– ప్రభుత్వం రైతులను భయబ్రాంతులకు గురిచేసే ప్రకటనలు చేయకూడదు
– మోడీ ప్రభుత్వంలో రైతులకు ఎటువంటి కష్టం, నష్టం జరగదు
– పెస్టిసైడ్ షాప్ను పరిశీలించిన తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్రావు
చేవెళ్ల: పల్లెనిద్ర కార్యక్రమంలో భాగంగా బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావు చేవెళ్లలోని రైతు ఫర్టిలైజర్, సీడ్స్ & పెస్టిసైడ్స్ షాప్ను పరిశీలించారు. ఈ సందర్భంగా రైతుల సమస్యలు, యూరియా సరఫరా పరిస్థితులను ప్రత్యేకంగా పరిశీలించి, మీడియాతో మాట్లాడారు.
యూరియా కొరత ఏ విధంగానూ లేదని, రైతులు పంటలకు తగినంత యూరియా అందుతోందని రైతులు చెబుతున్నారు. కాంగ్రెస్ నాయకులు, రాష్ట్ర ప్రభుత్వం రైతులను భయబ్రాంతులకు గురిచేసే ప్రకటనలు చేయకూడదు. అవాస్తవ ప్రచారాలు సృష్టించరాదు.
రాష్ట్రంలో 20 వేల మెట్రిక్ టన్నుల యూరియా అవసరం ఉందని కోరగా.. కేంద్రం ఇప్పటివరకు 20 వేల మెట్రిక్ టన్నుల సరఫరా చేసింది. ఇంకా 2 లక్షల మెట్రిక్ టన్నుల అందుబాటులోకి తీసుకురావడం జరుగుతోంది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా రాష్ట్రానికి అవసరమైనంత యూరియా సరఫరా జరుగుతుందని స్పష్టంగా తెలిపారు.
రైతులు ఎక్కడా యూరియా కొరతతో ఆవేదన చెందకూడదు. ఎక్కడా బ్లాక్ మార్కెట్లో కొనరాదు. ఎవరైనా యూరియాను దాచిపెట్టి బ్లాక్ మార్కెట్ కోసం ప్రయత్నిస్తే, చట్టపరంగా చర్యలు తీసుకుంటాం. మోడీ ప్రభుత్వంలో రైతులకు ఎటువంటి కష్టం, నష్టం జరగదు.