Suryaa.co.in

Telangana

ఆ సంస్థపై పాకిస్తాన్ ఇంటర్ పోల్ రెడ్ వారెంట్ ఉంది

– ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఈ కంపెనీని బహిష్కరించింది
– ఝార్ఖండ్ ప్రభుత్వం బ్లాక్ లిస్ట్ చేసింది
– బిఆర్ఎస్ నేత క్షమాపణ చెప్పరు
– సోషల్ మీడియాలో తన ట్వీట్లు తొలగించబోరు
– బిఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ మన్నె క్రిశాంక్ తరపున MEINHARDT సంస్థ లీగల్ నోటీసులకు సమాధానం ఇచ్చిన బిఆర్ఎస్ లీగల్ సెల్ విభాగం

హైదరాబాద్‌: సీఎం రేవంత్ బహిరంగంగా ఒక 1 లక్ష 50 వేల కోట్ల ఖర్చుతో మూసీ సుందరీకరణను ప్రకటించారు, MEINHARDT సంస్థ యాజమాన్యం గతంలో ముఖ్యమంత్రి రేవంత్ ని తన కార్యాలయంలో కలిసింది.టెండర్ నిబంధనలను ఉల్లంఘిస్తూ సైతం, ఈ కంపెనీకి ప్రభుత్వం కాంట్రాక్టును కట్టబెట్టింది.

ఇతర కంపెనీ తక్కువ ధర quote చేసినా ఆ కంపెనీ నీ పక్కన పెట్టి మరి ఈ MEINHARDT కు ఇవ్వడం అనుమానాస్పదంగానే ఉంది. క్రిశాంక్ ఆ సంస్థ పై ఆధారాలతో వేసిన ఆరోపణలు, ఆ సంస్థపై పాకిస్తాన్ ఇంటర్ పోల్ రెడ్ వారెంట్ వేయడం, భారతదేశ ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఈ కంపెనీని బహిష్కరించడం, ఝార్ఖండ్ ప్రభుత్వం బ్లాక్ లిస్ట్ చేయడం ఇవన్నీ వాస్తవాలే.

MEINHARDT సంస్థ కోరినట్టు బిఆర్ఎస్ నేత క్షమాపణ చెప్పరు. సోషల్ మీడియాలో తన ట్వీట్లు తొలగించబోరు. MEINHARDT ఇచ్చిన నోటీసుల్లో కూడా ఈ కేసులు వారిపై ఉన్నట్టు ఒప్పుకున్నారు. మూసి కాంట్రాక్టు ప్రజాధనంతో కూడుకున్నది, కాబట్టి ఒక ప్రతిపక్ష పార్టీలో బాధ్యతగల నాయకునిగా, ఆ పార్టీ యొక్క సోషల్ మీడియా కన్వీనర్ గా, మీడియా చర్చల్లో పాల్గొనే నేతగా, ప్రశ్నించే స్వాతంత్రం, హక్కు క్రిశాంక్ కు ఉన్నదని లీగల్ సెల్ పేర్కొన్నది.

లీగల్ నోటీసుల పేరుతో భయపెడితే సరికాదని, దీనిపై కోర్టులో పోరాటానికి సైతం బిఆర్ఎస్ పార్టీ లీగల్ సెల్ సిద్ధంగా ఉందని జవాబులో పేర్కొన్నారు.

LEAVE A RESPONSE