-సంక్షేమ పథకాలు అమలు చేయడంలో తెలంగాణ రాష్ట్రం నెంబర్ వన్ స్థానం లో ఉంది
-గుత్తా సుఖేందర్ రెడ్డి
వివిధ ప్రైవేట్ హాస్పిటల్ లో చికిత్స పొందిన17 మంది లబ్ధిదారులకు 10,32,000 తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి నేడు నల్గొండ లోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి గారి సహాయనిధి ద్వారా ( సీఎంఆర్ఎఫ్) మంజూరు అయిన చెక్కులను అందజేశారు.ఈ సందర్భంగా తెలంగాణ శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ..
” తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం అందించలేని సంక్షేమ పథకాలను ప్రజలకు అందిస్తుందన్నారు. మిగతా రాష్టాల్లోని ప్రజలు కూడా ఆయ రాష్ట్రాలలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను అమలు చేయాలని కోరుకుంటున్నారని ఆయన తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ గారు గొప్ప విజన్ ఉన్న నాయకుడని,ఇప్పుడు దేశం మొత్తం ఆయన నాయకత్వం వైపు మక్కువ చూపుతుందని చెప్పారు.ఈ కార్యక్రమంలో నల్గొండ జిల్లా జడ్పి చైర్మన్ బండ నరేందర్ రెడ్డి,తదితరులు కూడా పాల్గొన్నారు.