– జీవోను ప్రజలు, మీడియావాళ్ళు చదవాలి
– లేని నిషేధాన్ని ఉన్నట్టు చిత్రీకరించడం సబబు కాదు
– కందుకూరు, గుంటూరు దుర్ఘటనల వల్లే జీవో నెం.1 వచ్చింది
– ఇరుకుసందుల్లో సభలు, ర్యాలీలు వద్దన్నదే జీవో సారాంశం…
– జీవించే ప్రజల హక్కును కాలరాస్తామంటే ఎలా..?
– బాబు విలనా? జీవో విలనా? అన్నది ప్రజలే గుర్తించాలి..
–వైఎస్సార్‌సీపీ లీగల్‌సెల్ రాష్ట్ర అధ్యక్షుడు ఎం. మనోహర్‌రెడ్డి
లేని నిషేధాన్ని ఉన్నట్టు చిత్రీకరిస్తున్నారుః
పర్మిషన్లు తీసుకుని, సభలు, ర్యాలీలు ఎవరికీ ఇబ్బంది కలగని రీతిలో నిర్వహించాలని మాత్రమే ప్రభుత్వం జీవో నెంబర్ -1లో స్పష్టంగా పేర్కొంది. ప్రతిపక్షాలు మాత్రం కనీసం జీవోను చదవకుండా రాద్ధాంతం చేస్తున్నాయి. లేని నిషేధాన్ని ఉన్నట్టు చిత్రీకరిస్తున్నారు. పైగా అధికార పార్టీ జీవోను ఉల్లంఘించి ర్యాలీలు నిర్వహించిందని పచ్చ పత్రికల్లో నిత్యం ఫోటోలు వేసి మరీ తప్పుడు రాతలు రాస్తున్నారు. సభలు, ర్యాలీలపై నిషేధం లేదన్న విషయాన్ని ఎల్లో పత్రికలు, టీవీలు పట్టించుకోకుండా.. ప్రజలను పక్కదారిపట్టించేలా ఇలాంటి రాతలు రాయడం సరైంది కాదని వైఎస్సార్‌సీపీ లీగల్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు ఎం. మనోహర్‌రెడ్డి హితవు పలికారు. ఇలాంటి దుష్ప్రచారాలను అరికట్టడానికి జీవోను ప్రతి ఒక్కరూ చదవాలని, మీడియా ప్రతినిధులు, యాజమాన్యాలు కూడా చదవాలని కోరారు.
జీవించే ప్రజల హక్కును కాలరాస్తామంటే ఎలా..?:
రైట్ టు లైవ్‌లీ హుడ్ , రైట్ టు ఫ్రీ మూమెంట్ అనేవి పౌరులకున్న హక్కులు. వాటిని విస్మరిస్తామంటే అది సమంజసమేనా? పంచాయతీ రోడ్లు, మున్సిపల్ రోడ్లు కొన్ని చోట్ల ఇరుకుగా ఉంటాయి కనుక… అలాంటి చోట్ల సభలు వద్దనే జీవో సారాంశం. విశాలమైన మైదానాల్లో పోలీసుల అనుమతితో నిర్వహించుకోవచ్చని స్పష్టంగా జీవోలో ఉంది. ఎంట్రీ, ఎగ్జిట్ ఫ్రీగా ఉండేలా చూడాలని, హైటెన్షన్ వైర్లు లేని ప్రాంతాల్లో సమావేశాలు నిర్వహించుకోవాలని జీవోలో ఉంది. నిత్యావసరాల వస్తువులు, గర్భిణులు, ఇతరత్రా రవాణాకు ఎక్కడా అంతరాయం లేని విధంగా సభలు ఏర్పాటు చేసుకోవాలని మాత్రమే జీవో సూచించింది.
ఎవరు విలన్?
