- సిరిపురపు శ్రీధర్ శర్మ రాష్ట్ర అధ్యక్షులు బ్రాహ్మణ చైతన్య వేదిక
– సిరిపురపు శ్రీధర్ శర్మ ఆరోపణ
విజయవాడ : పేద, మధ్య, ఉన్నత తరగతి బ్రాహ్మణుల సంక్షేమం కోసం అప్పటి, ఇప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మాజీ సిఎస్ ఐ వై ఆర్ కృష్ణారావు నేతృత్వంలో ఆనాటి ప్రభుత్వం బ్రాహ్మణ కో-ఆపరేటివ్ క్రెడిట్ సోసైటీ 40 కోట్ల రూపాయల మూలనిధితో ఏర్పాటు చేశారని బ్రాహ్మణ చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు సిరిపురపు శ్రీధర్ శర్మ విలేకరుల సమావేశంలో తెలిపారు.
బ్రాహ్మణ కోపరేటివ్ సొసైటీలో బ్రాహ్మణులు దాచుకున్న డబ్బులను గత వైసీపీ ప్రభుత్వంలో దోచుకున్నారని, గత వైసీపీ ప్రభుత్వానికి ఈ సొసైటీ సీఈవో తాబేదారిగా మారి, సర్వీస్ రూల్స్ కి వ్యతిరేకంగా ఒకే చోట 8 సం.లుగా ప్రభుత్వ ఉద్యోగంలో డిప్యూటేషన్ పై వచ్చి బ్రాహ్మణ కోపరేటివ్ క్రెడిట్ సొసైటీలో పాతుకుపోయి రెండు జీతాలు తీసుకుంటున్న బ్రాహ్మణ కో-ఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ సీఈవో జి.నాగసాయి పై గత జగన్ ప్రభుత్వం నుండి నేటి వరకు ఎన్నో ఫిర్యాదులు వచ్చిన సరే ఈ కూటమి ప్రభుత్వంలో వున్న అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడంలేదని ప్రశ్నించారు. మతలబు ఏంటో అధికారులు తెలియజేయాలని శ్రీధర్ డిమాండ్ చేశారు.
టిడిపి రాష్ట్ర బ్రాహ్మణ సాధికార సమితిలో ఉన్న కొంతమంది బ్రోకర్లు ఈ అవినీతిపరుడుకి ఎలా మద్దతు ఇస్తున్నారని శ్రీధర్ ప్రశ్నించారు. ఎంతో ముందు చూపుతో బ్రాహ్మణ సంక్షేమం కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ సొసైటీని ఏర్పాటు చేస్తే దానికి చెడ్డ పేరు చేస్తున్న సీఈఓ కి టిడిపి సాధికార సమితి ఎలా మద్దతు ఇస్తుందని శ్రీధర్ ప్రశ్నించారు.