Suryaa.co.in

Andhra Pradesh

దార్శనికుడి ముందుచూపు …కొండవీటివాగు ఎత్తిపోతల!

– యువగళం పాదయాత్ర నుండి నారా లోకేష్

దార్శనిడుకు చంద్రబాబునాయుడు ముందుచూపునకు నిదర్శనం కొండవీటివాగు ఎత్తిపోతల పథకం. రాజధాని ప్రాంతంలో కొండవీటి వాగు ముంపు సమస్య శాశ్వత పరిష్కారానికి మాజీముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రూ.222 కోట్లతో ఈ ఎత్తిపోతల పథకాన్ని నిర్మించారు. రికార్డు సమయంలో కేవలం 18నెలల్లో పూర్తిచేసి 2018 సెప్టెంబర్ 16న రాష్ట్రప్రజలకు అంకితం చేశారు. ఒకేరోజు ఒక టీఎంసీ నీళ్లు వచ్చినా సమర్థవంతంగా వరదను నివారించే విధంగా ఈ ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు. దివాలాకోరు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో ప్రధాన ప్రాజెక్టుల గేట్లకు గ్రీజు పెట్టలేక రైతాంగాన్ని వరదల్లో ముంచెత్తుతున్నాడు.

LEAVE A RESPONSE