Home » అప్పుడు 15 పైసలే ప్రజలకు చేరేది

అప్పుడు 15 పైసలే ప్రజలకు చేరేది

– అందుకే మమ్మల్ని ఎన్నుకున్నారు
– మోదీ ప్రసంగంలో ఏపీ ప్రస్తావన

ఢిల్లీ: కాంగ్రెస్ హయాంలో ఢిల్లీ నుంచి రూపాయి విడుదలైతే.. కేవలం 15 పైసలు మాత్రమే లబ్ధిదారులకు చేరేదని ప్రధాని మోదీ విమర్శించారు. ఎక్కడా చూసినా స్కామ్ జరిగాయని మండిపడ్డారు. తమ ప్రభుత్వంలో అవినీతి తగ్గిందన్నారు. తమకు దేశం ఫస్ట్ అని.. మిగిలినవి తర్వాతేనని వివరించారు.

నిరాశలో ఉన్న దేశాన్ని అభివృద్ధి వైపు నడిపించామని పేర్కొన్నారు. తమ ప్రభుత్వంలో అవినీతిని సహించేదిలేదని ప్రధాని మోదీ తెలిపారు. తమ ప్రభుత్వ హాయాంలో ప్రపంచంలో భారత్ ప్రతిష్ట పెరిగిందని వివరించారు. 25 కోట్ల మందికిపైగా ప్రజలను పేదరికం నుంచి బయటపడేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, అందుకే ప్రజల ఆశీర్వాదం లభించిందన్నారు. అబద్ధాలతో మభ్యపెట్టాలని చూసిన వారిని ప్రజలు ఓడించారని చెప్పారు.

ప్రధాని మోదీ లోక్సభ ప్రసంగంలో ఏపీ ప్రస్తావన తీసుకొచ్చారు. ఈసారి ఎన్నికల్లో ఎన్డీయే కూటమి రాష్ట్రంలో క్లీన్ స్వీప్ చేసిందని చెప్పారు. భూతద్దం పెట్టి చూసినా విపక్షాల జాడ కనిపించదని సెటైర్ వేశారు. ఒడిశా, మధ్యప్రదేశ్, రాజస్థాన్ లో కూడా మంచి ఫలితాలు సాధించామని అన్నారు. దేశంలో చాలా మంది ప్రజల ప్రేమను తాము పొందామని తెలిపారు.

Leave a Reply