– నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్
ధాన్యం కొనుగోలు విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు, టీఆర్ఎస్ ఎంపీలు చెబుతున్నవన్నీ పచ్చి అబద్దాలేనని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ వ్యాఖ్యలతో తేలిపోయింది.
టీఆర్ఎస్ పార్టీని జనం అసహ్యించుకుంటున్నా సీఎం కేసీఆర్ వైఖరిలో మాత్రం మార్పు రాకపోవడం సిగ్గు చేటు.టీఆర్ఎస్ పార్టీయే ఓ అబద్దాల ఫ్యాక్టరీ… ప్రజలను తప్పుదోవ పట్టించడమే కేసీఆర్ పనిగా పెట్టుకున్నారు.
తెలంగాణ నుండి ఎంత ధాన్యం పంపిస్తారనే వివరాలను కూడా ఇంత వరకు కేంద్రానికి పంపకపోవడం దారుణం.ముఖ్యమంత్రి కేసీఆర్ చర్యలు రాష్ట్ర రైతాంగాన్ని నట్టేట ముంచేలా ఉన్నాయి.
కేంద్రానికి ఇవ్వాల్సిన బియ్యం ఏనాడూ సకాలంలో ఇవ్వని చరిత్ర కేసీఆర్ సర్కార్ దే.2019-20 సంవత్సరానికిగాను తెలంగాణ నుండి రావాల్సిన లక్ష మెట్రిక్ బియ్యాన్ని నేటికీ కేంద్రానికి పంపకపోవడం దారుణం.