అమరావతి: జిల్లా పరిషత్‌ల పునర్విభజన లేదని ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసింది.13 జిల్లా పరిషత్‌లు యథావిధిగా కొనసాగుతాయని ప్రభుత్వం తెలిపింది.జిల్లాల పునర్‌వ్యవస్థీకరణతో పరిషత్‌లపై ప్రభావం ఉండదని ప్రభుత్వం చెబుతోంది.
ప్రస్తుత జిల్లా పరిషత్‌ల పదవీకాలం ముగిసేవరకు యథావిధిగా కొనసాగుతాయని ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. జిల్లా పరిషత్‌ల విభజన ఇప్పట్లో లేనట్లేనని మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు.
ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ జడ్పీల విభజనపై ప్రభుత్వం అధ్యయనం చేస్తోందని తెలిపారు.ప్రస్తుతమున్న జిల్లా పరిషత్‌ల నుంచే పాలన కొనసాగిస్తామని చెప్పారు. అధ్యయనం తర్వాత జడ్పీల విభజనపై విధివిధానాలు ప్రకటిస్తామని బొత్స స్యతనారాయణ తెలిపారు.