– ‘ఆయతుల్లాహ్ ఖామినాఈ’ నిర్మూలనకు వ్యతిరేకంగా మతోన్మాద ఆగం!
లాహౌల వలా ఖువ్వత ఇల్లా బిల్లాహ్’
لَا حَوْلَ وَلَا قُوَّةَ إِلَّا بِاللَّهِ
ఇది అరబీ భాష ‘దుఆ’. దుఆ అంటే ప్రార్థన. నబీ అయిన మొహమ్మద్ చెప్పిన అరబీ మాటలు ఇవి. అరబీ ఇస్లామ్‌కు ముందే ఉన్న భాష; మొహమ్మద్ నబీ కూడా ఇస్లామ్‌కు ముందే కదా?!
అల్లాహ్ శక్తిని ఇస్తాడు అని స్థూలంగా దీనికి అర్థం. అల్లాహ్ అంటే భగవంతుడు అని. దుష్టశక్తుల నుంచి రక్షణ కోసమూ, దుష్టశక్తుల భయం తొలగిపోవడం కోసమూ, దుష్టశక్తులు తొలగిపోవడం కోసమూ అరబీ మాటలతో ఈ దుఆ ఉద్దేశించబడింది.
అది సరే ఇప్పుడెందుకు ఆ ప్రస్తావన?
‘ఆయతుల్లాహ్ ఖామినాఈ’ (అయతుల్లా ఖొమైని కాదు) అన్న కరుడుట్టిన తిరోగమన మత ఛాందసవాది చస్తే.. అందుకు అతడు అధ్యక్షుడుగా పరిపాలన చేసిన ఇరాన్ దేశమే అతడి చావుకు సంతోషిస్తూ సంబరాలు చేసుకుంటూంటే, ఏ ఇస్లామ్ దేశమూ ఆ మతోన్మాది మరణాన్ని ఖండిచకపోతూంటే మన దేశంలో మాత్రం ‘ఆయతుల్లాహ్ ఖామినాఈ’ నిర్మూలనకు వ్యతిరేకంగా మతోన్మాద ఆగం!
అంటే ‘ఆ మతం’ ఉన్మాదం ప్రపంచంలోనే మన దేశంలోనే భయంకరంగా ఉందా? ‘ఆ మతం’ ఉన్మాదం మనదేశానికి పెను అపాయంగా పరిణమించేసిందా? అక్కడ ఇరాన్లో ‘ఆయతుల్లాహ్ ఖామినాఈ’ నిర్మూలనం అయ్యాడు సరే. మనదేశంలో ఎంత మంది ‘ఆయతుల్లాహ్ ఖామినాఈ’లు ఉన్నారో? మనం ఎంత మంది ‘ఆయతుల్లాహ్ ఖామినాఈ’ల మధ్యలో ఉన్నామో?
‘ఆయతుల్లాహ్ ఖామినాఈ’ మీ పక్కనా, నా పక్కనా ఉన్నాడా?
మన పక్కనే ఉన్న ‘ఆయతుల్లాహ్ ఖామినాఈ’లు చెయ్యబోయే విధ్వంసానికి మనం సాక్ష్యంగా కూడా మిగలమేమో? మనదేశంలో మన పక్కనే ‘ఆయతుల్లాహ్ ఖామినాఈ’ ఉన్నాడేమో జాగ్రత్తగా పరిశీలిద్దాం. మనలోని ‘ఆయతుల్లాహ్ ఖామినాఈ’ల విషయంలో అప్రమత్తం అవుదాం.
ఆ ‘ఆయతుల్లాహ్ ఖామినాఈ’ గురించి కాదు మన పక్కన ఉన్న ‘ఆయతుల్లాహ్ ఖామినాఈ’ మనల్ని నిర్మూలించెయ్యక ముందే మనం స్పృహలోకి రావాలి. మనలోని ‘ఆయతుల్లాహ్ ఖామినాఈ’ల నుంచి మనదేశాన్ని రక్షించుకోవాలి.
మతోన్మాద, విద్వేషవాద, మాఫియాల, దేశ విచ్ఛిన్నకర, దేశద్రోహ దుష్టశక్తులు ‘ఆయతుల్లాహ్ ఖామినాఈ’లై ఇవాళ మనలోకి చొచ్చుకుని వచ్చేశాయేమో అన్న భయం వేస్తోంది.
మనం మేలుకోవాలి బాధ్యతాయుతంగా మెలగాలి. మనలోని ‘ఆయతుల్లాహ్ ఖామినాఈ’లను నిర్మూలిద్దాం. భగవంతుడు శక్తిని ఇస్తాడు.
‘లాహౌల వలా ఖువ్వత ఇల్లా బిల్లాహ్’
لَا حَوْلَ وَلَا قُوَّةَ إِلَّا بِاللَّهِ
– రోచిష్మాన్
9444012279