Suryaa.co.in

Andhra Pradesh

అధికారుల అండతో బాధితుల ఇంటి స్థలాన్ని ఖాళీ చేయించారు

-తల్లీ కొడుకుల ఆత్మహత్యాయత్నంపై డిజిపికి టిడిపి జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు లేఖ
-తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు మండలం, బలభద్రపురం గ్రామంలో తల్లీ కొడుకుల ఆత్మహత్యాయత్నంపై డిజిపికి టిడిపి జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు లేఖ

40 ఏళ్లుగా ఉంటున్న ఇంటి స్థలాన్ని ఖాళీ చేయించడంతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన బాధితులు కోటిపల్లి కామాక్షి, కుమారుడు మురళీకృష్ణ
ఆసుపత్రిలో కిచిత్స పొందతూ తల్లి కామాక్షి మృతి – బాధ్యుతలపై చర్యలు కోరుతూ చంద్రబాబు లేఖ
లేఖలో అంశాలు:-

బలభద్రపురం గ్రామంలోని తోటపేటలో 40 ఏళ్ల నుంచి 2 సెంట్ల స్థలంలో కామాక్షి, ఆమె కుమారుడు మురళీకృష్ణ నివాసం ఉంటున్నారు.నిబంధనల మేరకు ఇంటి పన్ను, కరెంటు బిల్లులు చెల్లిస్తున్నారు.వీరి ఇంటికి పక్కనే ఉన్న 48 సెంట్ల భూమిని వైఎస్‌ఆర్‌సీపీ నేత కిలపర్తి వీర్రాజు ఆక్రమించి లేఅవుట్‌ను ప్రారంభించారు. తన లేఅవుట్‌ కోసం వీర్రాజు స్థానిక అధికారులతో కుట్ర చేసి తల్లి,కొడుకులను వారి భూమి నుండి గెంటేశారు.

వైఎస్‌ఆర్‌సిపి స్థానిక నాయకులు బాదిరెడ్డి అప్పారావు, యామన దుర్గారావు, బాదిరెడ్డి భీమన్న, కిలపర్తి వీర్రాజులు బాధితులు నివసిస్తున్న స్థలాన్ని ఖాళీ చేయకుంటే తీవ్ర పరిణామాలుంటాయని తల్లీకొడుకులను బెదిరించారు.అధికారుల అండతో బాధితుల ఇంటి స్థలాన్ని ఖాళీ చేయించారు. నోటీసు కూడా ఇవ్వకుండా అర్ధరాత్రి వారి భూమిని స్వాధీనం చేసుకున్నారు. నిస్సహాయ స్థితిలో తల్లీకొడుకులు విషం సేవించారు. తమ ఆత్మహత్యకు కారణం ఎవరో సెల్ఫీ వీడియో ద్వారా వివరించారు.

ఈ ఘటనలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కామాక్షి మృతి చెందగా…మురళీ కృష్ణ వైద్యం పొందుతున్నారు. ఘటన జరిగి ఇప్పటికే 15 రోజులు కావస్తున్నా ఇప్పటి వరకు కారకులపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. బాధిత కుటుంబానికి రూ.25 లక్షల నష్టపరిహారం ఇవ్వాలి. కామాక్షి ఆత్మహత్యకు కారణం అయిన దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలి.

LEAVE A RESPONSE