Suryaa.co.in

Andhra Pradesh

గీత దాటిన ఏ అధికారిని వదిలిపెట్టే ప్రసక్తి ఉండదు

– ఎన్నికల సన్నాహాల్లో భాగంగా తెదేపా నేతలతో ప్రత్తిపాటి పుల్లారావు సమీక్ష

రాష్ట్రంలో అధికార వైకాపా సేవలో తరిస్తూ ఒళ్లు మరిచి, గీత దాటి ప్రవర్తిస్తున్న ఏ అధికారిని వదిలే పెట్టే ప్రసక్తే ఉండదని హెచ్చరించారు మాజీమంత్రి, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ప్రత్తిపాటి పుల్లారావు. ముఖ్యమంత్రి చెప్పారని, సజ్జల ఆదేశించాడని, స్థానిక వైకాపా నేతల్ని ప్రసన్నం చేసుకోవాలని ఇంతకాలంగా దారితప్పిన అధికారులకు అరాచకాలకు కాలం చెల్లినట్లే అని స్పష్టం చేశారాయన.

తిరుపతి లోక్‌సభకు ఉప ఎన్నికల సమయంలో తిరుపతి మున్సిపల్ కమిషనర్‌గా ఉండి ఓట్ల అక్రమాలకు కొమ్ముకాసిన ఐఏఎస్‌ అధికారి గిరీషాను ఎన్నికలసంఘం సస్పెండ్‌ చేయడం జస్ట్ ప్రారంభం మాత్రమే అన్నారు ప్రత్తిపాటి. అలాంటి పదిమంది వరకు ఐఏఎస్‌ అధికారులపై ఇప్పటికే తెలుగుదేశం పార్టీ తరఫున కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశామని, చిత్తూరు ఎస్పీ రిషాంత్‌ రెడ్డి సహా మరికొందరు ఐపీఎస్‌ అధికారులు కూడా వైకాపాకు ఊడిగం చేసే జాబితాలో ఉన్నారన్నారు ప్రత్తిపాటి. ప్రజాస్వామ్యవనంలో ఇలాంటి కలుపు మొక్కల్ని సాధ్యమైనంత త్వరగా ఏరేయకపోతే మొత్తం వ్యవస్థనే భ్రష్ఠుపట్టిస్తారని మండిపడ్డారు.

రానున్న ఎన్నికలకు సన్నాహాల్లో భాగంగా చిలకలూరిపేటలో తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులతో శనివారం ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చిలకలూరిపేట నియోజకవర్గ జనసేన సమన్వయకర్త తోట రాజా రమేష్ కూడా పాల్గొన్నారు‌. ఈ సందర్భంగా మాట్లాడిన ప్రత్తిపాటి రానున్న రోజుల్లో మరికొందరు ఉన్నతాధికారులు, ఐఏఎస్‌, ఐపీఎస్‌లపై తప్పకుండా ఈసీ చర్యలు ఉంటాయని అన్నారు. రానున్న ఎన్నికలు పారదర్శకంగా, స్వేచ్ఛాయుత వాతావరణంలో జరుగుతాయని నమ్మకం కలిగించాలంటే ఈసీకి కూడా అంతకు మించిన మార్గం లేదన్నారు.

మరీ ముఖ్యంగా పోలీస్‌ విభాగంలో అధికారపక్షంతో అంటకాగుతున్న వారందర్నీ పక్కనపెట్టకపోతే ఎన్నికల వ్యవస్థనే అపహాస్యం చేసే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. వీళ్లే కాకుండా గడిచిన ఐదేళ్లుగా అధికారా పార్టీ పెద్దలు చెప్పినట్టల్లా ఆడుతూ ఇంతకాలం ప్రజలు, తెలుగుదేశం, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలను ఇబ్బంది పెట్టిన ఏ ఒక్క అధికారిని వదిలి పెట్టే అవకాశం లేదని పేర్కొన్నారు

LEAVE A RESPONSE