Suryaa.co.in

Telangana

ప్రజల మైండ్ మార్చే కుట్రలో భాగంగానే టీఆర్ఎస్ నిరసనలు

-శాసనమండలి మాజీ చైర్మన్ స్వామిగౌడ్

రాజ్యాంగాన్ని తిరగరాయాలంటూ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలతో తెలంగాణ సమాజమంతా వ్యతిరేకిస్తూ ఉప్పెనలా విరుచుకుపడుతుంటే… దీనిని దారి మళ్లించేందుకు టీఆర్ఎస్ నిరసనల పేరుతో డ్రామాలాడుతోంది.రాజ్యాంగంలో ఏమైనా అభ్యంతరాలుంటే సవరించే వెసులుబాటు ఉంది.

అయినప్పటికీ రాజ్యాంగాన్నే తిరగరాయాలంటూ కేసీఆర్ చేసిన వ్యాఖ్యల వెనుక పెద్ద కుట్ర దాగి ఉంది.
తెలంగాణ ప్రజల మైండ్ మార్చే కుట్రలో భాగంగానే టీఆర్ఎస్ నిరసనలు చేస్తోంది. పార్లమెంట్ లో తెలంగాణ బిల్లు పెట్టేరోజు కేసీఆర్ సభలో ఎందుకు లేరు? ఆ సమయంలో ఎక్కడున్నరో కేసీఆర్ చెప్పాలి.
అధికార అహంకారానికి కేసీఆర్ తెరలేపారు. ఆకాశమంతా ఎత్తులో ఉన్న బీజేపీపై ఉమ్మేస్తే అది తిరిగి టీఆర్ఎస్ పైనే పడుతుందని గుర్తుంచుకోవాలి. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో నాతోసహా ప్రతి ఒక్కరి క్రుషి ఉంది.

42 రోజుల సకల జనుల సమ్మెలో ప్రజానీకం యావత్తు పాల్గొంది. ఆనాడు తెలంగాణ ఉద్యోగుల సంఘం నాయకుడైన నన్ను చంపేందుకు పోలీసులు నా సున్నిత భాగాలపై దాడి చేశారు. తీవ్రంగా కొట్టారు. నాకు రక్షణగా ఉన్న మహిళలపై అసభ్యంగా ప్రవర్తించారు. దుస్తులు చించేశారు. ఆ దాడిలో నా సున్నిత భాగాలు వాచిపోతే ఉద్యమనాయయులు నన్ను ఆసుపత్రికి తరలించి చికిత్స చేయించారు.

ఆనాడు తెలంగాణ ఉద్యమకారులపై జరుగుతున్న దాడులను యూపీఏ ప్రభుత్వానికి విన్నవించినా పట్టించుకోలేదు. తెలంగాణ ఉద్యమకారులపై జరుగుతున్న దాడిని విని సుష్మాస్వరాజ్ కన్నీళ్లు పెట్టుకున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యేదాకా మీకు అండగా ఉంటూ కొట్లాడతానని హామీ ఇచ్చి మాట నిలుపుకున్న మహానాయకురాలు సుష్మాస్వరాజ్.ఆనాడు ఉద్యమంలో పాల్గొన్న నేతల్లో నేడు టీఆర్ఎస్ లో ఒకరిద్దరు మినహా ఎవరూ లేరు. పార్లమెంట్ లో బిల్లు ప్రవేశపెట్టిన సమయంలో కేసీఆర్ ఓటింగ్ కు ఎందుకు హాజరుకాలేదో సమాధానం చెప్పాలి.

LEAVE A RESPONSE