– మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు గారు
శ్రీకాకుళం: స్వా తంత్య్ర దినోత్సవ స్ఫూర్తితో ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి దేశభక్తి చాటుకోవాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలో నిర్వహించిన హర్ ఘర్ తిరంగా యాత్ర ర్యాలీకి ముఖ్య అతిథిగా విచ్చేసి, మాట్లాడారు. సూర్యమహాల్ కూడలి నుంచి ఏడు రోడ్ల కూడలి వరకు జాతీయ జెండాలతో ర్యాలీలో పాల్గొన్నారు. మంత్రి మాట్లాడుతూ దేశభక్తి, జాతీయ సమైక్యత భావాలను ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పాలనే ఉద్దేశ్యంతో ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు ‘హర్ ఘర్ తిరంగా’ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా స్వాతంత్య్ర దినోత్సవం (ఆగస్టు 15) నాడు జిల్లాలో ప్రతి ఇంటిపై మువ్వన్నెల జెండా ఎగురవేసి దేశ సమైక్యతను చాటాలని పిలుపునిచ్చారు.
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు విజన్–2047 సంకల్పానికి అనుగుణంగా ప్రతి ఒక్కరూ దేశం, రాష్ట్ర అభివృద్ధికి కృషి చేయాలని కోరారు. స్వాతంత్య్ర కోసం ప్రాణాలు అర్పించిన అమర వీరుల త్యాగాలను స్మరించుకుంటూ వారికి నివాళులర్పించాల్సిన అవసరాన్ని గుర్తుచేశారు. కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డి, జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, ఎమ్మెల్యే గొండు శంకర్, అసిస్టెంట్ కలెక్టర్ పృథ్వీరాజ్ కుమార్, ఆర్డీవో సాయి ప్రత్యూష పలు కళాశాలల విద్యార్థులు, యువకులు, అధికారులు పాల్గొన్నారు.