– దాని అర్థం ఏమిటి?
(నిజం)
సూపర్ సిక్స్-సూపర్ హిట్ సభలో వైద్యారోగ్యశాఖ మంత్రి, బీజేపీ జాతీయ నేత సత్యకుమార్ యాదవ్ ప్రయోగించిన ‘‘క్లెప్టోక్రసీ గ్యాంగ్’’ పదం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. మీడియా- సోషల్మీడియా వ్యవహారాల్లో చురుకుగా ఉండే ఏకైక మంత్రి అయిన సత్యకుమార్ యాదవ్..వైసీపీ అధినేత జగన్ మనస్తత్వంపై సంధించిన ఆ పదప్రయోగం ఏమిటన్నది ఇప్పుడు మేధావి, విద్యావంతుల్లో చర్చనీయాంశంగా మారింది. ఇప్పుడుది అటు సోషల్మీడియాలో హల్చల్ అవుతోంది.
క్లెప్టోక్రసీ గ్యాంగ్ అనేది ఆంగ్ల పదం. దీని అర్థం. ప్రభుత్వాన్ని కవచంలా ఉపయోగించి ప్రజలను దోచుకునే పాలకులు. అంటే అధికారంలో ఉండి, ప్రజల కోసం కాకుండా, తమకోసమే సంపదలు దోచుకునే వ్యవస్థనే క్లెప్టోక్రసీ గ్యాంగ్ అంటారు.
సత్య కుమార్ ఈ పదాన్ని ప్రత్యేకంగా వైసీపీ నాయకత్వంపై వాడారు. ఎందుకంటే జగన్ ప్రభుత్వం ప్రజలను అడ్డగోలుగా దోచుకుని, ప్రజాస్వామ్యాన్ని కవచంగా వాడి, కుటుంబ ప్రయోజనాలకే పాలనను పరిమితం చేసిందని ఆయన అన్నారు. కాబట్టి, క్లెప్టోక్రసీ గ్యాంగ్ అంటే – ప్రభుత్వాన్ని పరికరంలా వాడుకుని, ప్రజల సొమ్మును, వనరులను దోచుకునే జగన్ గ్యాంగ్ అని అర్థం.