– దుర్గం చెరువు కబ్జా అనేది పూర్తిగా నిరాధారం
– దుర్గం చెరువు కబ్జా ఆరోపణలను ఖండించిన ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి చిట్ చాట్
హైదరాబాద్: దుర్గం చెరువు కబ్జా అనేది పూర్తిగా నిరాధారం. నాపై కక్షతో పెట్టిన కేసు. హైకోర్టులో ఆ క్షన్ పెడితే రెండెకరాలు కొన్నాం. అయితే తర్వాత చెల్లదని టిడిఆర్ ఇచ్చారు. తర్వాత దుర్గం చెరువు నిర్మాణం జరిగింది. బాలకృష్ణ, లహరి ఎస్టేట్ హరిబాబు భూములు పక్కనే ఉన్నాయి.
ప్రైవేట్ పార్కింగ్ పెట్టినందుకు నా పై కేసు పెట్టారు. దుర్గం చెరువులో నాకు భూమి లేదు. ప్రభుత్వ భూమి కబ్జా చేసినట్లు నిరూపిస్తే దేనికైనా సిద్ధం. రోడ్డు మీద, చెట్ల కింద వెహికిల్ పార్కింగ్ చేసినందుకు కేసు పెట్టారు. అక్కడ ప్రభుత్వ భూమి కూడా లేదు. అక్కడ ప్రైవేట్ బస్సుల పార్కింగ్ చేస్తారు. అక్కడ ప్రభుత్వ భూమి గజం కూడా లేదు. అక్కడ నటుడు బాలకృష్ణ, లహరి ఎస్టేట్ హరిబాబు భూములు ఉన్నాయి.
ఎవ్వరూ పర్సనల్ ఫిర్యాదు చేయలేదు. ఫిర్యాదులో హైడ్రా కనిపిస్తోంది. కేసు సమాచారం మా సిబ్బందికి పోలీసులు చెప్పారు. కేసు పై లీగల్ ఫైట్ చేస్తాం. పోలీస్ స్టేషన్ కు వెళ్తాను. పోలీసులకు సహకరిస్తారు. అక్కడ వెహికిల్ పార్కింగ్ చేయడం సహజం. బేషరతుగా కేసు విత్ డ్రా చేయకపోతే… ఎఫ్టిఎల్ లో ఇండ్లు కట్టారు. ఆ ఇండ్ల ముందు ధర్నా చేస్తా.