– బొగ్గు గనుల కాంటాక్ట్ కోసం ముఖ్యమంత్రి , మంత్రులకు మధ్య పంచాయితీ
– తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు రేవంత్ రెడ్డి లేనే లేడు.
– మాజీ మంత్రి సత్యవతి రాథోడ్
హైదరాబాద్: రాష్ట్రంలో రేవంత్ రెడ్డి రాజ్యాంగం అమలు అవుతుంది. పోలీస్ వ్యవస్థను అడ్డంపెట్టుకొని రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని నడిపిస్తున్నాడు. తెలంగాణ ప్రజానీకం అన్ని గమనిస్తూనే ఉంది. మా పార్టీ ఉప నాయకుడు హరీష్ రావు నిన్న మీడియా సమావేశం పెట్టారు. బొగ్గు కుంభకోణం బయటపెట్టారు .
దురుద్దేశ్యంతో మా నాయకుడు హరీష్ రావుకు నోటీసులు ఇచ్చారు. రాష్ట్రాన్ని కాపాడాల్సిన మంత్రులు ఏ విధంగా దోచుకుంటున్నారో వివరంగా హరీష్ రావు చెప్పారు..అందుకే కుట్ర పూరితంగా హరీష్ రావుకు సిట్ నోటీసులు ఇచ్చింది. హరీష్ రావు అడిగిన ప్రశ్నకు ప్రభుత్వం సమాధానం చెప్పలేక పోతుంది.అక్రమ కేసులకు మేము భయపడం..
న్యాయ వ్యవస్థ పై మాకు నమ్మకం ఉంది.. ఫోన్ ట్యాపింగ్ కేసును సుప్రీంకోర్టు కొట్టివేసింది.ప్రజల దృష్టిమలచడం రేవంత్ రెడ్డికి వెన్నతో పెట్టిన విద్య.. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బిఆర్ఎస్ 37 శాతం గెలిచింది. కేసీఆర్ కు అత్యంత ఆదరణ గ్రామాల్లో ఉంది.. కుట్ర పూరితంగా హరీష్ రావుకు నోటీసులు ఇచ్చారు..
ఫోన్ ట్యాపింగ్ కేసును సీరియల్ మాదిరి రెండేళ్లగా నడిపిస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో సీనియర్ IPS అధికారిని వేధించారు.ఫార్ములా ఈ కార్ రెస్ లో అవినీతి జరిగిందని కేటీఆర్ కు నోటీసులు ఇచ్చారు..అందులో ఏం లేదని తెలిసిపోయింది.. ఫోన్ ట్యాపింగ్ కేసులో కూడా హరీష్ రావు కడిగిన ముత్యంలా బయటకు వస్తారు.
మాకున్న ప్రజా బలంతో మేము తప్పకుండా మళ్ళీ అధికారంలోకి రావడం ఖాయం…
మేము అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్, రేవంత్ రెడ్డి భారీ మూల్యం చెల్లించక తప్పదు..రెండేళ్లగా కాంగ్రెస్ ప్రభుత్వం అనేక అవినీతి చేస్తుంది.. బిఆర్ఎస్ ను విమర్శించే బిజెపికి చిత్తశుద్ధి ఉంటే బొగ్గు టెండర్ అవినీతి పై విచారణ జరపండి..బొగ్గు గనుల కాంటాక్ట్ కోసం ముఖ్యమంత్రి , మంత్రులకు మధ్య పంచాయితీ నడుస్తుంది…
మంత్రుల మధ్య పంచాయితీనీ ప్రశ్నిస్తుంటే కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు పైన కేసులు..ఖమ్మంలో రేవంత్ రెడ్డి దిగజారి మాట్లాడిండు. బిఆర్ఎస్ దిమ్మెలు కూలగొట్టండి అని స్టేట్ మెంట్ ఇస్తున్నాడు..తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు రేవంత్ రెడ్డి లేనే లేడు.. అప్పుడు, ఇప్పుడు రేవంత్ రెడ్డి బ్లాక్ మెయిలర్. రేవంత్ రెడ్డికి ఉన్నటువంటి బుద్దులు రోజుకొకటి బయటపడుతున్నాయి.
కేసులు మాకు కొత్త కాదు, ఎన్ని సార్లు పిలిచిన మేము విచారణకు హాజరు అవుతాము..
ఇచ్చిన వాగ్దానాలు అమలు చెయ్యకుండా డైవర్ట్ పాలిటిక్స్.. ముఖ్యమంత్రి , ముఖ్యమంత్రి మనవడు ఫుట్ బాల్ ఆడేందుకు 10 కోట్లు ఖర్చు చేసి స్టేడియం కట్టుకున్నాడు..ఆనాడు కేసీఆర్ మనవడు హిమాన్ష్ పై ఇష్టం వచ్చినట్లు మాట్లాడిన రేవంత్ రెడ్డి, ఇవ్వాళ రేవంత్ రెడ్డి మనవడితో అన్ని చోట్లకు వెళ్తున్నారు..