జీవోను వక్రీకరిస్తూ మాట్లాడే చంద్రబాబు, పవన్‌కళ్యాణ్‌ల దుష్ప్రచారాన్ని తిప్పికొడతాం. పవన్‌కళ్యాణ్, బాబు సభలకు అనుమతి ప్రభుత్వం ఇచ్చింది. అయినా సరే జీవోను వక్రీకరిస్తూ ప్రతిపక్షాలు చేసే దుష్ప్రచారాన్ని నమ్మవద్దని ప్రజలను కోరుతున్నాం. ఇప్పటికీ, ప్రతిపక్షాలు బాధ్యతాయుతంగా వ్యవహరిస్తామని చెప్పకుండా… ఇరుకుసందుల్లోనే సభలు నిర్వహిస్తామనే రీతిలో మాట్లాడుతున్నాయి. బాబు, పవన్‌కళ్యాణ్‌ల సభలను ఎక్కడా అడ్డుకోలేదు. కందుకూరు, గుంటూరుల్లో సభల పేరుతో ప్రజల ప్రాణాలు తీసిన చంద్రబాబు విలనా? లేక జీవో విలనా?.. అనేది ప్రజలు గుర్తించాలి. కర్ణాటకలో సిద్ధలింగ స్వామి మరణిస్తే హాజరైన 2 లక్షల మంది జనాన్ని కుప్పం సభకు వచ్చినట్లు ఫొటోలు మార్ఫింగ్ చేసి ఎల్లో మీడియాలో ప్రచారం చేశారు.ర్యాలీలు, సభలపై నిషేధం లేదు. గత నెల 28న కందుకూరులో అనుమతించిన చోట కాకుండా ఇరుకుసందులో చంద్రబాబు సభ నిర్వహించడం వల్లే తొక్కిస లాట జరిగింది. ఆ దుర్ఘటనలో 8 మంది మరణించడం దురదృష్టకరం. డ్రోన్ల ద్వారా ఫొటోలు తీసి, పది మంది వస్తే వేయి మంది వచ్చినట్లు ప్రచారం చేయాలనే దుగ్ధతో, ఒక ప్రణాళిక ప్రకారం బాబు కుట్రలు చేస్తున్నారు. ఆ తర్వాత గుంటూరులో జనవరి1న చంద్రన్న కానుక పేరిట పప్పు, బెల్లం, చీరలు, సారెలు ఇస్తామని, 30 వేల మందికి టోకెన్లు ఇచ్చి, 4 గంటల పాటు పేదలను నిలబెట్టిన తర్వాత అందరికీ ఇవ్వకుండా, ట్రాక్టర్ల ద్వారా కొద్దిమందికి విసిరేశారు. అప్పటికే డ్రోన్లతో ఫొటోలు తీసి, జనం విపరీతంగా వచ్చారని ప్రచారం చేసుకున్నారు. మనుషులు చనిపోయినా ఫర్వాలేదు…ఎవరేం అయిపోయినా …మేం అధికారంలోకి రావాలనే యావ బాబుది. మానవత్వం లేని బాబు తీరు అత్యంత హేయం. అదేమంటే ప్రజా భద్రతకు చర్యలు తీసుకోకపోవడం వల్ల జనం చనిపోతున్నారని ప్రభుత్వంపై ఎదురుదాడికి దిగే నైజంతో బాబు వ్యవహరిస్తున్నారని మనోహర్‌రెడ్డి దుయ్యబట్టారు.
బాబు హయాంలోనూ ఇవే జీవోలు:
ప్రభుత్వానికి ప్రజల రక్షణ ముఖ్యం . ఇంతకుముందు బాబు హయాంలోనూ ఇవే జీవోలు ఉన్నాయి. ఆ రోజు జగన్ పాదయాత్ర సందర్భంగా అప్పటి టీడీపీ ప్రభుత్వం, ఆనాటి డీజీపీ అనేక ఆంక్షలను విధించారు. ఆ రోజులను మరిచిపోయి, బాబు సేవ్ డెమోక్రసీ పేరిట దుష్ప్రచారం చేస్తున్నారని మనోహర్‌రెడ్డి ఎద్దేవా చేశారు.