరిజనులు మీడియాకు చెప్పారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్మీడియాలో వైరల్ అవుతోంది.