Suryaa.co.in

Telangana

బీఆర్ఎస్ నాయకుల దాడులకు భయపడేది లేదు

– బిజెపి తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు గంగిడి మనోహర్ రెడ్డి

బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజలకు ఇచ్చిన అనేక హామీలను విస్మరించింది. అసమర్థ, అరాచక బీఆర్ఎస్ సర్కారును నిలదీసేలా, వైఫల్యాలను ఎండగట్టేలా భారతీయ జనతా పార్టీ గత కొన్ని రోజులుగా నిరసన కార్యక్రమాలు చేపట్టింది. వివిధ పథకాలకు అర్హులైన ప్రజలతో కలిసి అన్ని జిల్లాల్లో బిజెపి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టాం.

హన్మకొండ వెస్ట్ నియోజకవర్గంలో శాంతియుతంగా నిరసన చేపట్టిన బిజెపి నాయకులను పోలీసులు అడ్డుకోవడమే కాకుండా దాడిచేసి గాయపర్చడం హేయమైన చర్య. ఇచ్చిన హామీలను అమలు చేయండని ప్రజలు వస్తే బీఆర్ఎస్ నాయకులు, పోలీసులు దాడులు చేయడం దుర్మార్గ చర్య.

నిన్న నకిరేకల్ లో అక్కడి బీఆర్ఎస్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అనుచరులు బిజెపి కార్యకర్తలపై దాడులకు తెగబడ్డారు. నర్సంపేట నియోజకవర్గంలో పెద్ది సుదర్శన్ రెడ్డి అనుచరులు బిజెపి కార్యకర్తలపై దాడి చేసి గాయపర్చారు.

నేడు వరంగల్ వెస్ట్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ అనుచరులు బిజెపి కార్యకర్తలను కర్రలతో దాడులు చేశారు. ఈ దాడుల్లో ఆరుగురు బిజెపి కార్యకర్తలకు తీవ్ర గాయాలయ్యాయి. నలుగురకి తలలు పగిలాయి.బీఆర్ఎస్ నాయకుల దాడులకు భయపడేది లేదు. బిజెపి పోరాటం ఆగదు.

పోలీసులు అరెస్టు చేసిన భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాం. అలాగే గాయపడ్డ కార్యకర్తలకు వైద్యం అందించాలి.రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలకు నిరసనగా ఆగస్టు 25 వ తేదీన అన్ని జిల్లాల కలెక్టర్ కార్యాలయాలు ముట్టడిస్తాం. అరాచక బీఆర్ఎస్ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి ప్రజాకోర్టులో దోషిగా నిలబెడుతం. పేద ప్రజల తరఫున పోరాటం ఉధృతం చేస్తాం.

LEAVE A RESPONSE