నిరుద్యోగుల పక్షాన బీజేపీ పోరాటం ఆగదు
బండి సంజయ్ పై అవాకు ఉన్లు, చవాకులు పేలితే సహించేది లేదు: సంగప్ప
జూనియర్ పంచాయతీ సెక్రటరీ బైరి సోనీ ఆత్మ హత్యకు రాష్ట్ర ప్రభుత్వమే కారణం: : – బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి జేనవాడే సంగప్ప
బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండిసంజయ్ జిల్లా కేంద్రంలో చేపట్టిన నిరుద్యోగ మార్చ్ వేడి కేసీఆర్ ఫాంహౌస్కు తగలడంతో భయపడి బీఆర్ఎస్ నాయకులు బండిసంజయ్ పై అవాకులూ, చవాకులూ పేలుతున్నారని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి జెనవాడే సంగప్ప మండిపడ్డారు. మాజీ ఎమ్మెల్యే విజయపాల్రెడ్డితో కలిసి నారాయణఖేడ్ లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరులతో మాట్లాడారు. ఆందోల్ ఎమ్మెల్యే క్రాంతికిరణ్ తో పాటు కొందరు బీఆరెస్ నాయకులు తమ స్థాయిని మరచి మాట్లాడుతున్నారని విమర్శించారు.
కేసీఆర్ కు బానిసలా నోటిదురుసును ప్రదర్శించడం సరికాదని హితవు పలికారు. బిస్వాల్ కమిషన్ రాష్ట్రంలో 2లక్షల ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పిందని, 1.35 లక్షల ఉద్యోగాలు ఇచ్చామని రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్న లెక్కలు చూపాలని సంగప్ప డిమాండ్ చేశారు. ఔట్సోర్సింగ్ ఉద్యోగాలు లేకుండా చేస్తామని చెప్పి నేడు రాష్ట్ర వ్యాపితంగా అన్ని మండలాల్లో ఉద్యోగులు భత్రల కల్పించాలంటూ దీక్షలకు దిగుతున్నారని పేర్కొన్నారు.
ఉద్యోగాలు ఇవ్వకుండా రాష్ట్రంలోని నిరుద్యోగులకు మోసం చేస్తున్నారని, నిరుద్యోగులు, యువత పక్షాన బీజేపీ పోరాటం సాగిస్తుందని అన్నారు. బండిసంజయ్ పై బీఆర్ఎస్ నాయకులు అవాకులు, చవాకులు పేలడం మరిచి నిరుద్యోగులు, యువతకు ఇచ్చిన హామీ ప్రభుత్వం నెరవేర్చేలా ఒత్తిడి తేవాలని అన్నారు.
టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కారణంగా 30లక్షల మంది నిరుద్యోగులు రోడ్డున పడ్డారని, ఈ అంశంపై సిట్టింగ్ జడ్జీచే విచారణ జరిపించాలని సంగప్ప డిమాండ్ చేశారు. అభ్యర్థులకు లక్ష రూపాయిల చొప్పున పరిహారం అందించాలని అన్నారు. జేపీఎస్ లకు పర్మినెంట్ చేయకుండా ఇబ్బందులకు గురిచేస్తుండడంతో వరంగల్ జిల్లాలో బైరి సోని ఆత్మహత్య చేసుకుందని తెలిపారు.
రాష్ట్రంలో అభివృద్ధి కుంటు పడిందని, కేవలం కేంద్రం నిధులతోనే రాష్ట్రంలో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని తెలిపారు. బస్తీదవాఖాణాలు, ఆస్పత్రుల్లో నేషనల్ హెల్త్ మిషన్ ద్వారా నిధులు కేంద్రం ద్వారానే సమకూరుతున్నాయని తెలిపారు. రాష్ట్రంలో రహదారులు కేంద్రం అభివృద్ధి పరుస్తుందని అన్నారు. నిరుద్యోగులు, యువతను మోసం చేస్తున్న బీఆర్ఎస్ చర్యలను ఎండగడుతూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ తన పోరాటాన్ని ఇంకా ఉధృతం చేస్తాడని సంగప్ప ప్రకటించారు. ఈ సమావేశంలో బీజేపీ నారాయణఖేడ్ నియోజకవర్గ కన్వీనర్ రజినీకాంత్, మారుతిరెడ్డి, సీనియర్ నాయకులు సాయిరాం, రాజుగౌడ్, ప్రవీణ్ గౌడ్, సుధాకర్, సంజీవ్ తదితరులు పాల్గొన్నారు.
జేపీఎస్ సోనీ ఆత్మహత్య కాదు రాష్ట్ర ప్రభుత్వం చేసిన హత్య: బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి జన వాడే సంగప్ప
జూనియర్ పంచాయతీ కార్యదర్శులకు బిజెపి అండగా ఉంటుంది
జూనియర్ పంచాయతీ కార్యదర్శి సోనీ ఆత్మహత్యకు రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి జనవాడే సంగప్ప ఆరోపించారు. సోనిది ఆత్మహత్య కాదు అది ప్రభుత్వ హత్య అని ఆయన విమర్శించారు. మాజీ ఏమ్యేల్యే విజయ్ పాల్ రెడ్డి తో కలిసిసంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ లో జేపిఎస్ ల సమ్మె శిబిరాన్ని సందర్శించారు. వారికి సంగప్ప భరోసా ఇచ్చారు. ఎవరు అధైర్య పడద్దని, బిజెపి పూర్తిగా అండగా ఉంటుందని సంగప్ప చెప్పారు.