– ఏపీ పోలీసుల తీరును ఆక్షేపిస్తూ హైకోర్టులో టీవీ 5 ఛైర్మన్ బీఆర్ నాయుడు పిటిషన్
– దిగువ స్థాయి జడ్జిలు విచక్షణతో నిర్ణయం తీసుకోవాలి
– మెజిస్ట్రేట్లపై శాఖాపరమైన చర్యలన్న హైకోర్టు
– టీవీ5 ఛైర్మన్ బీఆర్ నాయుడు పిటిషన్‍పై తీర్పిచ్చిన ధర్మాసనం
ఎఫ్ ఐ ఆర్ వివరాలను వెల్లడించకుండా అరెస్టులు, రిమాండ్‍లు జరుగుతున్నాయని పిటిషన్‍లో టీవీ5 ఛైర్మన్ బీఆర్ నాయుడు ఫిర్యాదు చేశారు. దీనిపై హైకోర్టు సంచలన వ్యాఖ్యలు, ఆదేశాలు జారీ చేసింది.
బీఆర్ నాయుడు దాఖలు చేసిన పిటిషన్‍పై న్యాయవాది ఉమేష్ చంద్రవాదనలు వినిపించారు.167 సీఆర్‍పీసీ ఉల్లంఘనలు జరుగుతున్నాయన్న ఉమేష్‍చంద్ర వాదనలతో హైకోర్టు ఏకీభవించింది.పోలీసుల చర్యలను పరిగణనలోకి తీసుకోకుండానే రిమాండ్ విధించడం హక్కులను భంగపర్చడమే.. అభియోగాల వివరాలు నిందితలను తెలియజేకపోవడం చట్ట ఉల్లంఘనే అవుతుంది.
ఏపీలో ఇష్టారీతిన రిమాండ్‍లు విధించడం కుదరదన్న హైకోర్టు దిగువ స్థాయి జడ్జిలు విచక్షణతో నిర్ణయం తీసుకోవాలి. ఎఫ్‍ఐఆర్ నమోదైన 24 గంటల్లో అప్‍లోడ్ చేయాలని ఆదేశం. ఎలా పడితే అలా కేసులు పెడితే కుదరదని వార్నింగ్.విచక్షణ లేకుండా రిమాండ్‍కు ఆదేశిస్తే, బాధితులు హైకోర్టును ఆశ్రయిస్తే మెజిస్ట్రేట్లపై శాఖాపరమైన చర్యలు తప్పవని హైకోర్టు స్పష్టం చేసింది.