– సొంత నిర్ణయాలను నాయకత్వంపై రుద్దబోం
– పదవుల కోసం ఏనాడూ పాకులాడబోం
– పార్టీ ఆదేశాలను శిరసావహిస్తాం
– దయచేసి పత్రికల్లో తప్పుడు వార్తలు రాయొద్దని కోరుతున్నా…
– కాంగ్రెస్, బీఆర్ఎస్ మాదిరిగా బీజేపీని చూడొద్దని విజ్ఞప్తి చేస్తున్నా…
– కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ వివరణ
చొప్పదండి: భారతీయ జనతా పార్టీలో వ్యక్తిగత నిర్ణయాలు ఉండబోవని, ఎవరికి ఏ బాధ్యత అప్పగించాలనేది పార్టీ నాయకత్వమే నిర్ణయిస్తుందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ చెప్పారు. ‘‘మాకు ఈ పదవి కావాలి? ఆ పదవి కావాలంటూ సొంత నిర్ణయాలను ఎన్నడూ పార్టీ నాయకత్వంపై రుద్దబోం. ఎందుకంటే బీజేపీ క్రమశిక్షణ కలిగిన పార్టీ. నాయకత్వం ఏది చెబితే అది శిరసావహించి పనిచేస్తాం. పార్టీ నాయకత్వం తీసుకునే నిర్ణయాలను అమలు చేయడమే కార్యకర్తలుగా, నాయకులుగా మా బాధ్యత’’అని పేర్కొన్నారు. కరీంనగర్ జిల్లా చొప్పదండిలో శనివారం కిసాన్ సమ్మాన్ నిధి, సైకిళ్ల పంపిణీ కార్యక్రమానికి హాజరై వెళుతుండగా ఓ పత్రికలో తనను మంత్రి పదవి నుండి విముక్తి చేయాలంటూ వస్తున్న వార్తలపై మీడియా అడిగిన ప్రశ్నకు పైవిధంగా బదులిచ్చారు. ఈ సందర్భంగా సంజయ్ ఏమన్నారంటే…
పదవుల కోసం మేం ఎన్నడూ పాకులాడబోం. అంతేగానీ పార్టీ వద్దకు పోయి మాకు ఈ పదవి కావాలి? ఆ పదవి కావాలని సొంత నిర్ణయాలను పార్టీ నాయకత్వంపై రుద్దబోం. దయచేసి ఇలాంటి తప్పుడు వార్తలు రాయొద్దని కోరుతున్నా. కాంగ్రెస్, బీఆర్ఎస్ ను చూసి బీజేపీ కూడా అట్లనే అని భావిస్తున్నారమో… అట్లా కాదు. బీజేపీలో సమష్టి నిర్ణయాలుంటాయి. వాటిని అమలు చేసే బాధ్యత కార్యకర్తలుగా మాపై ఉంటుంది. కమిట్ మెంట్ కలిగిన నాయకుడిగా భావిస్తాం.