బిజెపి ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి ఎద్దేవా
అనంతపురం:-కె.ఎ.పాల్ పార్టీకి కెసిఆర్ పార్టీకి తేడా లేదు. ఢిల్లీలో కుంభకోణం నుంచి కాళేశ్వరం వరకు అక్రమంగా దోచుకొన్నారు. తెలుగు రాష్ట్రాల్లో అడుగు పెట్టాలంటే తెలుగు తల్లికి క్షమాపణ చెప్పాలి. ఇతర రాష్ట్రాలకు తెలంగాణ తల్లిని తీసుకొస్తారా. మీ ఇంట్లో మంత్రి పదవుల కోసం రాష్ట్రాన్ని చీల్చారే. ఆంధ్రప్రదేశ్ నీటి ప్రాజెక్టుల విషయంలో మీ వైఖరి ఏంటి. ఆంధ్రప్రదేశ్ కు బకాయిపడ్డ బిల్లులు చెల్లించలేదే. కుంభకోణాల నుంచి తప్పించుకోవడానికి పార్టీ పెట్టారా.
కెసిఆర్ పార్టీకి జెండాలు అజెండాలు ఉండవు. ఆంధ్రప్రదేశ్ లో వైకాపా మరోసారి అధికారంలోకి వస్తే రాష్ట్రాన్ని అమ్మేస్తుంది. కేంద్రం వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి డబ్బులు ఇస్తే వాటికి రాష్ట్రం లెక్కలు చెప్పలేదు. ఆంధ్రప్రదేశ్ కు ఆర్థిక క్రమశిక్షణ లేదు.