Suryaa.co.in

Telangana

కెసిఆర్ మాట్లాడుతున్న తీరు ప్రజాస్వామ్యానికి తూట్లు

ముఖ్యమంత్రి కెసిఆర్ మాట్లాడుతున్న తీరు ప్రజాస్వామ్యానికి తూట్లు పొడిచే విధంగా ఉందని బిజెపి తెలంగాణ కోర్ కమిటీ సభ్యులు మాజీ ఎమ్మెల్సీ తమిళనాడు రాష్ట్ర పార్టీ కో ఇంఛార్జీ పొంగులేటి సుధాకర్ రెడ్డి ఒక ప్రకటనలో తీవ్రంగా విమర్శించారు .తెలంగాణలో కబ్జాలు , పోలీసు రాజ్యం నడుస్తోందని ఆయన ధ్వజమెత్తారు .ముఖ్యమంత్రి కేసీఆర్ కు రాజ్యాంగంపై విశ్వాసం లేదని విమర్శించారు .కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ పై ముఖ్యమంత్రి కేసీఆర్ మీడియా సమావేశంలో మాట్లాడిన తీరు అభ్యంతరకరంగా ఉందని ఆయన విమర్శించారు .

హుజరాబాద్ ఉప ఎన్నిక తర్వాత కెసిఆర్ లో నైరాశ్యం ఆవరించిందని ఆరోపించారు .తెలంగాణలో బీజేపీ బలోపేతం కావడం ముఖ్యమంత్రిని నిద్ర పట్టకుండా చేస్తున్నదని పేర్కొన్నారు .ఈ క్రమంలో తన ఇష్టారీతిన నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని విమర్శించారు .రాజ్యాంగాన్ని మార్చాలని అంటూ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అందించిన రాజ్యంగ ఫలాలు ఆస్వాదిస్తు కెసిఆర్ దిగజారుడు మాటలు మాట్లాడుతున్నారని విమర్శించారు . కేసిఆర్. అంబేద్కర్ ని అవమానించారని పేర్కొన్నారు. 75 సంవత్సరాలలో భారత ప్రభుత్వం ఎన్నడూ చూడని సంక్షేమ బడ్జెట్లో ప్రవేశపెట్టారని ఆయన కొనియాడారు.

ఆత్మ నిర్భర్ భారత్ లక్ష్యంగా బడ్జెట్ రూపకల్పన జరిగిందని పేర్కొన్నారు కష్టకాలంలో భారత ఆర్థిక వ్యవస్థ స్థిరంగా కొనసాగుతోందని పేర్కొన్నారు రాబోయే భారతావని కోసం బడ్జెట్లో రూపకల్పన జరిగిందని ఆయన అభివర్ణించారు.

LEAVE A RESPONSE